t.narasapuram mandal
-
పేరు మార్చడానికి పది వేలు
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని టి.నరసాపురం మండలం బండివారిగూడెం గ్రామంలో ప్రవల్లిక అనే మహిళ వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. స్థానికులైన కూరం పోతురాజు అల్లుడు శ్రీనివాస్ పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్పుకు ఆమె వద్దకు వెళ్లాడు. పేరు మార్చడానికి వీఆర్వో ససేమిరా కాదన్నారు. మరలా వెళ్లి ఆమెను కలవగా పది వేలు డిమాండ్ చేయటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో శ్రీనివాస్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ పక్కా పథకం ప్రకారం సోమవారం ప్రవల్లికను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరింత సమాచారం రాబట్టడం కోసం ఏసీబీ అధికారులు టి.నరసాపురం తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు -
తల్లిపై అలిగి ఆత్మహత్యకు యత్నించాడు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఆటో ఫైనాన్స్ వాయిదా చెల్లించడానికి డబ్బులు అడగ్గా తల్లి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. టి.నరసాపురం మండలం అల్లంచర్ల కొత్తగూడెం గ్రామానికి చెందిన తవిటి శేషాద్రి ఫైనాన్స్‌పై ఆటో తీసుకుని జీవనోపాధి పొందుతున్నాడు. శనివారం ఆటో ఫైనాన్స్‌కు వాయిదా చెల్లించాల్సి ఉండగా తన తల్లిని డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురై రాత్రి గ్రామంలోని మిరపతోటలోకి వెళ్లి గుళికలు మింగాడు. విషయం తెలుసుకున్న శేషాద్రి బావ సూర్యనారాయణ కామవరపుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం ఏలూరు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శేషాద్రి చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.