Substations
-
భవిష్యత్తులో నిరంతరం నాణ్యమైన విద్యుత్
-
పవర్ ‘ఫుల్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యం పెరగడం ద్వారా ప్రజలకు, రైతులకు మరింత నాణ్యమైన విద్యుత్ అందనుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి ఆయన వర్చువల్ విధానంలో 16 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన, 12 సబ్స్టేషన్లకు ప్రారంభోత్సవం చేశారు. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్స్టేషన్లుఏర్పాటవుతున్నాయి. వీటితో పాటు కడపలో 750 మెగావాట్లు, అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో హెచ్పీసీఎల్తో రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్పీసీఎల్) ఎండీ అండ్ సీఈఓ ఎం.కమలాకర్ బాబు, హెచ్‌పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శువేందు గుప్తా ఒప్పంద పత్రాలను అందుకున్నారు. వీటన్నింటి వల్ల రానున్న రోజుల్లో వేగంగా అడుగులు ముందుకు పడి మరిన్ని ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సామర్థ్యం మెరుగు పడుతుందని సీఎం అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే.. సరికొత్త అడుగులు.. నాణ్యమైన వెలుగులు ► 19 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ సామర్థ్యాన్ని పెంచుతూ రూ.620 కోట్లతో 12 సబ్స్టేషన్లను ప్రారంభిస్తున్నాం. రూ.2,479 కోట్లతో మరో 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నాం. మొత్తంగా సుమారు రూ.3,099 కోట్ల పెట్టుబడులతో మంచి కార్యక్రమం జరుగుతోంది. కొత్తగా వస్తున్న ఈ 28 సబ్ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. మరోవైపు రూ.3,400 కోట్లతో దాదాపు 850 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నాం. వీటి వల్ల 1,700 ఉద్యోగాలు వస్తున్నాయి. వీటిన్నింటి కోసం దాదాపు రూ.6,500 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. ►ఇటీవల గోదావరి ముంపునకు గురైన చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ఎటపాక తదితర విలీన మండలాల్లో తిరిగినప్పుడు సబ్స్టేషన్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి ప్రజలు చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తూ.. అక్కడ వాటి నిర్మాణాలు ప్రారంభిస్తూ, నిర్మించిన వాటిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తున్నాం. ► ట్రాన్స్మిషన్ కెపాసిటీని విస్తరించుకుంటూ ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చే పరిస్థితిని, వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాం. రైతులకు 9 గంటల పాటు పగటిపూటే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టాం. ఇది చేయాలంటే కెపాసిటీ సరిపోదని, ట్రాన్స్మిషన్ కెపాసిటీ అభివృద్ధి చేయాలని అధికారులు చెప్పారు. అందుకోసం రూ.1,700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను పగటిపూటే ఇస్తున్నాం. 25 ఏళ్లపాటు ఢోకా ఉండదు ► రైతులకు ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి యూనిట్ రూ.2.49తో సోలార్ పవర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప అడుగు పడింది. దాదాపు 17 వేల మిలియన్ యూనిట్లకు సెకీతో ఒప్పందం చేసుకున్నాం. వ్యవసాయ విద్యుత్‌కు కావాల్సిన 13 వేల మిలియన్ యూనిట్లు పగటిపూటే, మరో 25 ఏళ్లపాటు ఉండేలా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ప్రస్తుతం యూనిట్ సగటు ధర రూ.5.30 పడే పరిస్థితులుంటే రూ.2.49కే యూనిట్ ధర వచ్చే పరిస్థితుల్లోకి అడుగులు వేస్తున్నాం. దీనివల్ల 2024 సెప్టెంబర్‌కు 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబర్ నాటికి మరో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్ నాటికి మరో 1000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ► అవేరా స్కూటర్స్ తయారీ సంస్థ ఇప్పటికే 25 వేల స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించి విజయవాడలో నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టు లక్ష స్కూటర్ల ఉత్పత్తి దిశగా సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. దీనికి సంబంధించి రూ.100 కోట్లతో విస్తరణ ప్రాజెక్టుకు ఈ రోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఈ కంపెనీలో 100 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నాయి. తాజా పెట్టుబడి వల్ల అదనంగా మరో 200 ఉద్యోగాలు వస్తాయి. ► 500 మెగావాట్లు సోలార్ ప్లాంట్, మరో 500 మెగావాట్ల పవన విద్యుత్, 250 మెగావాట్ల పీఎస్పీ, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ (100 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్)తో కలిపి రూ.10 వేల కోట్లకు సంబంధించి హెచ్పీసీఎల్తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. దీనివల్ల దాదాపు మరో 1500 మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టుల వల్ల కాలుష్య రహిత క్లీన్ ఎనర్జీ అందుబాటులోకి వచ్చి, రాష్ట్ర ప్రగతిని మరింత పెంచే పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటున్నాను. ► ఈ కార్యక్రమంలో సీఎస్ డాక్టర్ కెఎస్జవహర్రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జేఎండీ బి.మల్లారెడ్డి, హెచ్‌పీసీఎల్ డైరెక్టర్ అమిత్ గార్గ్, హెచ్‌పీసీఎల్, ఆయానా, స్ప్రింగ్ అగ్నిత్రా, సోలార్ ఎనర్జీ ఏపీ సిక్స్ ప్రై వేట్ లిమిటెడ్, అవేరా ఏఐ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టాం. అక్టోబర్ ఆఖరు వరకు 39.64 లక్షల మంది లబ్ధిదారులకు (అగ్రికల్చర్, ఆక్వా, పశు సంవర్థక, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఇతరులు) రూ.46,581 కోట్ల సబ్సిడీ అందించాం. జగనన్న హౌసింగ్ కాలనీలకు ఐదు లక్షల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 1.25 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఈ ఏడాది అదనంగా నిర్ణీత కాలపరిమితిలో మంజూరు చేశాం. వ్యవసాయ విద్యుత్ కోసం ‘సెకీ’తో తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. స్మార్ట్ మీటర్స్ వల్ల రైతులకు మరింత మేలు జరుగుతుంది. విశాఖ పెట్టుబడుల సదస్సులో జరిగిన ఒప్పందాల ప్రకారం రూ.52,015 కోట్లు గ్రౌండ్ అయ్యాయి. వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. 12,586 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. సీఎం చిత్తశుద్ధితోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంధన శాఖ మంత్రి -
రూ.3,100 కోట్లతో సబ్ స్టేషన్లకు శంకుస్థాపన
-
కాంతులీననున్న కొత్త సబ్స్టేషన్లు
సాక్షి, అమరావతి : అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా రానున్న రోజుల్లో ఏపీ గణనీయమైన వృద్ధి, పట్టణీకరణ జరిగే క్రమంలో ఎదురయ్యే విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా విద్యుత్ రంగం బలోపేతంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా.. రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్‌కో) శ్రీకారం చుడుతోంది. వీటిలో 16 సబ్స్టేషన్ల శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల ప్రారంపోత్సవాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వర్చువల్ విధానంలో చేయనున్నారు. రూ.3,100 కోట్ల వ్యయంతో కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. రెండు సోలార్ ప్రాజెక్టులు కూడా.. ఇవికాక.. కడపలో 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, అనంతపురంలో 100 మెగావాట్ల మరో సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కడప జిల్లా మైలవరం మండలంలో 1,000 మెగావాట్ల సోలార్ పార్కు అభివృద్ధికి కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) ఆమోదం తెలిపింది. ఇందులో 250 మెగావాట్లను 2020 ఫిబ్రవరి 8న ప్రారంభించారు. మిగిలిన 750 మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) ద్వారా అభివృద్ధి చేయనున్నారు. ఈ 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు పెట్టుబడి అవుతుందని అంచనా. ఏడాదిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్లాంట్ ఏటా 1,500 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిద్వారా సంవత్సరానికి 12 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా. అలాగే.. శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని ఎన్.పీ.