సబ్ స్టేషన్లను మూడు నెలల్లో పూర్తి చేయాలి
Published Fri, Nov 25 2016 1:29 AM | Last Updated on Tue, Aug 28 2018 7:15 PM
విద్యుత్ శాఖ చీఫ్ ఇంజినీర్ పీరయ్య
కర్నూలు (రాజ్‌విహార్):
కొత్తగా మంజూరైన విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని ఏపీ ఎస్‌పీడీసీఎల్ కర్నూలు జోన్ చీఫ్ ఇంజనీర్ ఎంపీ పీరయ్య ఆదేశించారు. గురువారం స్థానిక కొత్త బస్టాండ్‌లోని విద్యుత్ భవన్‌లో కర్నూలు, అనంతపురం జిల్లాల కన్‌స్ట్రక‌్షన్ డివిజన్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్ల వారీగా జరుగుతున్న పురోగతి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్‌స్టేషన్లు మంజూరైనట్లు వెల్లడించారు. డీడీయూ జీజేవై పథకం కింద మంజూరైన సబ్‌స్టేషన్లతోపాటు సాధారణ ఇతర వాటి పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. అగ్రిమెంట్లు పూర్తయిన పనులను ప్రారంభించిన మూడు నెలల్లో వినియోగంలోకి తేవాలన్నారు. ఒకవేళ గడువు ఉందని జాప్యం చేస్తే కుదరదన్నారు. సమావేశంలో డీఈఈలు ప్రదీప్‌కుమార్, రవీంద్రబాబు, వినాయక్ ప్రసాద్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
Advertisement