empty posts
-
1.70 లక్షల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానాలు ఖమ్మం రూరల్: రాష్ట్రంలోని 1.70 ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దారుపల్లి లో ఆదివారం రాష్ట్ర కమిటీ సమావే శం జరిగింది. దీంతో సీపీఎం మహా జనపాదయాత్రను ఒకరోజు నిలిపి వేశారు. ఈ సమావేశం పలు తీర్మా నాలను ఆమోదించింది. ఖాళీ పోస్టు లను భర్తీచేయాలని, రాజకీయ జేఏసీ ఫిబ్రవరి 27న నిర్వహించే నిరుద్యోగ ర్యాలీకి మద్దతు ప్రకటించాలని తీర్మా నించింది. ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమం చేస్తున్న కోదండరాంపై ప్రభుత్వం, నాయకులు అక్కసు వెళ్లగ క్కడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిం చింది. ప్రభుత్వ పాఠశాలలను కుదిం చాలనే ఆలోచనను ప్రభుత్వం విర మించుకోవాలని, ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరింది. అంబేడ్కర్ భావాలను ఎలు గెత్తిచాటి, కులోన్మాదాన్ని, పరువు హత్యలపై కుటిలనీతిని విమర్శించే లా నిర్మించిన శరణం గచ్ఛామి సిని మాకు సెన్సార్‌బోర్డు అనుమతి ఇవ్వక పోవడాన్ని ఖండిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. రాష్ట్ర నాయకులు బి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు -
ఖాళీ పోస్టుల భర్తీ ఎప్పుడో..?
►రెండు సబ్స్టేషన్లకు ఒకే లైన్మెన్ ఒకే అసిస్టెంట్ ►విద్యుత్ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం బేల : మండల విద్యుత్ శాఖ సెక్షన్ పరిధిలోని సబ్స్టేషన్ల తాలుకు పీఢర్ల పరిధిలో క్షేత్రస్థారుులో పనిచేసే సిబ్బందిని ఎప్పుడు నియమిస్తారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా మండలంలోని రెండు సబ్స్టేషన్లకు ఒక లైన్మెన్, ఒక అసిస్టెంట్ లైన్మెన్ మాత్రమే ఉన్నారు. దీంతో విద్యుత్ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం ఏర్పడుతున్నదని స్థానికులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఏళ్ల నుంచి బేల, జైనథ్ మండలాలకు అనుసంధానంగా విద్యుత్ శాఖలో ఒకే సెక్షన్ ఉండగా, ఎప్రిల్ నెలలో ఆ శాఖ చేపట్టిన పునర్ వ్యవస్థీకరణలో బేల మండలాన్ని ప్రత్యేక సెక్షన్‌గా ఏర్పాటు చేసింది. దీంతో పాటు ప్రత్యేకంగా ఏఈ పోస్టు కేటారుుంచగా ఈ పోస్టు భర్తీ అరుుంది. మిగతా పోస్టులు కాలిగానే ఉనారుు. మండలంలోని ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా కోసం మండల కేంద్రంతో పాటు చప్రాల గ్రామ శివారులో ఒక్కొక్క సబ్స్టేషన్లు ఉన్నారుు. దీంతో పాటు మండలంలోని తోయగూడ, సైద్పూర్, సాంగ్వి(జి) గ్రామ పంచాయతీల పరిధిలోని 20గ్రామాలకు సైద్పూర్ పీఢర్(సాత్నాల సబ్‌స్టేషన్-జైనథ్) ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. నియామకం ఇలా ఒక్కొక్క పీఢర్ పరిధిలో విద్యుత్ సరఫరా పరిశీలన, బిల్లుల వసూలు కోసం ఒక లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్, జూనియర్ లైన్మెన్లను నియమిస్తారు. దీంతో పాటు విస్తీర్ణం అధికంగా ఉన్నట్లైతే అదనంగా మరో అసిస్టెంట్, జూనియర్ లైన్మెన్ పోస్టులలో ఎదైనా ఒక పోస్టు ఉంటుంది. పీఢర్ల సరఫరా ఇలా.. మండలంలోని అన్ని గ్రామాలకు ఏడు పీఢర్ల ద్వారా విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. ఇందులో మండలకేంద్రంలోని సబ్‌స్టేషన్ పరిధిలో బేల టౌన్, సిర్సన్న, దహెగాం ఫీడర్ల పరిధిలో 25గ్రామాలు ఉన్నారుు. దీంతో పాటు చప్రాల సబ్‌స్టేషన్ పరిధిలో చప్రాల టౌన్, పాటన్, మాంగ్రుడ్ పీఢర్ల పరిధిలో 32గ్రామాలు ఉన్నారుు. ఇంతేకాకుండా మరోక సైద్పూర్ పీఢర్(సాత్నాల సబ్‌స్టేషన్-జైనథ్) ద్వారా 20గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఖాళీల వివరాలు మండలకేంద్రంలోని సబ్‌స్టేషన్ పరిధిలోని బేల టౌన్ పీఢర్కు జూనియర్ లైన్మెన్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో పాటు దహెగాం, సిర్సన్న పీఢర్లలో ఒక లైన్‌మెన్‌తో పాటు అసిస్టెంట్, జూనియర్ లైన్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నారుు. చప్రాల సబ్‌స్టేషన్ పరిధిలోని చప్రాల టౌన్, పాటన్, మాంగ్రుడ్ పీఢర్లతో పాటు మరోక సైద్పూర్ పీఢర్కు ’బేల లైన్మెన్’యే ఇంఛార్జీగా కొనసాగుతున్నారు. కాగా ఈ ఫీడర్ల పరిధిలో అన్ని పోస్టులు ఖాళీగా ఉంటే, ఉన్న లైన్ ఇన్సపెక్టర్ ఇంఛార్జీగా కొనసాగుతారు. ఈ లైన్ ఇన్సపెక్టర్ స్థానికంగా ఉండకపోవడంతో, విద్యుత్ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం ఏర్పడుతున్నది. ఇకనైనా ప్రభుత్వం, విద్యుత్ శాఖ స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
రెవెన్యూ శాఖలో భర్తీ కాని ఖాళీలు
► అదనపు పనిభారంతో ఉద్యోగులు, సిబ్బంది అందోళన ► నేటి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రస్తావనకు సన్నద్ధం సాక్షి, సిటీబ్యూరో: ఒక వైపు పనిభారం.. మరోవైపు సిబ్బంది కొరత రెవెన్యూ యంత్రాంగాన్ని భయపెడుతున్నది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, హరితహారం వంటి అదనపు కార్యకలాపాలు రెవెన్యూ ఉద్యోగులను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో గురువారం కలెక్టరేట్ నుంచి ‘20 ఎజెండా’ అంశాలపై జిల్లా అధికారయంత్రాంగం నిర్వహించతలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్‌లో పని భారంపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా... ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా ఫైలును పక్కనపెట్టిన సర్కారు... రోజుకో కొత్త నిర్ణయంతో ఒత్తిడికి గురిచేస్తోంది. మరోవైపు జిల్లాల పునర్విభజన ముహూర్తం కూడా సమీపిస్తుండడంతో తహసీల్దార్ల నియామకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు తహసీల్దార్లకు జూలైలో డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు లభించాయి. తహసీల్దార్ స్థాయి అధికారులకు ప్రమోషన్లు ఇచ్చిన సర్కారు.. డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించలేదు. దీంతో ఈ పోస్టులను ఇప్పటికిప్పుడు భర్తీ చేసే పరిస్థితి కనిపించడంలేదు. అదే సమయంలో అటూ పదోన్నతులు లభించిన తహసీల్దార్ల ఫైలుకు మోక్షం కలగలేదు. వీరికి పోస్టింగ్‌లకు ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అదనపు పనులతో ఇబ్బందులు... వెబ్‌ల్యాండ్ అప్డేషన్, అసైన్డ్ భూముల సర్వే, యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణ, జీఓ 58,59 అమలు, భూముల వేలం తదితర పనులతో రెవెన్యూ అధికారులు సతమతమవుతున్నారు. జిల్లాలో ఒకటి, రెండు మండలాలు మినహాయించి మిగతా మండలాల్లో జనాభా 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉండటంతో ఇక్కడి సిబ్బందిపై పని భారం రెండింతలు పడుతున్నది. ఇక్కడ ధృవీకరణ పత్రాల జారీ శక్తికి మించిన భారమవుతున్నది. దీనికితోడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తదితర ప్రాజెక్టులకు ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ కూడా తహసీల్దార్లకు కత్తిమీద సాములా మారింది. ఏ మాత్రం ఆలసత్వం ప్రదర్శించినా ఉద్యోగానికే ఎసరొచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భూసేకరణ అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కొంతమంది తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించిన సర్కారు.. అదేసమయంలో కిందిస్థాయి అధికారులకు కూడా ప్రమోషన్లు ఇవ్వకపోవడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణంగా చెప్పవచ్చు. కేవలం రెవెన్యూ విధులేగాకుండా... కల్యాణలక్ష్మి, షాదీముబారక్, హరితహారం తదితర పథకాల అమలులోనూ తహసీల్దార్లదే కీలకపాత్ర. దీనికితోడు వారానికి నాలుగురోజులు సీసీఎల్ఏ, సీఎస్, కలెక్టర్, జేసీలు, ఇతర శాఖాధిపతులు నిర్వహిస్తున్న సమావేశాలు కూడా పనులను ప్రభావితం చేస్తున్నాయి. కొంతమంది తహసీల్దార్లు మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షలను సాకుగా చూపి కార్యాలయాలకు ఎగనామం పెడుతుండడంతో అర్జీదారుల బాధలు వర్ణణాతీతంగా మారాయి. -
విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం
- పదోన్నతుల కౌన్సెలింగ్ సాయంత్రం 6గంటలకు ప్రారంభం - ఖాళీపోస్టుల లెక్కతేలక ఆలస్యం - తమ పోస్టులు తమకే కేటాయించాలని దళిత ఉపాధ్యాయ సంఘాల నిరసన మహబూబ్‌నగర్ విద్యావిభాగం : విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల ఉదయం 9గంటలకు ప్రారంభం కావాల్సిన పదోన్నతుల కౌన్సెలింగ్ సాయంత్రం 6గంటలకు ప్రారంభమైంది. బుధవారం నిర్వహించిన జీహెచ్‌ఎంల బదిలీల కౌన్సెలింగ్‌లో నాట్‌విల్లింగ్ ఇచ్చిన వారు మళ్లీ వచ్చి పోస్టింగ్ తీసుకోవడం, కోరుకున్న పోస్టులను,ఖాళీ పోస్టులను గుర్తించడంలో డీఈఓ కార్యాలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ సమస్య తలెత్తింది. మొత్తం 53మంది స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించేందుకు అధికారులు కౌన్సెలింగ్ ఏర్పాట్లు చేశారు. తీరా ప్రారంభించే ముందు 6పోస్టులు తక్కువగా లెక్క తేలుతున్నాయి. మొత్తం 53పోస్టులకు గాను 47మాత్రమే ఖాళీలు కనిపించాయి. మిగతా ఆరు పోస్టులు ఎక్కడ పోయాయనేది గుర్తించేందుకు విద్యాశాఖాధికారులకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సమయం పట్టింది. దళిత ఉపాధ్యాయ సంఘాల ఆందోళన సాయంత్రం 6గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు వచ్చిన జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, డీఈఓ ఎన్.రాజేష్, రాష్ట్ర పరిశీలకుడు నజీముద్దీన్‌తో ఉపాధ్యాయల సంఘాల నాయకులు జెట్టి రామస్వామి, జంగయ్య, బాలపీరు, సుదర్శన్, సతీష్‌కుమార్, ఎన్.వెంకటేష్, హన్మంతరావు ఆందోళనకు దిగారు. 484 జీహెచ్ఎం పోస్టులకుగాను జీఓ ప్రకారం 15శాతం అంటే 73పోస్టులు ఎస్సీలకు ఉండాలి. కానీ 62మంది మాత్రమే జీహెచ్ఎంలు ఉన్నారని, ఇంకా 11మందికి ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రస్తుత కౌన్సెలింగ్‌లో రోస్టర్ ప్రకారం 9మంది ఎస్సీలకు మాత్రమే జీహెచ్‌ఎంల పదోన్నతి ఇస్తామని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. గతంలో 2009 నుంచి 2014 వరకు ఎస్సీ అడక్వేసి దాటిందని 27పోస్టులు ఇతరులకు కేటాయించారని తెలిపారు. ఎస్సీలకు సంబంధించిన పోస్టులను ఇతర వర్గాలకు కేటాయించడం వల్ల ఎస్సీలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. తమకు రావల్సిన పోస్టులు ఇచ్చిన తర్వాతనే కౌన్సెలింగ్ నిర్వహించాలని అన్నారు. దీంతో సాయంత్రం జేసీ రాంకిషన్ కౌన్సిలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మాట్లాడారు. రోస్టర్ పాయింట్స్ లేనందును 9 పోస్టులను ప్రస్తుతం ఇస్తామని, తర్వాతా వచ్చే రోస్టర్‌లో కేటాయిస్తామని ఇప్పటి నుంచి రూల్స్ ఖచ్చితంగా పాటిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దీంతో కౌన్సెలింగ్ ప్రారంభమయ్యింది. రాత్రి 9.30కు 35వరకు పదోన్నతులు నిర్వహించారు. రాత్రి 11గంటలకు వరకు కౌన్సెలింగ్ జరగొచ్చని అధికారులు తెలిపారు. -
వైద్యం పూజ్యం
నెల్లూరు (వైద్యం): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏళ్ల తరబడి ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. దీంతో పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రతి ఏటా భారీగా నిధులు విడుదలవుతున్నాయి. కాని వాటిని సద్వినియోగం చేయడంలో వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పీహెచ్‌సీలన్నీ సమస్యలతో విలవిలలాడుతున్నాయి. ఉదాహరణకు ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం పీహెచ్సీలో కొన్ని నెలలుగా వైద్యులు లేరు. ఇటీవల ఆ ఆస్పత్రి ఫార్మసిస్ట్ దగదర్తికి బదిలీ అయ్యారు. కనీసం ల్యాబ్ టెక్నీషియన్ కూడా లేకపోవడం వైద్యశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టకు నిదర్శనమని చెప్పవచ్చు. ఈ ఆస్పత్రికి నిత్యం 70 మందికి పైగా ఔట్‌పేషంట్లు వస్తుంటారు. వీరికి ఏఎన్‌ఎమ్‌లే వైద్యసేవలు అందించడం గమనార్హం. జిల్లాలో మొత్తం 74 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, మూడు ఏరియా ఆస్పత్రులు, రెండు పీపీ యూనిట్లు, 17 క్లస్టర్లు ఉన్నాయి. పోస్ట్‌లు అవసరం పని చేస్తున్నవారు ఖాళీలు వైద్యులు 172 151 21 స్టాఫ్ నర్సులు 135 99 36 ఏఎన్ఎమ్ 477 325 152 కాంట్రాక్ట్ఏఎన్ఎం 477 394 83 ఫార్మాసిస్ట్లు 66 42 24 ల్యాబ్ టెక్నీషియన్ 62 15 47