సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానాలు
ఖమ్మం రూరల్: రాష్ట్రంలోని 1.70 ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దారుపల్లి లో ఆదివారం రాష్ట్ర కమిటీ సమావే శం జరిగింది. దీంతో సీపీఎం మహా జనపాదయాత్రను ఒకరోజు నిలిపి వేశారు. ఈ సమావేశం పలు తీర్మా నాలను ఆమోదించింది. ఖాళీ పోస్టు లను భర్తీచేయాలని, రాజకీయ జేఏసీ ఫిబ్రవరి 27న నిర్వహించే నిరుద్యోగ ర్యాలీకి మద్దతు ప్రకటించాలని తీర్మా నించింది.
ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమం చేస్తున్న కోదండరాంపై ప్రభుత్వం, నాయకులు అక్కసు వెళ్లగ క్కడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిం చింది. ప్రభుత్వ పాఠశాలలను కుదిం చాలనే ఆలోచనను ప్రభుత్వం విర మించుకోవాలని, ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరింది. అంబేడ్కర్ భావాలను ఎలు గెత్తిచాటి, కులోన్మాదాన్ని, పరువు హత్యలపై కుటిలనీతిని విమర్శించే లా నిర్మించిన శరణం గచ్ఛామి సిని మాకు సెన్సార్‌బోర్డు అనుమతి ఇవ్వక పోవడాన్ని ఖండిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. రాష్ట్ర నాయకులు బి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు