
సాక్షి, హైదరాబాద్: లంచం తీసుకుంటూ విద్యు త్ శాఖ డీఈ దుర్గారావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కాడు. యాదాద్రి భువనగిరి జిల్లా టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో దుర్గారావు డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. భాస్కర్‌రావు అనే కాంట్రాక్టర్ దగ్గర బిల్లుల మం జూరుకై రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. దాంతో భాస్కర్‌రావు ఏసీబీని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని దుర్గారావు నివాసంలో లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దుర్గారావును అరెస్ట్ చేసి ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment