విజయనగరం, బొబ్బిలి రాజులను నమ్మొద్దు | Dont Believe the Bobbili and Vizayanagaram Rajas: Majji Srinivasarao | Sakshi
Sakshi News home page

విజయనగరం, బొబ్బిలి రాజులను నమ్మొద్దు

Published Fri, Apr 5 2019 2:58 PM | Last Updated on Fri, Apr 5 2019 2:59 PM

Dont Believe the Bobbili and Vizayanagaram Rajas: Majji Srinivasarao - Sakshi

చీపురుపల్లి: సభలో మాట్లాడుతున్న మజ్జి శ్రీనివాసరావు

చీపురుపల్లి: విజయనగరం, బొబ్బిలి రాజులను నమ్మొద్దని వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ప్రజలను కోరారు. పట్టణంలోని జి.అగ్రహారంలో గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించిన అనంతరం ఆంజనేయ విగ్రహం, రావిచెట్టు వద్ద నిర్వహించిన సభల్లో మాట్లాడుతూ ..పదవులు పొంది కోటల్లో, ఢిల్లీలో కూర్చుని ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విజయనగరం ఎంపీగా 2014లో అశోక్‌గజపతిరాజును గెలిపిస్తే ఢిల్లీలో కూర్చుని జిల్లా ప్రజలను మరిచి పోయారన్నారు. టీడీపీ హయాంలోనే ఆర్‌ఈసీ ఎస్‌కి అవినీతి మరకలు అంటుకున్నాయని మండిపడ్డారు.

5 ఏళ్లలో 500 హామీలిచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని బాబుపై మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత సామాన్యుడైన, అందరికీ అందుబాటులో ఉండే బెల్లాన చంద్రశేఖర్‌ను ఎంపీగా నిలబెట్టారని, నియోజకవర్గాన్ని అభివృద్ది చేసిన బొత్స సత్యనారాయణను ఎమ్మెల్యేగా నిలబెట్టారని, వీరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, ఇప్పిలి తిరుమల, పతివాడ రాజారావు, కర్రోతు ప్రసాద్, కోసిరెడ్డి రమణ, కరణపు జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement