విద్యుత్తు షాక్‌తో యువ రైతు మృతి | former died due to touching of electric fensing in ananthapuram | Sakshi
Sakshi News home page

విద్యుత్తు షాక్‌తో యువ రైతు మృతి

Published Wed, Jan 28 2015 7:22 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

former died due to touching of electric fensing in ananthapuram

అడవి జంతువుల నుంచి రక్షణ కోసం పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్తు వైరు తగిలి యువరైతు మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం గురివిరెడ్డి కొట్టాల గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాలు..  గురివిరెడ్డి కొట్టాల గ్రామానికి చెందిన యువ రైతు సురేష్(20) మంగళవారం రాత్రి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు.

అతడి పొలం పక్కన ఉన్న మరోరైతు అడవి జంతువుల నుంచి రక్షణ కోసం పొలం చుట్టూ విద్యుత్తు కంచె ఏర్పాటు చేసుకున్నాడు. ఇది తెలియని సురేష్ రాత్రి విద్యుత్తు మోటారు ఆన్ చేసేందుకు వెళ్తున్న క్రమంలో విద్యుత్తు తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. రైతు సురేష్ కుటుంబాన్ని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. మృతుడి కుటుంబానికి రూ.5000 ఆర్థిక సాయం అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement