electrocuted victims
-
విద్యుదాఘాతంలో ఎనిమిది మంది కూలీలు మృతి.. ఎలక్ట్రిక్ స్తంభం నిలబెడుతూ..
జార్ఖండ్‌లో దారణం జరిగింది. విద్యుదాఘాతంలో ఎనిమిది మంది కూలీలు మృతి చెందారు. ధన్‌బాద్ జిల్లాలోని నిచిత్‌పుర్ రైల్వే గేట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎలక్ట్రిక్ స్తంభాన్ని నిలబెడుతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రైల్వే గేట్ సమీపంలో ఎలక్ట్రిక్ స్తంభం.. 25000 వోల్టుల హై టెన్షన్ వైర్‌పై పడిపోయింది. దాన్ని నిలబెట్టడానికి కూలీలు వెళ్లారు. పనిలో నిమగ్నమైన క్రమంలో అనుకోకుండా హై టెన్షన్ వైర్‌కు తగిలారు. ఎనిమిది మంది కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో రైల్వే రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రైళ్లను దారి మళ్లించారు. ఇదీ చదవండి:Delhi Shahbad Dairy Case:: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..! -
అనంతపురం దుర్ఘటన.. సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం దర్గహొన్నూర్‌లో బుధవారం కరెంట్ తీగలు తెగిపడి వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ఈ ఘటన గురించి తెలిసిన సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులకు, సీఎం జగన్ సూచించారు. కాగా, వ్యవసాయ కూలీలున్న ట్రాక్టర్‌పై విద్యుత్ తీగలు తెగిపడడంతో ఘోరం జరిగింది. నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకి చేరింది. ఇక ఈ ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్ విచారణకు ఆదేశించింది. కార్పొరేట్ కార్యాలయం నుంచి చీఫ్ జనరల్ మేనేజర్ (పి&ఎంఎం) డి.వి. చలపతి నేతృత్వంలో చీఫ్ జనరల్ మేనేజర్ (ఓ&యం) కె. గురవయ్య, విజిలెన్స్ ఇన్స్ పెక్టర్ (అనంతపురం) యం. విజయ భాస్కర్ రెడ్డిలతో కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కళ్యాణ దుర్గం) ఎస్. మల్లికార్జున రావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (బొమ్మనహాళ్) ఎం.కె. లక్ష్మీరెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ప్రొటెక్షన్) హెచ్, హమీదుల్లా బేగ్, లైన్ మ్యాన్ ( దర్గా హొన్నూర్) కె బసవ రాజులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అనంతపురం సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్స్/ రాయదుర్గం) శేషాద్రి శేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (యం &పి/ అనంతపురం) కె. రమేష్ ల నుంచి వివరణ కోరుతూ ఏపీఎస్పీడీసీఎల్ ఆదేశాలు జారీ చేసింది. -
చీకలగుర్కి మృతుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
అనంతపురం: అనంతపురం జిల్లా విడపనకల్ మండలం చీకలగుర్కిలో విద్యుత్ షాక్‌తో ఐదుగురు మృతి చెందిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం మృతుల కుటుంబాని ఆయన పరామర్శించారు. అనంతరం అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... మృతి చెందిన ఒక్కొక్కరికి రూ. 5 లక్షల నష్ట పరిహరం అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం చీకలగుర్కిలోని పంట చేలో బోరు వేసి ... ఐరన్ రాడ్ బయటకు తీశారు. ఆపైనే ఉన్న హై టెన్షన్ వైర్లకు సదరు ఐరన్ రాడ్ తగలడంతో విద్యుత్ షాక్‌లో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.