నిజామాబాద్ నాగారం: పుష్కరాలు పన్నెండేళ్లకు ఒకసారి వస్తాయి. ఈ ఏడాది జూలైలో పుష్కరాలను నిర్వహించనున్నారు. 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలకు రాష్ట్రం మొత్తం పండుగలా ఉంటుంది. ఇప్పటికే పుష్కరఘాట్ల వద్ద పనులు చకచకా నడుస్తున్నాయి. అయితే విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటు పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. అటు ప్రభుత్వంతో పాటు ఇటు కలెక్టర్ సైతం పుష్కరఘాట్లలో విద్యుత్ సరఫరాకు సంబంధిత పనులు ప్రారంభించాలని ఎన్‌పీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈకి ఆదేశాలు జారీ చేశారు...
అయితే నిధులు మంజూరు చేయకుండా పెద్ద మొత్తంలో పనులు చేసేదేట్లా అని సదరు అధికారు లు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం 14 ఘాట్లకు గాను రూ.1.16 కోట్ల వ్యయమవుతుందని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇంత భారం ఎలా భరించాలని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
నిధులు లేక ప్రారంభం కాని పనులు
నిజామాబాద్ జిల్లాలో 18 పుష్కరఘాట్లు ఏర్పాటు చేశారు. ఇందులో 4 ఘాట్లను పోచంపాడ్‌కు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు చేపట్టారు. మిగతా 14 ఘాట్లలో విద్యుత్ ఏర్పాట్లను ఎన్‌పీడీఎల్(ట్రాన్స్‌కో)కు అప్పజెప్పింది. ఈ 14 ఘాట్లలో పనులు ప్రారంభించాలంటే దానికి సరిపడ నిధులు కావాలి. ప్రతి ఘాట్ వద్ద విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్లు, విద్యుత్ దీపాలు ఇలా అన్నింటినీ ఏర్పాటు చేయాలి.
ఘాట్‌వద్ద అదనంగా జనరేటర్ సౌకర్యం కూడా కల్పించాలి. 24 గంటలు కచ్చితంగా విద్యుత్ సరఫరా ఉండాల్సిందే. అయితే ఇందుకు అవసరమైన నిధులు మాత్రం ప్రభుత్వం మంజూరు చేయలేదు. 4 ఘాట్లలో కందకూర్తి-2, తడపకల్-2, దోంచంద-1, గుమ్మీర్యాల్-1, సావెల్-1, తుంగిని-1, కోస్లీ-1, బినోల-1, ఉమ్మెడ-1, తాడ్‌బిలోలీ-2 ఉన్నాయి. భక్తులు అందరు అధిక సంఖ్యలో పుష్కరాల సమయంలో గోదావరినదిలో స్నానాలు చే సి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పుష్కరాల సమయంలో గోదావరిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని అంటారు.
అందుకే 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. అయితే ఘాట్లలో విద్యుత్ సరఫరా కల్పించేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నిధులు మంజూరు చేయకపోవడంతో పనుల విషయాన్ని విద్యుత్ శాఖాధికారులు పక్కకు పడేశారు. చిన్న చిన్న పనులు ఉంటే మాత్రం చేస్తామని, పెద్ద మొత్తంలో పనులు చేయాలంటే కచ్చితంగా నిధులు కావాల్సిందేనని పట్టుబడ్డారు. స్టోర్‌లో నుంచి ఏ ఒక్క మెటిరీయల్ బయటకు తీయాలన్నా దానికి సరిపడ బిల్లులు చెల్లించి, కార్పొరేట్ అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. కానీ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఏ విధంగా పాటించాలో అర్థం కావడం లేదని తలలు పట్టుకుంటున్నారు. పుష్కరఘాట్ల వద్ద మిగతా అన్ని పనులు చకచకా కొనసాగుతున్నా విద్యుత్‌సరఫరా విషయంలో మాత్రం ఇంతవరకు కొలిక్కిరాలేదు.
కార్పొరేట్ కార్యాలయం అనుమతి రావాలి
ఒక వేళ ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా.. వరంగల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి అనుమతి వస్తే తప్పకుండా పనులు ప్రారంభిస్తారు. అరుునా ఇంత వరకు నిధులు విషయంలో ఎటూ తేలడం లేదు. ఆదేశాలు ఇచ్చినా పనులు మాత్రం జరగడం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్వయంగా కలుగజేసుకుని ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడితే తప్ప విద్యుత్ సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదు.
నిధుల మంజూరులో నిర్లక్ష్యం
Published Sat, Apr 18 2015 2:50 AM | Last Updated on Wed, Sep 5 2018 3:37 PM
Advertisement
Advertisement