న్యూఢిల్లీ: ప్రమాదకర వ్యర్థాల నిర్వహణకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. తొలిసారి ఈ జాబితాలో టైర్లు, ఖనిజపు చెత్త, కాగితం, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్ని చేర్చారు. వాటిని పునశ్శుద్ధి చేసి తిరిగి వినియోగించవచ్చని కేంద్రం తెలిపింది. పునర్వినియోగానికి దిగుమతి చేసుకునే ఖనిజపు చెత్త, పేపర్ వ్యర్థాలు, వివిధ రకాల ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని వీటి నుంచి మినహాయించారు. అనుమతి, రవాణా, దిగుమతి, ఎగుమతుల నిబంధన ల్లో మార్పులతో పాటు ప్రమాదకర వ్యర్థాల నిర్వహణను సరళతరం చేశామని కేంద్రం తెలిపింది.