కుంట, గాలివీడు గ్రామాల వద్ద 1,500 మెగావాట్ల సోలార్ పార్క్‌కు ఎంఎన్ఆర్ఈ ఆమోదం తెలిపింది. వివిధ సోలార్ పవర్ డెవలపర్లు 1,400 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తిచేశారు. మిగిలిన 100 మెగావాట్ల కోసం, హెచ్‌పీసీఎల్ ముందుకొచ్చింది. ఈ సోలార్ ప్రాజెక్టుకు రూ.400 కోట్లు పెట్టుబడి అంచనా వేయగా, ఏడాది నిర్మాణ కాలంలో 200 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్ ఏటా 200 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ఏటా 1.6 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు. గడువులోగా ప్రాజెక్టులు పూర్తి విద్యుత్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్ణిత సమయానికి పూర్తి చేసేందుకు పక్కాగా ప్రణాళికలు రూపొందించాలని విద్యుత్ సంస్థలను ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె. విజయానంద్ ఆదేశించారు. సీఎం కార్యక్రమం ఏర్పాట్లపై విద్యుత్ సౌధలో సోమవారం ఆయన అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి, అందుకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందించిన సహాయ సహకారాలతోనే వినియోగదారులకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు ఇవ్వగలుగుతున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జెన్కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జేఎండీ బి. మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు ఐ. పధ్వితేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ఎండీ, సీఈఓ కమలాకర్ బాబు, డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆయుధ సరఫరాలే లక్ష్యం
లివీవ్: ఉక్రెయిన్‌పై దాడులను బుధవారం రష్యా మరింత తీవ్రతరం చేసింది. అమెరికా, యూరప్ దేశాల ఆయుధ సరఫరాలే లక్ష్యంగా పశ్చిమ ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించింది. ప్రధానంగా రైల్వే లైన్లు, ప్రధాన రోడ్డు మార్గాలపై గురి పెట్టింది. రైల్వేస్టేషన్లకు కరెంటు సరఫరా చేస్తున్న ఐదు విద్యుత్కేంద్రాలను, పలు ఆయుధాగారాలను ధ్వంసం చేసింది. లివీవ్‌పైనా తీవ్రస్థాయిలో దాడులకు దిగింది. నగరంలో విద్యుత్ సబ్స్టేషన్లు దెబ్బ తిని పలుచోట్ల కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఉక్రెయిన్‌లోకి ఆయుధాలతో వెళ్లే నాటో, పాశ్చాత్య వాహనాలన్నింటినీ ధ్వంసం చేసేస్తామని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ హెచ్చరించారు. తూర్పున డోన్బాస్ను పూర్తిగా చేజిక్కించుకునే ప్రయత్నాలను కూడా రష్యా ముమ్మరం చేసింది. అక్కడి క్రొమటోర్క్‌స్, సెవరోడోనెట్స్‌క్ సహా పలు నగరాలను ఆక్రమించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఇంగ్లండ్ వెల్లడించింది. తాజా దాడుల్లో వందలాది మంది పౌరులు మరణించినట్టు ఉక్రెయిన్ చెప్పింది. మారియుపోల్‌లో అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంటుపై మళ్లీ దాడులకు దిగామన్న వార్తలను రష్యా రక్షణ మంత్రి ఖండించారు. కానీ అక్కడ బాంబింగ్ కొనసాగుతోందని ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ చెప్పుకొచ్చింది. మే 9న విక్టరీ డే ఉత్సవాల సందర్భంగా ఉక్రెయిన్‌పై పుతిన్ ‘పూర్తిస్థాయి యుద్ధం’ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. దీన్ని రష్యా ఖండించింది. రష్యాలో జెర్జిన్‌స్కీ పారిశ్రామిక ప్రాంతంలో ఓ ప్రభుత్వ పుస్తక ప్రచురణ సంస్థలో భారీ మంటలు చెలరేగాయి. ఇది రష్యాలో ప్రచ్ఛన్నంగా ఉన్న ఉక్రెయిన్ బలగాల పనేనని అనుమానిస్తున్నారు. రష్యా సైన్యం తమ భూభాగం నుంచి పూర్తిగా వైదొలిగేదాకా ఆ దేశంతో ఎలాంటి ఒప్పందమూ ఉండబోదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. పుతిన్ తనతో చర్చలకు రావాలన్నారు. ‘‘తొలి దశ యుద్ధంలో రష్యాను నిలువరించాం. మలి దశలో తరిమికొడతాం. చివరిదైన మూడో దశలో ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా పునరుద్ధరించుకుంటాం’’ అని ధీమా వెలిబుచ్చారు. రష్యా చమురును నిషేధిద్దాం: ఈయూ చీఫ్ రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను 27 యూరోపియన్ యూనియన్ దేశాలు ఏకగ్రీవంగా, సంపూర్ణంగా నిషేధించాలని ఈయూ చీఫ్ ఉర్సులా వాండెర్ లియెన్ ప్రతిపాదించారు. పుతిన్ సన్నిహితుడైన రష్యా ఆర్థడాక్స్ చర్చి చీఫ్ కిరిల్‌పై ఆంక్షలు విధించాలని కూడా ఈయూ యోచిస్తోంది. -
కరెంట్ కోతలు.. మళ్లీ మొదలు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరెంటు కోతలు మళ్లీ మొదలైనట్టు కనిపిస్తోంది. పల్లెల్లో అనధికార విద్యుత్ కోతలు విధిస్తున్నారని కొన్ని రోజులుగా రైతన్న లు రోడ్డెక్కుతున్నారు. గత శని, ఆది, సోమవారాల్లో మెదక్ జిల్లా రైతులు సబ్ స్టేషన్ల ఎదుట ధర్నా చేశారు. మహబూబ్‌నగర్ రైతులు కూడా కోతలు పెడుతున్నారని చెబుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో కరెంటు కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ మాత్రం కోతలేం లేవని, సాంకేతిక కారణాలతో అంతరాయాలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. మరోవైపు ఎండలు పెరగడంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి మంగళవారం ఉదయం 12.20 గంటలకు 14,160 మెగావాట్ల గరిష్ట విద్యు త్ డిమాండ్ నమోదైంది. డిమాండ్ పెరగడంతో కొరతను తీర్చుకోవడానికి పవర్ ఎక్ఛేంజీల నుంచి రాష్ట్రం ఎక్కువ ధర పెట్టి విద్యుత్ కొంటోంది. సబ్ స్టేషన్ల ఎదుట రైతుల ధర్నా రాష్ట్రంలోని 25 లక్షల బోరుబావుల కింద సాగు చేస్తున్న యాసంగి పంటలు మరో 15 రోజుల్లో చేతికొచ్చే అవకాశముంది. ఈ సమయంలో అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. గత శని, ఆది, సోమవారాల్లో మెదక్ జిల్లాలో రామాయంపేట, నిజాంపేట, శివంపేట సబ్ స్టేషన్ల ఎదుట రైతులు ధర్నాలు చేశారు. ఉదయం 7.15 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేసి తర్వాత సింగిల్ ఫేజ్ సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనూ సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వ్యవసాయ విద్యుత్‌కు కోతలు విధిస్తున్నారని అన్నదాతలు చెబుతున్నారు. అధికారులేమో సాంకేతిక కారణాలతో మూడ్రోజులు దాదాపు 14 గంటలు విద్యుత్ కోతలు పెట్టామని చెప్పారు. డిమాండ్ పెరుగుతుండటంతో.. రోజూ ఉదయం 7.45–8.45 గంటల మధ్య వ్యవసాయ విద్యుత్ వినియోగం భారీగా ఉంటోంది. ఆ తర్వాత వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గుతున్నా గృహాలు, వాణిజ్యం, పరిశ్రమలు, ఇతర కేటగిరీల వినియోగం పెరుగుతోంది. రైతులు ఉదయం, సాయంత్రం వేళల్లో బోర్లు వేస్తుండటంతో సాయంత్రం 6–7.30 మధ్య కూడా డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్ నిర్వహణలో భాగంగా సాయంత్రం 5 నుంచి ఉదయం 7 గంటల వరకు పల్లెల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను ఆపేస్తున్నట్టు తెలుస్తోంది. రైతులు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో విద్యుత్‌ను వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ ధరల భగభగ విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో కొరతను తీర్చుకోవడానికి తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలూ పవర్ ఎక్ఛేంజీలపై అధారపడాల్సి వస్తోంది. యూనిట్‌కు రూ.14 నుంచి రూ.20 చొప్పున ఎక్ఛేంజీలు విక్రయిస్తున్నాయి. ఒక దశలో యూనిట్‌కు రూ. 20 వరకూ ధరలు పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధంతో పేలుడు పదార్థాల కొరత ఏర్పడి దేశంలోని విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా కూడా తగ్గి విద్యుత్ ధరలు పెరుగుతున్నాయి. రాష్ట్రం రోజుకు సగటున 50 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ను కొంటోంది. సోమవారం సగటున యూనిట్‌కు రూ.14.52 ధరతో 40 ఎంయూల విద్యుత్‌ను కొన్నది. ఇందులో 6.5 ఎంయూల విద్యుత్‌ను యూనిట్‌కు రూ.20 చొప్పున కొనుగోలు చేసింది. ఈ నెల 25న రాష్ట్రం 58 ఎంయూల విద్యుత్‌ను కొని ఒక్కరోజే రూ.100 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. విద్యుత్ కోతల్లేవు డిమాండ్ పెరిగినా విద్యుత్ కోతలు విధించట్లేదు. 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ఇన్సులేటర్ కాలిపోవడంతోనే మెదక్ జిల్లాలో ఓ రోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. డిమాండ్ కు తగ్గట్టు నిరంతర సరఫరా కొనసాగించడానికి పవర్ ఎక్ఛేంజీల నుంచి ఎక్కువ ధర పెట్టి విద్యుత్ కొంటున్నాం. 17,000 మెగావాట్లకు డిమాండ్ పెరిగినా సరఫరాకు సిద్ధంగా ఉన్నాం. –ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు పెట్టుబడి చేతికందని పరిస్థితి 24 గంటల విద్యుత్ వస్తుందనే ఆశతో ఉన్న కొద్దిపాటి ఎకరా భూమిలో వరి నాటు వేశా. విద్యుత్ కోతల వల్ల పంట ఎండిపోతోంది. పెట్టిన పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితి నెలకొంది. – ఆంజనేయులు, రైతు, చెండి, మెదక్ -
ఏబీ స్విచ్‌లు ఏవీ..?
మెదక్‌జోన్: కరెంట్‌తో ఎంత మేలు జరుగుతుందో అశ్రద్ధ చేస్తే అంతకు రెట్టింపు కీడు చేస్తోంది. ప్రాణాలను సైతం బలి తీసుకుంటోంది. ఆరు నెలలుగా జిల్లాలో నూతనంగా బిగిస్తున్న ట్రాన్స్ఫార్మర్లకు ఏబీ స్విచ్ (ఆన్,ఆఫ్)లు అమర్చడం లేదు. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని క్షేత్రస్థాయి అధికారులతో పాటు రైతులు ఆందోళన చెందుతున్నారు. ♦ జిల్లావ్యాప్తంగా 4.20 లక్షల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. కానీ చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో అధికంగా రైతులు బోరుబావుల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ♦ ఇప్పటికే జిల్లాలో 1.98 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా మరొక 30 వేల బోర్లు ఉన్నాయని సమాచారం. ♦ గతంలో 10 నుంచి 16 బోరుబావులకో 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ను అమర్చేవారు. వాటిపై లోడ్ ఎక్కువ కావడంతో తరుచూ కాలిపోయేవి. ♦ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు 3 నుంచి 4 బోరుబావులకు ఒక 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ను అమర్చుతున్నారు. ♦ దీంతో ఒక్క రైతు పొలంలో 3 నుంచి 4 బోర్లు ఉన్నా ఆ రైతుతో 4 డీడీలు కట్టించుకుని సొంతంగా ట్రాన్స్ఫార్మర్ను సదరు రైతు పొలంలోనే అమర్చుతున్నారు. ♦ ఇంతవరకు బాగానే ఉన్నా ఆరు నెలలుగా ఏబీ స్విచ్‌లను బిగించకుండానే రైతుల పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను బిగిస్తున్నారు. ♦ దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏబీ స్విచ్ ఉంటే సదరు రైతు పొలంలో స్టార్టర్ డబ్బా వద్ద ఏమైనా సమస్య ఉత్పన్నమైన, ఫ్యూజ్ వైర్ పోయినా ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసుకుని మరమ్మతులు చేసుకుంటాడు. ♦ అయితే ఆసౌకర్యం లేకపోవడంతో సంబంధిత సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేసి ఎల్సీ (లైన్) నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఉంటోంది. ఈక్రమంలో ఒక వ్యక్తి ఎల్సీ తీసుకోవాలంటే కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. ♦ సామాన్య రైతులకు ఎల్సీ ఇవ్వడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రైతుల వద్ద సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహించే ఆపరేటర్ ఫోన్ నెంబరే ఉండదు. ♦ ఆలోపల ఏదైన ప్రమాదం ఉత్పన్నమైనప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆరు నెలలుగా వందల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లను బిగించారు. వాటికి కరెంట్ కనెక్షన్ ఇచ్చి వినియోగంలోకి తెచ్చారు. కానీ ఏబీ స్విచ్‌లు మాత్రం అమర్చలేదు. నేటికీ స్టోర్ రూం కరువు.. ♦ జిల్లా ఏర్పాటై నాలుగేళ్లు గడిచినా విద్యుత్ సామగ్రితో పాటు ట్రాన్స్ఫార్మర్ల నిల్వకోసం జిల్లాలో నేటికీ స్టోర్ రూం ఏర్పాటు చేయలేదు. దీంతో అత్యవసరంగా వైర్ కావాలన్నా, ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన ఏదైనా పరికరాలు కావాలన్నా సంగారెడ్డికి పరుగులు పెడుతున్నారు. ♦ కొన్ని సందర్భాల్లో సామగ్రి సమయానికి అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పనులు నిలిచిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు విన్నవించాం జిల్లాలో ఏబీ స్విచ్‌ల కొరత ఉన్నమాట వాస్తవమే. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అలాగే జిల్లాకు స్టోర్ రూం లేక విద్యుత్ పరికరాల కోసం సంగారెడ్డి వెళ్లాల్సి వస్తోందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో ప్రభుత్వ భూమి ఇచ్చి స్టోర్ రూం నిర్మిస్తామని చెప్పారు. – జానకిరాములు, ఎస్ఈ విద్యుత్‌శాఖ మెదక్ -
ఇక స్మార్ట్ సబ్స్టేషన్లు!
