సాక్షి, సూర్యాపేట: తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్, కిషన్ రెడ్డి పోటీ పడి విమర్శలు చేస్తున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్ గురించి మాట్లాడే బీజేపీ.. అధికారంలో ఉన్న గుజరాత్‌లో ఏం సాధించారో ప్రజలకు తెలపాలన్నారు. అప్పుల గురించి మాట్లాడే నాయకులు అభివృద్ధిని గమనించడం లేదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రపంచం మొత్తం మెచ్చుకునే రైతు బీమా, ఉచిత కరెంటు గుజరాత్‌లో ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అప్పుచేసి రాష్ట్ర అభివృద్ధికే ఉపయోగించిందని చెప్పారు.
ఆదానీ, అంబానీలకే మేలు..
దేశంలో ఆదానీ, అంబానీలకు ఉపయోగపడే విధంగా బీజేపీ సర్కార్ లక్షల కోట్ల అప్పులు చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. ఆదానీ, అంబానీ వంటి కొద్ది మందికి మాత్రమే ఉపయోగపడే విధంగా కేంద్రం మాఫియా ప్రభుత్వాన్ని నడిపిస్తోందని ఆరోపించారు. ప్రపంచ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం భారతదేశ పరువు తీస్తోందని దుయ్యబట్టారు. రాజకీయ పబ్బం కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని అన్నారు. బీజేపీ నిర్వాకం వల్లనే చచ్చిన కాంగ్రెస్ ఉరుకులు పెడుతోందని అన్నారు.
కాంగ్రెస్‌కు చెప్పుకోవడానికి ఏం లేదు కానీ..గత్యంతరం లేకనే కర్ణాటకలో కాంగ్రెస్‌కు పట్టం కట్టారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ నీడను ప్రజలు వదలరని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: రేవంత్‌రెడ్డిపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment