సిరివెళ్ల: కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలో శనివారం ఉదయం 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడి గడ్డం చెన్నమ్మ(14) అనే బాలిక మృతిచెందింది. ప్రకాష్ కుమార్తె చెన్నమ్మ శనివారం ఉదయం ఇంటి ముందు ఉండగా పైనున్న విద్యుత్ తీగ ఒక్కసారిగా తెగిపడింది.
దాంతో విద్యుత్ షాక్‌కు గురైన చెన్నమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.