► అదో విద్యుత్ సబ్‌స్టేషన్. అక్కడ ఉద్యోగులెవరూ లేరు. అక్కడి నుంచి ఆ ప్రాంతంలోని గృహాలకు, దుకాణాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ► ఆ సబ్‌స్టేషన్ పరిధిలోని ఒక వీధిలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. సమాచారం ఇద్దామంటే సబ్‌స్టేషన్‌లో ఎవరూ లేరు. అయినా సంబంధిత విద్యుత్ సిబ్బంది వెంటనే అక్కడకు వచ్చి మరమ్మతులు ప్రారంభించారు. ... ఇందుకు కారణం సదరు సబ్‌స్టేషన్ నుంచి ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లడమే. ఉద్యోగులు, సిబ్బంది లేకుండా సమాచారం ఎలా వెళ్లిందనేగా మీ అనుమానం? ఆ సబ్‌స్టేషన్.. స్మార్ట్ సబ్‌స్టేషన్. ఉద్యోగులు, సిబ్బంది అవసరం లేకుండానే విద్యుత్ సరఫరాలో సమస్య, అధిక లోడు, తక్కువ లోడు ఇలా ఏ సమాచారమైన వెంటనే తెలియజేసేలా సబ్‌స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో పైలట్ ప్రాజెక్టు కింద విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గిడిజాల సబ్‌స్టేషన్‌ను పూర్తి స్థాయి ఆటోమేషన్ సబ్‌స్టేషన్ (స్మార్ట్ సబ్‌స్టేషన్)గా తీర్చిదిద్దనుంది. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం అంతా కంట్రోల్ రూమ్ నుంచే.. వాస్తవానికి ఇప్పటికే గిడిజాల వద్ద 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఉంది. ప్రస్తుతం ఉన్న సబ్‌స్టేషన్ స్మార్ట్ సబ్‌స్టేషన్‌గా మారనుంది. ఈపీడీసీఎల్ పరిధిలోని అన్ని సబ్స్టేషన్లను స్మార్ట్ సబ్స్టేషన్లుగా మార్చేందుకు సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం రూ.334.51 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను కూడా ఆహ్వానించింది. గిడిజాల సబ్‌స్టేషన్‌ను స్మార్ట్ సబ్‌స్టేషన్‌గా మార్చేందుకు రూ.50 లక్షల మేర వ్యయమవుతుందని అంచనా వేసింది. ఈ సబ్‌స్టేషన్‌లో ఇక ఉద్యోగులెవరూ ఉండరు. పెదవాల్తేరు సబ్‌స్టేషన్‌లోని స్కాడ్ కంట్రోల్ రూమ్ నుంచే నడవనుంది. గిడిజాల సబ్‌స్టేషన్ పరిధిలోని విద్యుత్ పంపిణీ, ఇబ్బందులు ఇలా సమాచారమంతా ఆన్లైన్ ద్వారానే స్కాడ్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. తదనుగుణంగా ఇక్కడి నుంచే కార్యకలాపాలను నియంత్రించే వీలు కలగనుంది. మరింత నాణ్యమైన సేవలు.. ఈపీడీసీఎల్ పరిధిలోని సబ్స్టేషన్లను ఆటోమేషన్ కిందకు మార్చాలని భావిస్తున్నాం. ప్రయోగాత్మకంగా గిడిజాల సబ్‌స్టేషన్‌లో అమలు చేయనున్నాం. ఇందులో వచ్చే ఫలితాలను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. స్మార్ట్ సబ్‌స్టేషన్‌లో ఎక్కడా ఉద్యోగుల అవసరం ఉండదు. అంతా రిమోట్ ద్వారానే నిర్వహించే వీలు కలుగుతుంది. వినియోగదారులకు కూడా మరింత నాణ్యమైన సేవలు అందుతాయి. – కె.సంతోషరావు, సీఎండీ, ఈపీడీసీఎల్ -
విద్యుత్ సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం
-
చెట్టు ఊగితే.. విద్యుత్ కట్
సాక్షి, వింజమూరు (నెల్లూరు): గత నెల రోజులుగా వింజమూరు మండలంలో విద్యుత్తు కోతలు ఎక్కువయ్యాయి. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో సాయంత్రం ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. దీంతో వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. మండలంలో వింజమూరులో రెండు, తమిదపాడు, గుండెమడకల్లో సబ్స్టేషన్లు ఉన్నాయి. నాలుగు సబ్స్టేషన్లు ఉన్నా ఇంకా ఓవర్‌లోడ్ సమస్య ఉంది. వింజమూరు సుజాతనగర్ కాలనీ వాసులు లోఓల్టేజీ సమస్యతో సబ్‌స్టేషన్‌ను ముట్టడించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మండలంలో 500 ట్రాన్స్ఫార్మర్లు, దాదాపు 11 వేల కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఎక్కడో ఒక చోట గాలివానకు చెట్టు విరిగిపడితే వింజమూరు పట్టణానికి రెండు మూడు గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోతోంది. పల్లెల్లో అయితే ఒక్కోసారి మూడు రోజుల వరకూ సరఫరాను పునరుద్ధరించడం లేదు. వేసవి కావడంతో ఎండ వేడిమికి సిబ్బంది సాయంత్రం 4 గంటల తర్వాత విద్యుత్‌ను ఆపి పనులు చేస్తున్నారు. దీంతో సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. కాలిపోతున్న ఇన్సులేటర్లు ఆకాశం మేఘావృతమైతే వెంటనే విద్యుత్తు సరఫరా నిలిచిపోతోంది. అక్కడక్కడా చెట్లు తీగలకు అడ్డంగా ఉండడంతో గాలి రాగానే రెండు తీగలు తగులుకుని ఫీజులు పోతున్నాయి. దీంతో ఎల్ఆర్ తీసుకుని ఫీజులు వేస్తున్నారు. ఎక్కడ వైరు తెగినా ఆ ఫీడరు మొత్తం విద్యుత్తు సరఫరా నిలచిపోతోంది. ఫలితంగా కొన్ని గ్రామాలు పూర్తిగా అంధకారంలో ఉంటున్నాయి. వింజమూరు పట్టణంలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటైతే ఆ ప్రాంతంలో విద్యుత్తు సమస్య ఏర్పడనప్పుడు సరఫరాను అక్కడ మాత్రమే నిలిపి వేసి మిగతా ప్రాంతమంతా సరఫరా చేయవచ్చు. ఆత్మకూరు నుంచి డీసీ పల్లి మీదుగా గుండెమడకల సబ్‌స్టేషనుకు విద్యుత్తు మెయిన్‌లైన్ సరఫరా కొద్దిపాటి వర్షానికే లైన్ కట్ అవుతోంది. ఈ సబ్‌స్టేషన్ నుంచి శంఖవరం ఫీడరుకు విద్యుత్ సరఫరాలో రోజుల కొద్ది అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఈ లైన్ వెళ్లే నేల నల్లరేగడి కావడంతో వర్షానికి, గాలివానకు స్తంభాలు నేలకు వాలి పడిపోతున్నాయి. ఒకవేళ స్తంభాలు పడిపొతే కాంట్రాక్టర్ కోసం రెండు రోజులు వేచి ఉండి ఆ తర్వాత స్తంభాలు ఎత్తుతున్నారు. దానివల్ల రెండు మూడురోజుల పాటు ఆ లైన్ మొత్తం విద్యుత్ సరఫరా అవడం లేదు. నల్లగొండ్లలో గాలివానకు పడిపోయిన నాలుగు ట్రాన్స్ ఫార్మర్లను వారాల తరబడి అలాగే ఉంచారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గాలితో పాటు, ఉరుములు, మెరుపులు వచ్చిన వెంటనే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నారు. ఇటీవల విపరీతంగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. సాయంత్రం పూట విద్యుత్తు సరఫరా లేక వ్యాపారాలు జరగడం లేదని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు మాత్రం కచ్చితంగా కట్టించుకుంటున్నారని సరఫరా మాత్రం సరిగా ఉండడం లేదని విద్యుత్తు సిబ్బంది తీరును జనం ఎండగడుతున్నారు. మెరుపులు, ఉరుములు వస్తే ఇన్సులేటర్లు కాలిపోతున్నాయని అందుకోసం సరఫరా నిలిపి వేస్తున్నట్టు సిబ్బంది పేర్కొంటున్నారు. నాలుగేళ్లుగా ఏఈ లేక ఇబ్బందులు మండలంలో గత నాలుగేళ్లుగా ఏఈ లేక విద్యుత్తు సరఫరాలో ఇబ్బంది వస్తే పర్యవేక్షణ జరిపి సిబ్బందితో పనిచేయించే వారు లేకుండా పోయారని, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యూలర్ ఏఈని నియమించకుండా ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో కొన్ని గ్రామాలకు వారంలో మూడు రోజుల పాటు కూడా వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సరఫరా జరగడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని విద్యుత్ సమస్యను తీర్చాలని మండల ప్రజలు కోరుతున్నారు. స్తంభాలు పడిపోయినా స్పందించడం లేదు కొద్దిపాటి గాలివానలకు స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరా కావడం లేదు. గ్రామంలో అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు పడిపోయినా మరమ్మతులు చేయడానికి సిబ్బంది రావడం లేదు. రెగ్యూలర్ ఏఈని నియమించకపొతే సిబ్బంది సరిగా పని చేయరు. – బోగిరెడ్డి కృష్ణారెడ్డి, నల్లగొండ్ల -
