సూరిబాబు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం మున్సిపాలిటీ : నిరాడంబర ప్రజా సేవకుడు మున్సిపల్ మాజీ చైర్మన్ దివంగత అవనాపు సూరిబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. దివంగత సూరిబాబు 68వ జయంతి సందర్భంగా ఆయన కుమారులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, విక్రమ్ సోదరుల ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మజ్జి శ్రీనివాసరావు ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు.
ముందుగా సూరిబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ అవనాపు సూరిబాబు తన రాజకీయ జీవితంలో పేదల సంక్షేమం కోసం పరితపించారని, మున్సిపల్ చైర్మన్‌గా పట్టణ ప్రజలకు ఎన్నో సేవలందించారన్నారు. సూరిబాబు ఆశయ సాధనకు కృషి చేస్తూ తండ్రికి తగ్గ తనయులుగా విజయ్, విక్రమ్‌లు ఎదగాలని ఆకాంక్షించారు.
తండ్రి ఆశయాలను సజీవంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అవనాపు సోదరులకు గుర్తింపును తెస్తాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, విక్రమ్ సోదరులు మాట్లాడుతూ దానగుణం, పరోపకారం, సామాజిక సేవా కార్యక్రమాలు వంటి బాధ్యతలు తాము తమ తండ్రి నుంచి అలవర్చుకున్నామని, ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రజా సేవకు ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గ్రంధి వినోద్ ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులకు పుస్తకాలు, అట్టలను వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, అవనాపు సొదరులు పంపిణీ చేయగా... కాళ్ల నాయుడు మందిరం వద్ద 101 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.
పార్టీ నాయకులు పిళ్లా విజయ్‌కుమార్, కాళ్ల గౌరీశంకర్, కౌన్సిలర్లు గాడు అప్పారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ లెంక వరలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు గదుల సత్యలత, మంచాల శివాని, దక్కు లక్ష్మి, ఎర్రంశెట్టి సునీత, పార్టీ నాయకులు ఉప్పు ప్రకాష్, డోలా మన్మధకుమార్, ఒమ్మి శ్రీను, చందక రమణ, మల్లు త్రినాధ్, పిలకా శ్రీను, గంటా సూర్యనారాయణ, తోట మధు, పతివాడ వెంకటరెడ్డి, రౌతు చంటి, అన్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment