
వేటగాళ్ల విద్యుత్ తీగలకు చిరుత బలి
వై.రామవరం: తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం యార్లగడ్డ గ్రామ శివారులోని గురమంద అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యు త్ తీగలకు ఓ చిరుతపులి బలైంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చిం ది. వేటగాళ్లు చిరుత కాలి గోళ్ల కోసం పంజాల వరకూ నరికి పట్టుకుపోరుు, కళేబరాన్ని అక్కడే వదిలిపెట్టారు. చనిపోరుున చిరుత వయసు పదేళ్లు ఉండొచ్చని స్థానికులు అంటున్నారు.