నెక్ట్స్.. బాహుబలే
కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నీటిని ఎత్తిపోసే ప్రక్రియ పరిశీలనకు శ్రీకారం చుట్టిన రాష్ట్రప్రభుత్వం మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. కాళేశ్వరం ప్యాకేజీ–8లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రామడుగు పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అత్యంత పెద్దవైన బాహుబలి మోటార్లకు వెట్‌రన్ నిర్వహించే పనుల జోరుపెంచింది. జూన్ మొదటి వారంలో రామడుగు పంప్‌హౌస్‌లోని 139 మెగావాట్ల విద్యుత్‌తో నడిచే బాహుబలి మోటార్లకు వెట్‌రన్ నిర్వహించి పరిశీలన చేయాలని ఇంజనీర్లు ఇప్పటికే షెడ్యూల్ నిర్ణయించారు. అయితే దానికన్నా ముందే.. ప్యాకేజీ–7లోని టన్నెళ్ల పనులు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఏడింట్లో ఐదు సిద్ధం కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఎల్లంపల్లి దిగువన ఉన్న నందిమేడారం పంప్‌హౌస్ పరిధిలో 124.5 మెగావాట్ల విద్యుత్‌తో నడిచే మోటార్లకు వెట్‌రన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఒక పంప్ వెట్‌రన్ విజయవంతం కావడంతో గురువారం మరో మోటార్‌కు వెట్‌రన్ నిర్వహించారు. ఇదీ విజయవంతం కావడంతో సాయంత్రం మొదటి, రెండో మోటార్లకు కలిపి ఒకేసారి వెట్‌రన్ నిర్వహించారు. మిగతా మోటార్లకు ఇదే విధంగా పరిశీలన చేయనున్నారు. తొలిరెండు రోజులపాటు చేపట్టిన ప్రక్రియ సజావుగా సాగడంతో ఇంజనీర్లు ప్యాకేజీ–7లోని టన్నెళ్ల పనుల పూర్తి, ప్యాకేజీ–8లోని బాహుబలి మోటార్ల వెట్‌రన్ పనులపై దృష్టి పెట్టారు. ప్యాకేజీ–6 మోటార్లతో పోలిస్తే ప్యాకేజీ–8లోని మోటార్ల సామర్థ్యం 15 మెగావాట్ల మేర ఎక్కువ. ఒక్కో మోటారు సుమారు 15 మీటర్ల ఎత్తు అంటే 4 అంతస్తులు ఉంటుంది. వ్యాసం 22 మీటర్లు, బరువు 650 టన్నులు, రైతులు సాధారణంగా 5 హెచ్‌పీ మోటార్లను వినియోగిస్తారు. కాళేశ్వరం పంప్‌హౌస్‌లో ఉపయోగించే ఒక్కో మోటారు సుమారు 37వేల హెచ్‌పీ మోటార్లతో సమానం. ఏడు మోటార్లు ఉండే ఒక్కో పంప్‌హౌస్ ఏకంగా 2.60 లక్షల హెచ్‌పీ మోటార్లతో సమానంగా ఉంటుంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తుంది. ఈ పంప్‌హౌస్‌లో మొత్తంగా 7 మోటార్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇప్పటికే ఐదింటిని సిద్ధం చేశారు. మరో రెండింటిని మే నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. సిద్ధమైన 400కేవీ సబ్‌స్టేషన్ వీటికి కరెంట్‌ను సరఫరా చేసేందు కు 400 కేవీ విద్యుత్ సబ్ స్టేసన్ ఇప్పటికే సిద్ధమైంది. అయితే మోటార్లకు వెట్‌రన్ నిర్వహించాలంటే అంతకు ముందు ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కి.మీ. జంట టన్నెళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. టన్నెల్ తవ్వకపు పనులు ఇప్ప టికే పూర్తి కాగా కేవలం 840 మీటర్ల లైనింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ పనులు వచ్చే నెల్లో పూర్తి కానున్నాయి. ఈ పనులు ముగిసిన వెంటనే జూన్ మొదటి వారంలో నంది మేడారం రిజర్వాయర్‌లో చేరిన నీటితో ప్యాకేజీ–8లోని సర్జ్‌పూల్‌ని నింపనున్నారు. 2కోట్ల లీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న సర్జ్‌పూల్‌లో లీకే జీలు పరిశీలించిన అనంతరం జూన్‌లో మోటార్ల వెట్‌రన్ నిర్వ హించేందుకు అధికారులు సన్నా హాలు చేస్తు న్నారు. భూగర్భంలో 330 మీటర్ల దిగువన నిర్మించిన ఈ పంప్‌హౌస్‌లో మోటా ర్లను పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు నెల సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గురువారం ప్యాకేజీ–8లో మోటార్ల ఏర్పాటు పనులను ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేలు పరిశీలించారు. మే నెలాఖరు కల్లా టన్నెల్ సహా మిగతా నిర్మాణ పనులను పూర్తి చేసి జూన్ మొదటి వారానికి వెట్ రన్‌కు అంతా సిద్ధం చేయాలని ఇంజనీర్లకు ఆదేశా లిచ్చారు. ఈ మోటార్ల ద్వారా నీరు మిడ్‌మానేరు రిజర్వాయర్‌కు చేర నుంది. మిడ్‌మానేరు కింద కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించే పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. -
దానం చేసి మోసపోయాడు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలోని సబ్‌స్టేషన్ నిర్మాణానికి 20 గుంటల భూమిని విరాళంగా ఇచ్చిన భూదాత మల్లెత్తుల కొమురయ్య తన కుమారుడు నాగరాజుకు ఉద్యోగావకాశం ఇస్తానని మోసం చేశారంటూ సబ్‌స్టేషన్‌కు తాళం వేశాడు. విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరగని కారణంగా రాగినేడుతో పాటు పరిసర గ్రామాల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఏడాది కావస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టిం చుకోకపోవడంతో సమస్య జఠిలమైంది. ఇప్పుడిప్పుడే ఎండల తీవ్రత పెరిగి భూగర్భజలాలు అడుగంటుతుండడంతో పంటలకు సాగునీరు కరువైంది. ఉద్యోగం ఇవ్వాల్సిందే... రాగినేడు గ్రామానికి మంజూరైన సబ్‌స్టేషన్‌కు అవసరమైన స్థలాన్ని ఇచ్చానని, తన కొడుకు నాగరాజుకు ఉద్యోగావకాశం కల్పించాల్సిందేనని మల్లెత్తుల కొమురయ్య డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి సబ్‌స్టేషన్ మంజూరు కావడంతో అధికారులు చర్యలు చేపట్టినా అవసరమైన ప్రభుత్వం స్థలం అందుబాటులో లేకపోవడంతో నిర్మాణపు పనులు మొదలు కాలేదు. గ్రామానికి చెందిన మల్లెత్తుల కొమురయ్య సబ్‌స్టేషన్ నిర్మా ణం చేసుకునేందుకు వీలుగా తన 20 గుంటల భూమిని విరాళంగా అందించారు. ఆ సమయంలో ప్రజాప్రతినిధులతో పాటు విద్యుత్‌శాఖ అధికారులు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ఆశ చూపారు. సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయి విద్యుత్ సరఫరా సాగిస్తున్న అధికారులు ఉద్యోగం ఇవ్వకుండా జాప్యం చేస్తుండడాన్ని భూదాత కొముర్య పలుమార్లు ప్రశ్నించారు. అంతేకాకుండా దాదాపు ఏడాది క్రితమే సబ్‌స్టేషన్‌కు తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి అక్కడే ఆందోళనకు దిగారు. ఆయనకు మాజీ ఎమ్మెల్యేలు విజయరమణారావు, గుజ్జుల రామకృష్ణారెడ్డిలతో పాటు పలుసంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగమా...పరిహారమా..! సబ్‌స్టేషన్ నిర్మాణాలకు అవసరమైన భూమిని విరాళంగా ఇచ్చిన దాతల కుటుంబీకుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం గతంలో ఉండేదని, ఇప్పుడు ఆ నిబంధన అమల్లో లేదని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. ఆ సమయంలో హామీ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు చేయలేమని అధికారగణం చేతులెత్తేయడంతో తన భూ మిలో నిర్మించిన సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరగనివ్వమంటూ భూదాత కుటుంబీకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం ఇచ్చిన కుటుంబానికి ఉద్యోగం ఇచ్చే అవకాశం లేనపుడు కొంత పరి హారం అందించాలని గ్రామపెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రైతుల నుంచి తలా కొంత వసూల్ చేయాలని భావించారు. ఆ మొత్తం సరిపోదని భావించి నియోజకవర్గ, పార్లమెంట్ స్థాయి నాయకులను కూడా పరిహారమందించేందుకు వీలుగా సాయమందించాలని అభ్యర్థించి కొంత మొత్తాన్ని వసూళ్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా సబ్‌స్టేషన్‌కు తాళం వేసిన భూదాతకు న్యాయం చేసి, రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న లో –వోల్టోజీ విద్యుత్ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు. పరిహారం అందించేందుకు కృషి చేస్తాం భూదాత కొమురయ్య కుటుంబానికి నిబంధనల మేరకు ఉద్యోగం ఇవ్వలేమని విద్యుత్ శాఖ అధికారులు చేతులెత్తేశారు. దాంతో గ్రామంలో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌కు విరాళంగా ఇచ్చిన భూమికి కొంత పరిహారం ఇవ్వాలని గ్రామపెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ప్రజా అవసరాల కోసం భూమినిచ్చేందుకు ముందుకొచ్చిన దాతకు విరాళాల ద్వారా సేకరించి వీలైనంత త్వరగా పరిహారం అందిస్తాం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. – మల్క కుమారస్వామి, ఎంపీటీసీ సభ్యుడు -
సబ్ స్టేషన్లను మూడు నెలల్లో పూర్తి చేయాలి
విద్యుత్ శాఖ చీఫ్ ఇంజినీర్ పీరయ్య కర్నూలు (రాజ్‌విహార్): కొత్తగా మంజూరైన విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని ఏపీ ఎస్పీడీసీఎల్ కర్నూలు జోన్ చీఫ్ ఇంజనీర్ ఎంపీ పీరయ్య ఆదేశించారు. గురువారం స్థానిక కొత్త బస్టాండ్‌లోని విద్యుత్ భవన్లో కర్నూలు, అనంతపురం జిల్లాల కన్స్ట్రక్షన్ డివిజన్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్స్టేషన్ల వారీగా జరుగుతున్న పురోగతి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్స్టేషన్లు మంజూరైనట్లు వెల్లడించారు. డీడీయూ జీజేవై పథకం కింద మంజూరైన సబ్స్టేషన్లతోపాటు సాధారణ ఇతర వాటి పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. అగ్రిమెంట్లు పూర్తయిన పనులను ప్రారంభించిన మూడు నెలల్లో వినియోగంలోకి తేవాలన్నారు. ఒకవేళ గడువు ఉందని జాప్యం చేస్తే కుదరదన్నారు. సమావేశంలో డీఈఈలు ప్రదీప్‌కుమార్, రవీంద్రబాబు, వినాయక్ ప్రసాద్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
గ్రేటర్లో 52 కొత్త సబ్స్టేషన్లు
► రంగారెడ్డిలో 25, హైదరాబాద్‌లో 27 నిర్మాణం ► రూ.180 కోట్లతో డిస్కం ప్రతిపాదనలు సాక్షి, సిటీబ్యూరో: కోర్‌సిటీలో గృహోపకరణాల వినియోగం రెట్టింపుకావడం, అవుట ర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా కొత్త కాలనీలు పుట్టుకొస్తుండటం వల్ల గతంతో పోలిస్తే ప్రస్తుతం విద్యుత్ వినియోగం రెట్టింపైంది. పెరుగుతున్న ఈ డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా వ్యవస్థ మెరుగు పడలేదు. నగరవాసుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్లో కొత్తగా 33/11 కేవీ సబ్స్టేషన్లు 52 చోట్ల నిర్మించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నిర్ణయించింది. ఒక్కో సబ్‌స్టేషన్‌కు సగటున రూ.2.5 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు ఖర్చు కానున్నట్లు అంచనా వేసింది. హైదరాబాద్ కోర్‌సిటీలో 27 సబ్స్టేషన్లు, రంగారెడ్డి అర్బన్‌లో 25 సబ్స్టేషన్లను ప్రతిపాదించింది. వీటిలో 30 ఔట్‌డోర్ సబ్స్టేషన్లు, 22 ఇన్డోర్ సబ్స్టేషన్లను నిర్మిస్తుంది. పదేళ్లలో 1200 మెగావాట్ల వ్యత్యాసం.. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ మంచినీటి సరఫరా కోసం బోరు మోటర్, కనీసం నాలుగు లైట్లు, రెండు ఫ్యాన్లు, మిక్సీ, టీవీ, కంప్యూటర్, ఐరన్‌బాక్స్, వాటర్ హీటర్‌తో పాటు కూలర్, ఏసీ సర్వసాధారణం కావడంతో గృహ విద్యుత్ డిమాండ్ రెట్టింపైంది. సరిగ్గా పదేళ్ల క్రితం 24.12 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం 40 లక్షలు దాటింది. అప్పట్లో 1,538 మెగావాట్లు ఉన్న డిమాండ్ ప్రస్తుతం 2500-270 0 మెగావాట్లకు చేరింది. డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా వ్యవస్థ మాత్రం మెరుగుపడ లేదు. మండుతున్న ఎండలకు తోడు ఓవర్ లోడు వల్ల ఫీడర్లలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి, విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. డీపీఏఆర్పీ ప్రాజెక్ట్ కింద ఇటీవ ల 64 సబ్స్టేషన్లు నిర్మించినా సిటీజన్ల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. దీంతో కొత్తగా మరో 52 సబ్స్టేషన్లు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతిపాదిత ప్రాంతాలు ఇవే.. కోర్‌సిటీలో తీగలగూడ, మాదన్నపేట, అజీజ్‌బాగ్, దేవీబాగ్, ఛత్రినాక, అరుంధతికాలనీ, మూసారంబాగ్, పల్లెచెరువు, గ్రీన్బీచ్ అకాడమీ, హనుమాన్‌నగర్, సాహెబ్‌నగర్ కాలనీ, ప్రగతినగర్, పేట్లబషీర్బాగ్, జీడిమెట్ల పారిశ్రామికవాడ, దత్తాత్రేయనగర్, ఆస్మాన్‌ఘడ్, యాకుత్‌పుర, ప్రశాంత్నగర్రోడ్, మూసారంబాగ్ బి బ్లాక్, జమిస్థాన్పుర్, అంబర్పేట్ పోలీస్ స్టేషన్(2), గుడిమల్కాపుర్, ఆసిఫ్‌నగర్, మల్కజ్గిరిలో 33/11 కేవీ సబ్స్టేషన్లు నిర్మించనున్నారు. రంగారెడ్డి అర్బన్‌లో పర్వతపుర్, బోడుప్పల్, నాగారం, అంకిరెడ్డిపల్లి, రాందాసుపల్లి, జల్పల్, బండరావిలాల, హన్మగల్, హయత్‌నగర్, ఆది బట్ల, గౌరెల్లి, తాడిపత్రి, మున్నూరు, శామీర్‌పేట్, బోడుపల్లి, చిలుకూరు, చించెల్పేట్, మూమెన్కలాన్, కల్కోడ్, రావిర్యాల, వట్టినాగులపల్లి, థరూర్, చేవెళ్ల, ఎల్జీఎంపేట్లో కొత్త సబ్స్టేషన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో కొన్ని సబ్స్టేషన్లకు ఇప్పటికే శంకుస్థాపనలు కూడా చేయడం కొసమెరుపు. -
విద్యుత్ సమస్య తీర్చేందుకు సబ్స్టేషన్లు
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మేడ్చల్/ మేడ్చల్‌రూరల్ : మేడ్చల్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 3 సబ్స్టేషన్లు, మేడ్చల్‌లో ఓవర్ హెడ్ ట్యాంక్ పనులకు సోవువారం రాష్ట్ర రోడ్డురవాణా శాఖ మంత్రి వుహేందర్‌రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలో రూ.66 కోట్లతో సబ్ స్టేషన్ 33/11 సబ్స్టేషన్లు 11, 220/132 కేవీ సబ్‌స్టేషన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో విద్యుత్ సమస్య లేకుండా చేసేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి :మంత్రి జగదీశ్‌రెడ్డి మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు అహర్నిశలు కృషి చేస్తానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. రైతులకు విద్యుత్ ఇబ్బందులు కలగకుండా చేసేందుకు తవు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో వున రాష్ట్రం నుంచే ఇతర రాష్ట్రాల వారు విద్యుత్ పొందేలా సీఎం కేసీఆర్, జగదీశ్‌రెడ్డిలు చర్యలు చేపడుతున్నారని అన్నారు. జిల్లాకు రూ. 800 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్డు మంజూరయ్యాయని, వాటిలో మేడ్చల్ నియోజకవర్గానికి రూ.100కోట్లు కేటాయించానన్నారు. ఆర్అండ్బీ రోడ్లకు జిల్లాకు రూ.1200 కోట్లు రాగా నియోజకవర్గానికి రూ.200కోట్ల నుండి 300 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో కరెంట్ సమస్యతో బాధపడుతున్న ప్రజల కష్టాలు తీర్చిన ఘనత ముఖ్యవుంత్రి కేసీఆర్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహేందర్రెడ్డిలకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ జిల్లా ఈఈ సత్యనారాయణరెడ్డి, మేడ్చల్ డీఈ రత్నాకర్‌రావు,ఏఈ మోజెస్, మల్కాజిగిరి ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, నగర పంచాయతీ కమిషనర్ రామిరెడ్డి, ఎంపీడీఓ దేవసహాయం, తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఈఓపీఆర్డీ జ్యోతిరెడ్డి, పూడూర్, రాజబొల్లారం సర్పంచ్‌లు స్రవంతి, నారాయణగౌడ్, భాస్కర్‌యాదవ్, సత్యనారాయణ, రాములుయాదవ్, నందారెడ్డి, మల్లికార్జున్‌స్వామి, రాజమల్లారెడ్డి, మోనార్క్, నర్సింహారెడ్డి, రాఘవేందర్‌గౌడ్, శ్రావణ్కువూర్, రావుస్వామి తదితరులు పాల్గొన్నారు. శామీర్‌పేట మండలంలో... శామీర్ పేట్: శామీర్‌పేట మండలంలోని లాల్‌గడి మలక్‌పేట్, సంపన్‌బోల్(జగన్‌గూడ గ్రా మపంచాయతీ పరిధిలో)గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల పనులకు సోమవారం రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్కక్షణం కూడా కరెంటు పోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మలిపెద్దిసుధీర్‌రెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ చైర్మ న్, మేనేజింగ్ డెరైక్టర్ రఘుమారెడ్డి,ై డెరెక్టర్ ఆపరేషన్ శ్రీనివాసరెడ్డి, ప్రాజెక్ట్ డెరైక్టర్ శ్రీనివాస్, ఎస్ఈ రాంకుమార్, డీఈ రత్నాకర్‌రావు, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ , జెడ్పీటీసీ సభ్యుడు బాలేష్, డీఈ అబ్దుల్‌ఖరీం, ఈఈ సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి,ఎంపీడీఓ శోభారాణి, తహసీల్దార్ దేవుజా, ఎంఈఓ వసంతకుమారి, సర్పంచులు బీర్కురి వెంకటేశ్, జెనిగల శశికళ, కిశోర్‌యాదవ్, శ్రీ నివాస్ ముదిరాజ్, పద్మా లక్ష్మారెడ్డి, కోఆప్షన్‌సభ్యుడు చాంద్‌పాషా, ఎంపీటీసీ సభ్యులు రవీందర్‌రెడ్డి, సుభాషిణి, మల్లేష్‌గౌడ్,సునీతాలక్ష్మి, రా జు, టీఆర్ఎస్ నాయకులు విష్ణుగౌడ్, సతీష్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి, శంకర్‌ముదిరాజ్ పాల్గొన్నారు. -
అమ్మకానికి ఆపరేటర్ పోస్టులు..!
సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలకు బేరం 50 పోస్టుల భర్తీకి రూ. కోటి వసూలు చేసిన మధ్యవర్తులు నిరుద్యోగుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న అధికారపార్టీ నేతలు సాక్షి, కర్నూలు : విద్యుత్తు సబ్స్టేషన్లలో కాంట్రాక్టు ఉద్యోగాలకు అధికారపార్టీ నేతలు బేరం పెట్టారు. లోఓల్జేజీ సమస్య పరిష్కారం, నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసేందుకు ఉన్న సబ్స్టేషన్లు, ప్రస్తుతం నూతనంగా నిర్మించిన పలు విద్యుత్తు ఉపకేంద్రాలు కొందరు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసే షిఫ్టు ఆపరేటర్లు, నైట్‌వాచ్‌మెన్ పోస్టులు కర్నూలు జిల్లాలో రూ. లక్షలు పలుకుతున్నాయి. నిరుద్యోగ యువత నుంచి బాగా డిమాండ్ ఉండడంతో ఒక్కో పోస్టు రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు పలుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ పోస్టుల భర్తీకి ఆ పార్టీ నేతల సిఫారసులు అధికమయ్యాయి. ఇప్పటికే ఓ 50 పోస్టుల భర్తీ వ్యవహారంలో మధ్యవర్తులు రూ. కోటి వరకు వసూలు చేసినట్లు అంచనా. ఒక్కో సబ్‌స్టేషన్‌లో నలుగురు షిప్టు ఆపరేటర్లు, ఒక నైట్ వాచ్మెన్ పనిచేయాల్సి ఉంది. నాలుగు డివిజన్లలోని 199 సబ్-స్టేషన్లకు కలిసి మొత్తం 130 ఖాళీ పోస్టులున్నాయి. వీరిని కాంట్రాక్టు పద్ధతిలో డిస్కం అధికారులు నియమిస్తారు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న కొందరు అధికారపార్టీ నేతలు ఆ పోస్టులను విక్రయించే సంప్రదాయానికి తెరలేపారు. షిఫ్టు ఆపరేటర్ పోస్టుకు ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. నైట్‌వాచ్‌మెన్ పోస్టుకు మాత్రం ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. అయితే కాంట్రాక్టు పద్ధతి అయినా ఉద్యోగం పొందితే పర్మినెంట్ చేసే అవకాశం, ఇతరత్రా పోస్టులకు పదోన్నతి పొందే వీలుండడంతో నిరుద్యోగుల నడుమ తీవ్ర పోటీ నెలకొంది. సబ్స్టేషన్లలోని పోస్టులు పరిమితంగా ఉండడం, అవకాశం అరుదుగా రావడంతో ఒక్కో పోస్టుకు వందలాది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీటితోపాటు కర్నూలు, డోన్, ఆదోని, నంద్యాల డివిజన్లలో సుమారు 8 వరకు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం ఇటీవల పూర్తయింది. ఈ సబ్‌స్టేషన్లలోనూ షిప్టు ఆపరేటర్లు, నైట్ వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. నాయకుల చేతివాటం.. పోస్టులు తక్కువ, అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో పోటీ ఎక్కువైంది. ప్రస్తుతం ఉన్న ఖాళీలతోపాటు ఆదోని, నంద్యాలలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్లలో పోస్టులు భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదే అదనుగా షిఫ్టు ఆపరేటర్, నైట్‌వాచ్‌మెన్ పోస్టులను కొందరు అధికారపార్టీ నాయకులు విక్రయించడం ప్రారంభించారు. నిరుద్యోగుల పోటీని బట్టీ ఒక్కో పోస్టును రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు చెపుతున్నారు. ఉద్యోగం వస్తుందనే ఆశతో కొందరు నిరుద్యోగులు ఇప్పటికే మొదటి విడతగా రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు మధ్యవర్తులకు అప్పగించారు. మరికొందరు తాము ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువత నుంచి అందినంత మేర దండుకునే పనిలో నిమగ్నమయ్యారు. వీటితో పాటు నూతనంగా నిర్మించిన సబ్స్టేషన్లలో ఏర్పడిన ఖాళీ పోస్టులకు ఇదే విధంగా రూ. లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
విద్యుత్ సేవలకు విఘాతం
