
సాక్షి, అనంతపురం: బీసీలను వెన్నముకగా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి అన్నారు. జిల్లాలోని జూనియర్ కళాశాల మైదానంలో భక్త కనకదాస జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్‌నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంవెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు.
కాగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసమే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలు ప్రవేశపెట్టారని గర్తుచేశారు. బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత సీఎం జగన్‌ది అని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఉషాశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కృష్ణప్ప, రాగే పరశురాం, అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment