చీకలగుర్కి మృతుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
అనంతపురం: అనంతపురం జిల్లా విడపనకల్ మండలం చీకలగుర్కిలో విద్యుత్ షాక్తో ఐదుగురు మృతి చెందిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం మృతుల కుటుంబాని ఆయన పరామర్శించారు. అనంతరం అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... మృతి చెందిన ఒక్కొక్కరికి రూ. 5 లక్షల నష్ట పరిహరం అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం చీకలగుర్కిలోని పంట చేలో బోరు వేసి ... ఐరన్ రాడ్ బయటకు తీశారు. ఆపైనే ఉన్న హై టెన్షన్ వైర్లకు సదరు ఐరన్ రాడ్ తగలడంతో విద్యుత్ షాక్లో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.