సమ్మెలో 1,200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పలు సేవలకు బ్రేక్ కదలని అధికారుల వాహనాలు ఆపరేటర్ల సమ్మెతో సబ్‌స్టేషన్‌లో సేవలకు అంతరాయం అయినా స్పందించని ప్రభుత్వం విజయవాడ : విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మెతో ఆ శాఖ సతమతమవుతోంది. సబ్స్టేషన్లలో పనిచేసే ఆపరేటర్లు సమ్మెకు దిగడంతో పలు కీలక సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. అధికారుల వాహనాలకు డ్రైవర్లుగా, సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్లుగా, బిల్లు రీడర్లుగా, బిల్లుల చెల్లింపు కేంద్రాల్లో ఆపరేటర్లుగా.. ఇలా పలు విభాగాల్లో పనిచేస్తున్న వారంతా సమ్మెకు దిగడంతో ఇబ్బందులు మొదలయ్యూరుు. జిల్లాలో మొత్తం 1,200 మంది వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండగా, విద్యుత్ శాఖలో ఆపరేటర్లుగానే 850 మంది పనిచేస్తున్నారు. వీరందరినీ రెగ్యులర్ చేస్తామని తెలుగుదేశంపార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా సీఎం చంద్రబాబునాయుడు దీని గురించి పట్టించుకోకపోగా, కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై సమీక్షలు నిర్వహించిన దాఖాలాలు కూడా లేవు. ఈ క్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘ నేతలు గతనెల 25వ తేదీన సదరన్ స్కామ్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు వెళ్తామని వారు ప్రకటించగా.. 23వ తేదీన ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని, సమ్మె ఉపసంహరించుకోవాలని డిస్కమ్ అధికారులు కోరారు. అరుుతే, వారి నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెలోకి వచ్చారు. 15వ తేదీ నుంచే అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 16వ తేదీ నుంచి నిరవధిక దీక్షలు కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులను కలిసి వారి సమ్మెకు మద్దతు ప్రకటించడమే కాకుండా దీనిపై అసెంబ్లీలో పోరాడతానని ప్రకటించడంతో సమ్మె మరింత ఉధృతమైంది. ఎక్కడి పనులు అక్కడే.. ప్రస్తుతం 180 సబ్స్టేషన్లలో మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి సబ్‌స్టేషన్‌లో నలుగురు ఆపరేటర్లు, ఒక వాచ్మెన్ ఉన్నారు. అరుుతే, కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న స్థానాల్లో ఇప్పటికే సీనియర్ ఉద్యోగులు, ఆపరేటర్లను నియమించారు. ఉదాహరణకు విజయవాడ సబ్‌డివిజన్ పరిధిలోని 52 సబ్స్టేషన్లలో 316 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 93 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 53 మంది సమ్మెలో ఉన్నారు. వారి స్థానాల్లో రెగ్యులర్ ఉద్యోగులను నియమించారు. అయితే, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె వల్ల విద్యుత్ శాఖ అధికారుల వాహనాలు కార్యాలయాలకే పరిమితమయ్యాయి. బిల్లు రీడర్లు కూడా సమ్మెలో ఉండటంతో బిల్లులు ఇంటింటికీ రాని పరిస్థితి ఏర్పడింది. సబ్‌స్టేషన్‌లో బేర్, లైన్ కటింగ్ సమస్యలతో పాటు మానిటరింగ్.. వంటి అనేక సేవలకు ఇబ్బంది కలుగుతోంది. కంప్యూటర్ ఆపరేటర్లు కూడా లేకపోవటంతో శాఖాపరమైన పనులకు కూడా బ్రేక్ పడింది. -
కొత్త రాజధానికి ముందస్తు ‘పవర్’!
* విజయవాడ, గుంటూరు పరిసరాల్లో 14 కొత్త సబ్స్టేషన్లు * ఇండోర్, గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్లు * ఏపీఎస్పీడీసీఎల్ ప్రతిపాదనలు * సబ్స్టేషన్లకు స్థలాలు దొరక్క సతమతం * గుంటూరు కేంద్రంగా మరో డిస్కంపై దృష్టి సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ పరిసరాల్లో రూపుదిద్దుకునే నూతన రాజధాని నగరానికి సరిపడా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ముందుగానే చర్యలు చేపడుతున్నారు. విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు పరిసర ప్రాంతాల్లో కొత్తగా ఇండోర్, గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మించేందుకు సమాయత్తమవుతున్నారు. వీటితో పాటు కొత్త ఫీడర్లు, వాటి నుంచి కొత్త లైన్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారు చేశారు. రాబోయే ఐదేళ్లలో విజయవాడ, గుంటూరు శివార్లలో పెరిగే అన్ని కేటగిరీల విద్యుత్ కనెక్షన్లకు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు రూ. 600 కోట్ల అంచనాతో తాజా ప్రతిపాదనలను రూపొందించారు. ప్రభుత్వం వీటిని పరిశీలిస్తోంది. విజయవాడ, గుంటూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో 7 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. నిత్యం 3 మెగావాట్ల విద్యుత్ లోడ్ పెరుగుతూనే ఉంది. నెలకు 30 వేలకు పైగా కొత్త కనెక్షన్లు ఇవ్వాల్సి వస్తోంది. దీనివల్ల ప్రతి నెలా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుగానే విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేసుకోవడం అవసరమని విద్యుత్ శాఖ భావించింది. రెండు నగరాల్లోనూ మరో 14 సబ్స్టేషన్లు... విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లతో పాటు ఆయా నగరాలకు శివారు ప్రాంతాల్లో మరో పద్నాలుగు 33 కేవీ సబ్స్టేషన్ల ఏర్పాటు అవసరమని అంచనావేశారు. విజయవాడ టౌన్ డివిజన్లో 24, గుణదల డివిజన్లో 21 సబ్స్టేషన్లు ఉండగా, ఈ రెండు డివిజన్లలోనూ మరో 8 సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేశారు. అదేవిధంగా గుంటూరులో 6 చోట్ల వీటిని నిర్మించనున్నారు. రెండు నగరాల్లోనూ అన్ని ఫీడర్లపైనా ఓవర్‌లోడ్ సమస్య ఎదురవడంతో ఇండోర్ సబ్స్టేషన్ల ఏర్పాటు అవసరమని అధికారులు నివేదించారు. మొగల్రాజపురం, గాంధీనగరం, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర, గొల్లపూడి, భవానీపురం ప్రాంతాల్లో ఇండోర్ సబ్స్టేషన్లు, గుణదలలో రూ. 80 కోట్ల అంచనాతో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు తయారు చేశారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ, అచ్చంపేట, అమరావతి ప్రాంతాల్లోనూ కొత్తగా సబ్స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో గజం స్థలం కూడా దొరక్క విద్యుత్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రభుత్వ, మునిసిపల్ స్థలాలను కేటాయించాలని కోరుతూ విజయవాడ, గుంటూరు, ఒంగోలు మునిసిపల్ కమిషనర్లకు, ఏపీఐఐసీ అధికారులకు విద్యుత్ శాఖ లేఖలు రాసింది. గుంటూరు కేంద్రంగా మరో డిస్కం? గుంటూరు కేంద్రంగా మరో డిస్కం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి కేంద్రంగా ఉన్న ఏపీఎస్పీడీసీఎల్ను రెండుగా విభజించి ఒక డిస్కం కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేస్తారని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గుంటూరులోని స్పిన్నింగ్ మిల్లుల యజమానులు, వినియోగదారుల సంఘం ప్రతినిధులు ఇటీవల సీఎంను కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించారు.