గారడి చేయడంలో కేసీఆర్ నంబర్ వన్ | Tammineni Veerabhadram and Kodandaram comments on kcr | Sakshi
Sakshi News home page

గారడి చేయడంలో కేసీఆర్ నంబర్ వన్

Published Wed, Nov 16 2016 4:06 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

గారడి చేయడంలో కేసీఆర్ నంబర్ వన్ - Sakshi

గారడి చేయడంలో కేసీఆర్ నంబర్ వన్

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  

 తాండూరు రూరల్: అబద్ధాలు చెప్పడంలో.. గారడి చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నంబర్ వన్ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన జరగాలన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరుకు చేరుకుంది. పట్టణంలోని భద్రేశ్వరచౌక్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కావాలనే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. వైద్యం అధ్వానంగా ఉందన్నారు. మూతపడిన పరిశ్రమలను తెరిపిస్తే రాష్ర్టంలో ఉన్న యువతకు లక్షల్లో ఉద్యోగాలు వస్తాయన్నారు. వరంగల్‌లో అజంజాహి స్పిన్నింగ్ మిల్లు, ఖమ్మంలో ఇనుపరారుు పరిశ్రమ, ఆదిలాబాద్‌లో గ్లాసు పరిశ్రమలను ఆధునీకరిస్తే స్థానికులకు ఉద్యోగావకాశాలు దక్కుతాయన్నారు.
 
 జేఏసీ ఆధ్వర్యంలో దినపత్రిక తెస్తాం: కోదండరాం
 త్వరలో దినపత్రికను ప్రారంభిస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. నెలరోజుల్లో జేఏసీ కార్యకలాపాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. సీపీఎం మహాజన పాదయాత్రకు ఆయన మద్దతు పలికారు. తెలంగాణ వచ్చినా ప్రజలు ఇంకా అభివృద్ధికి నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తి గౌరవంగా బతికేరోజు రావాలన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తామన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement