రాజన్న రాజ్యం కోసం కృషి చేద్దాం
Published Fri, Feb 7 2014 1:26 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
రేగిడి, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు, రాజన్న రాజ్యం కోసం అందరూ కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం అన్నారు. గురువారం మండల పరిధిలోని పుర్లిపేట, రేగిడి, చిన్నశిర్లాం, కె.వెంకటాపురం, సంకిలి, ఆడవరం, కొమెర, పెద్దపుర్లి, కొర్లవలస, నాయిరాలవలస తదితర గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి పాలవలస రాజశేఖరం పార్టీ కండువాలువేసి సాదరంగా ఆహ్వానించారు. రేగిడిలో... మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు సోదరుడు కిమిడి నీలంనాయుడు, ఆయన తనయుడు కిమిడి నరేంద్రనాయుడులు, బొండపల్లి రామన్నదొర, కొరపాన శ్రీను, జలుమూరు సూర్యనారాయణ పార్టీలో చేరారు.
చిన్నశిర్లాంలో సర్పంచ్ టంకాల అచ్చెన్నాయుడు, మాజీ సర్పంచులు బంకి నారన్నాయుడు, పాలవలస జగదీష్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు వావిలపల్లి వెంకటనాయుడు, మజ్జి అప్పలనాయుడు, ఉపసర్పంచ్ కొప్పిశెట్టి శ్రీను, టంకాల రామచంద్రినాయుడు చేరారు. పుర్లిలో.. మాజీ సర్పంచ్ కురిటి శ్రీరామ్మూర్తి, పట్టా మురళి, కురిటి శ్రీహరినాయుడు, కురిటి లక్షున్నాయుడు, మాజీ సర్పంచ్ మజ్జి రామ్మూర్తినాయుడు, సంకిలి మాజీ సర్పంచ్ ఎస్.తవిటినాయుడు పార్టీలో చేరారు. కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ సమన్వయకర్త పాల వలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ కన్వీన ర్ కంబాల జోగులు, పార్టీ కేంద్ర నిర్వాహక కమిటీ సభ్యుడు పీఎంజే బాబు, జాతీయ ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మామిడి శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు పి.పాపినాయుడు పాల్గొన్నారు.
ఎచ్చెర్లలో బడివానిపేట సర్పంచ్ చేరిక
ఎచ్చెర్ల క్యాంపస్ మండలంలోని బడివానిపేట సర్పంచ్ వారధి ఎర్రయ్య, ఉపసర్పంచ్ మూస అప్పన్న తదితరులు వైఎస్సార్‌పీపీలో చేరారు. గురువారం నిర్వహించిన బహిరంగ సభలో వారితో పాటు నాయకులు దోనెల హరికృష్ణ, బడి తోటయ్య, కొమర సోమయ్య (సమరం), పంచాయతీ సభ్యులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పీ బల్లాడ జనార్దన రెడ్డి, మాడుగుల మురళీధర్ బాబా,టి.పూర్ణారావు పాల్గొన్నారు.
లావేరులో...
లావేరు : శిగురుకొత్తపల్లి గ్రామానికిచెందిన కాంగ్రెస్, టీడీపీకి చెందిన పలువురు గురువారం రాత్రి వైఎస్సార్‌సీపీలో చేరారు. గ్రామానికి చెందిన మీసాల చిన్నసూర్యనారాయణ, పొన్నాడ మల్లేశ్వరరావు, మీసాల పెద్దసూర్యనారాయణ, పొన్నాడ చిన్నారావు, తిరుమరెడ్డి లక్ష్మణరావు, పొన్నాడ రాంబాబు, ఇలకల అబ్రహం, ఆర్.అప్పన్న, ఇలకల మోహనరావు, కప్పరాపు శివ, ఎ.రమేష్, మాజీ వార్డు మెంబరు రేగాన సన్యాసితో పాటు సుమారు 150 మంది పార్టీలో చేరారు. వారికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వా నించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లావేరు మండల కన్వీనర్ వట్టి సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు బాడిత వెంకటరావు, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ సిరిపురపు పున్నారావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement