విద్యుత్ సమస్య తీర్చేందుకు సబ్‌స్టేషన్లు
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
మేడ్చల్/ మేడ్చల్‌రూరల్ : మేడ్చల్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 3 సబ్‌స్టేషన్‌లు, మేడ్చల్‌లో ఓవర్ హెడ్ ట్యాంక్ పనులకు సోవువారం రాష్ట్ర రోడ్డురవాణా శాఖ మంత్రి వుహేందర్‌రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలో రూ.66 కోట్లతో సబ్ స్టేషన్ 33/11 సబ్‌స్టేషన్‌లు 11, 220/132 కేవీ సబ్‌స్టేషన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో విద్యుత్ సమస్య లేకుండా చేసేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి :మంత్రి జగదీశ్‌రెడ్డి
మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు అహర్నిశలు కృషి చేస్తానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. రైతులకు విద్యుత్ ఇబ్బందులు కలగకుండా చేసేందుకు తవు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో వున రాష్ట్రం నుంచే ఇతర రాష్ట్రాల వారు విద్యుత్ పొందేలా సీఎం కేసీఆర్, జగదీశ్‌రెడ్డిలు చర్యలు చేపడుతున్నారని అన్నారు.
జిల్లాకు రూ. 800 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్డు మంజూరయ్యాయని, వాటిలో మేడ్చల్ నియోజకవర్గానికి రూ.100కోట్లు కేటాయించానన్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్లకు జిల్లాకు రూ.1200 కోట్లు రాగా నియోజకవర్గానికి రూ.200కోట్ల నుండి 300 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో కరెంట్ సమస్యతో బాధపడుతున్న ప్రజల కష్టాలు తీర్చిన ఘనత ముఖ్యవుంత్రి కేసీఆర్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ జిల్లా ఈఈ సత్యనారాయణరెడ్డి, మేడ్చల్ డీఈ రత్నాకర్‌రావు,ఏఈ మోజెస్, మల్కాజిగిరి ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, నగర పంచాయతీ కమిషనర్ రామిరెడ్డి, ఎంపీడీఓ దేవసహాయం, తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఈఓపీఆర్డీ జ్యోతిరెడ్డి, పూడూర్, రాజబొల్లారం సర్పంచ్‌లు స్రవంతి, నారాయణగౌడ్, భాస్కర్‌యాదవ్, సత్యనారాయణ, రాములుయాదవ్, నందారెడ్డి, మల్లికార్జున్‌స్వామి, రాజమల్లారెడ్డి, మోనార్క్, నర్సింహారెడ్డి, రాఘవేందర్‌గౌడ్, శ్రావణ్‌కువూర్, రావుస్వామి తదితరులు పాల్గొన్నారు.
శామీర్‌పేట మండలంలో...
శామీర్ పేట్: శామీర్‌పేట మండలంలోని లాల్‌గడి మలక్‌పేట్, సంపన్‌బోల్(జగన్‌గూడ గ్రా మపంచాయతీ పరిధిలో)గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ల పనులకు సోమవారం రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్కక్షణం కూడా కరెంటు పోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మలిపెద్దిసుధీర్‌రెడ్డి, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ చైర్మ న్, మేనేజింగ్ డెరైక్టర్ రఘుమారెడ్డి,ై డెరెక్టర్ ఆపరేషన్ శ్రీనివాసరెడ్డి, ప్రాజెక్ట్ డెరైక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఈ రాంకుమార్, డీఈ రత్నాకర్‌రావు, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ , జెడ్పీటీసీ సభ్యుడు బాలేష్, డీఈ అబ్దుల్‌ఖరీం, ఈఈ సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి,ఎంపీడీఓ శోభారాణి, తహసీల్దార్ దేవుజా, ఎంఈఓ వసంతకుమారి, సర్పంచులు బీర్కురి వెంకటేశ్, జెనిగల శశికళ, కిశోర్‌యాదవ్, శ్రీ నివాస్ ముదిరాజ్, పద్మా లక్ష్మారెడ్డి, కోఆప్షన్‌సభ్యుడు చాంద్‌పాషా, ఎంపీటీసీ సభ్యులు రవీందర్‌రెడ్డి, సుభాషిణి, మల్లేష్‌గౌడ్,సునీతాలక్ష్మి, రా జు, టీఆర్‌ఎస్ నాయకులు విష్ణుగౌడ్, సతీష్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి, శంకర్‌ముదిరాజ్ పాల్గొన్నారు.