
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని టి.నరసాపురం మండలం బండివారిగూడెం గ్రామంలో ప్రవల్లిక అనే మహిళ వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. స్థానికులైన కూరం పోతురాజు అల్లుడు శ్రీనివాస్ పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్పుకు ఆమె వద్దకు వెళ్లాడు. పేరు మార్చడానికి వీఆర్వో ససేమిరా కాదన్నారు. మరలా వెళ్లి ఆమెను కలవగా పది వేలు డిమాండ్ చేయటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో శ్రీనివాస్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ పక్కా పథకం ప్రకారం సోమవారం ప్రవల్లికను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరింత సమాచారం రాబట్టడం కోసం ఏసీబీ అధికారులు టి.నరసాపురం తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు
Comments
Please login to add a commentAdd a comment