విద్యుత్‌శాఖ క్రీడల్లో జిల్లా హవా
విద్యుత్‌శాఖ క్రీడల్లో జిల్లా హవా
Published Thu, Oct 6 2016 6:27 PM | Last Updated on Wed, Sep 5 2018 3:37 PM
* టెన్నిస్ సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ కైవసం
* బాస్కెట్ బాల్‌లో ఘన విజయం
గుంటూరు స్పోర్ట్స్: విద్యుత్‌శాఖ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడలలో జిల్లా జట్లు హవా కొనసాగించి బాస్కెట్ బాల్, టెన్నిస్ విభాగాలలో విజేతలుగా నిలిచాయి. బుధవారం స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ టెన్నిస్ కోర్టులలో జరిగిన టెన్నిస్ టీం ఈవెంట్ ఫైనల్ మ్యాచ్‌లో కె.వి.ఎల్.ఎన్.మూర్తి, కె.మహేష్(గుంటూరు) జంట 7–3 స్కోర్‌తో పి.సుందరబాబు, ఎన్.ఎస్.ఆర్.కె ప్రసాద్ (విశాఖ) జంటపై విజయం సాధించి విజేతగా నిలిచింది. అనంతరం జరిగిన సింగిల్స్ ఫైనల్స్‌లో కె.వి.ఎల్.ఎన్.మూర్తి(గుంటూరు) 7–6 స్కోర్‌తో గుంటూరుకే చెందిన కె.మహేష్‌పై విజయం సాధించి టైటిల్ సాధించారు. బాస్కెట్ బాల్ ఫైనల్స్ మ్యాచ్‌లో గుంటూరు జట్టు 34–32 స్కోర్‌తో రాయలసీమ «థర్మల్ పవర్ ప్లాంట్ జట్టుపై విజయం సాధించింది. విజేతలకు ఏపీ ట్రాన్స్‌కో డైరెక్టర్ కె.నాగరాజు స్వామి బహుమతులు ప్రదానం చేశారు.
Advertisement
Advertisement