ఖాళీ పోస్టుల భర్తీ ఎప్పుడో..? | Would replace the empty posts ..? | Sakshi
Sakshi News home page

ఖాళీ పోస్టుల భర్తీ ఎప్పుడో..?

Published Mon, Dec 5 2016 1:24 AM | Last Updated on Wed, Sep 5 2018 3:38 PM

ఖాళీ పోస్టుల భర్తీ ఎప్పుడో..? - Sakshi

ఖాళీ పోస్టుల భర్తీ ఎప్పుడో..?

రెండు సబ్‌స్టేషన్లకు ఒకే లైన్‌మెన్ ఒకే అసిస్టెంట్
విద్యుత్ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం

 
బేల : మండల విద్యుత్ శాఖ సెక్షన్ పరిధిలోని సబ్‌స్టేషన్ల తాలుకు పీఢర్ల పరిధిలో క్షేత్రస్థారుులో పనిచేసే సిబ్బందిని ఎప్పుడు నియమిస్తారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా మండలంలోని రెండు సబ్‌స్టేషన్‌లకు ఒక లైన్‌మెన్, ఒక అసిస్టెంట్ లైన్‌మెన్ మాత్రమే ఉన్నారు. దీంతో విద్యుత్ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం ఏర్పడుతున్నదని స్థానికులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఏళ్ల నుంచి బేల, జైనథ్ మండలాలకు అనుసంధానంగా విద్యుత్ శాఖలో ఒకే సెక్షన్ ఉండగా, ఎప్రిల్ నెలలో ఆ శాఖ చేపట్టిన పునర్ వ్యవస్థీకరణలో బేల మండలాన్ని ప్రత్యేక సెక్షన్‌గా ఏర్పాటు చేసింది. దీంతో పాటు ప్రత్యేకంగా ఏఈ పోస్టు కేటారుుంచగా ఈ పోస్టు భర్తీ అరుుంది.

మిగతా పోస్టులు కాలిగానే ఉనారుు. మండలంలోని ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా కోసం మండల కేంద్రంతో పాటు చప్రాల గ్రామ శివారులో ఒక్కొక్క సబ్‌స్టేషన్లు ఉన్నారుు. దీంతో పాటు మండలంలోని తోయగూడ, సైద్‌పూర్, సాంగ్వి(జి) గ్రామ పంచాయతీల పరిధిలోని 20గ్రామాలకు సైద్‌పూర్ పీఢర్(సాత్నాల సబ్‌స్టేషన్-జైనథ్) ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది.

నియామకం ఇలా
 ఒక్కొక్క పీఢర్ పరిధిలో విద్యుత్ సరఫరా పరిశీలన, బిల్లుల వసూలు కోసం ఒక లైన్‌మెన్, అసిస్టెంట్ లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్లను నియమిస్తారు. దీంతో పాటు విస్తీర్ణం అధికంగా ఉన్నట్‌లైతే అదనంగా మరో అసిస్టెంట్, జూనియర్ లైన్‌మెన్ పోస్టులలో ఎదైనా ఒక పోస్టు ఉంటుంది.

పీఢర్ల సరఫరా ఇలా..
మండలంలోని అన్ని గ్రామాలకు ఏడు పీఢర్ల ద్వారా విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. ఇందులో మండలకేంద్రంలోని సబ్‌స్టేషన్ పరిధిలో బేల టౌన్, సిర్సన్న, దహెగాం ఫీడర్ల పరిధిలో 25గ్రామాలు ఉన్నారుు. దీంతో పాటు చప్రాల సబ్‌స్టేషన్ పరిధిలో చప్రాల టౌన్, పాటన్, మాంగ్‌రుడ్ పీఢర్ల పరిధిలో 32గ్రామాలు ఉన్నారుు. ఇంతేకాకుండా మరోక సైద్‌పూర్ పీఢర్(సాత్నాల సబ్‌స్టేషన్-జైనథ్) ద్వారా 20గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతోంది.

ఖాళీల వివరాలు
మండలకేంద్రంలోని సబ్‌స్టేషన్ పరిధిలోని బేల టౌన్ పీఢర్‌కు జూనియర్ లైన్‌మెన్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో పాటు దహెగాం, సిర్సన్న పీఢర్‌లలో ఒక లైన్‌మెన్‌తో పాటు అసిస్టెంట్, జూనియర్ లైన్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నారుు. చప్రాల సబ్‌స్టేషన్ పరిధిలోని చప్రాల టౌన్, పాటన్, మాంగ్‌రుడ్ పీఢర్‌లతో పాటు మరోక సైద్‌పూర్ పీఢర్‌కు ’బేల లైన్‌మెన్’యే ఇంఛార్జీగా కొనసాగుతున్నారు. కాగా ఈ ఫీడర్‌ల పరిధిలో అన్ని పోస్టులు ఖాళీగా ఉంటే, ఉన్న లైన్ ఇన్‌‌సపెక్టర్ ఇంఛార్జీగా కొనసాగుతారు. ఈ లైన్ ఇన్‌‌సపెక్టర్ స్థానికంగా ఉండకపోవడంతో, విద్యుత్ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం ఏర్పడుతున్నది. ఇకనైనా ప్రభుత్వం, విద్యుత్ శాఖ స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement