త్వరలోనే రాజన్న రాజ్యం
Published Sun, Feb 9 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM
గజపతినగరం, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే.. వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ము ఖ్యమంత్రిని చేయూలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శని వారం దత్తిరాజేరు మండలం దాసరిపేట సర్పంచ్, టీ డీపీ నాయకుడు పోరుపురెడ్డి తిరుపతితో పాటు వంద కుటుంబాలు కడుబండి నివాస గృహంలో వైఎస్సార్ సీపీలో చేరారుు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే పేదలకు సంక్షేమ పథకాలు పూర్తిస్థారుులో అందుతాయన్నారు. ప్రతి ఒక్కరూ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. తమ పార్టీ ప్లీనరీలో ప్రకటించిన ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, డ్వాక్రా రుణాల రద్దు, బెల్టు షాపుల ఎత్తివేత, తదితర పథకాల వల్ల పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అనంతరం పార్టీలో చేరిన స ర్పంచ్ తిరుపతి, ఉప సర్పంచ్ హరి బంగారునాయు డు, వార్డు మెంబర్లు శనపతి కృష్ణ, బంకురు పార్వతి, దాసరి పద్మ, గంట తిరుపతి, దాసరి రా మకృష్ణ, గంట శ్రీనివాసరావు, తదితరులకు ఆయన కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మానాపురం, వింద్యవాసి సర్పంచ్ చుక్క సన్యాసినాయుడు, కోళ్ల వెంకట సత్య శేష సాయి,గుడివాడ శ్రీనివాసరావు, పెద్దింటి మోహన్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement