kanakadasa jayanthi
-
హుందాతనం చాటుకున్న గోరంట్ల మాధవ్
సాక్షి, అనంతపురం: ఏడాది కిందట కురుబ సంఘం ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల వేదికగా జరిగిన కనకదాస జయంతి వేడుకల్లో గోరంట్ల మాధవ్ రాకను అప్పటి టీడీపీ ఎమ్మెల్యే పార్థసారథి అక్షేపించారు. ఆ రోజుల్లో కదిరిలో సీఐగా గోరంట్ల మాధవ్ పనిచేసేవారు. తనకు ఆహ్వానం లేకపోయినా.. కులం మీద అభిమానంతో సభకు ఒక సాధారణ వ్యక్తిగా హాజరైన మాధవ్ పట్ల వేలాదిమంది కురుబలు అభిమానం వ్యక్తం చేస్తూ భుజాలపై ఎత్తుకుని సభావేదిక వద్దకు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి.. సభావేదికపై నుంచే మాధవ్‌పై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డాడు. కనకదాస జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న మంత్రి శంకరనారాయణ దీంతో కాస్త గందరగోళం నెలకొని ముఖ్యఅతిథిగా విచ్చేసిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం.. వైఎస్సార్ సీపీ తరుఫున హిందూపురం ఎంపీగా పోటీ చేసి తిరుగులేని విజయాన్ని అందుకోవడం విదితమే. ఆదివారం అదే ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కనకదాస జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే పార్థసారథిని ఎంపీ మాధవ్ స్వయంగా వెళ్లి ఆహ్వానించి, తన హుందాతనాన్ని చాటుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల కార్యక్రమానికి తాను హాజరు కాలేకపోతున్నట్లు పార్థసారథి పేర్కొన్నారంటూ మాధవ్ సభావేదికపై నుంచి ప్రకటించారు. సమావేశానికి హాజరైన కురుబలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తూ.. రాష్ట్రంలో వెనుకబడిన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేస్తున్నారంటూ బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ కొనియాడారు. కనకదాస రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనంతపురంలో ఆదివారం నిర్వహించింది. ముందుగా గుత్తి రోడ్డులోని కనకదాస విగ్రహానికి మంత్రి శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి, కలెక్టర్ సత్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి వెండి రథంలో కనకదాస చిత్రపటాన్ని ఉంచి జూనియర్ కళాశాల వరకూ శోభాయాత్రగా తీసుకొచ్చారు. చదువు ఒక్కటే మార్గం జూనియర్ కళాశాలలో అధికారికంగా నిర్వహించిన కనకదాసు జయంతి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కురబలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి శంకరనారాయణ మాట్లాడారు. కవిత్వం, సాహిత్యంతో సమాజాన్ని మేల్కోల్పిన గొప్ప మహనీయుడు భక్త కనకదాసని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు. ఇతర కులాలతో పోటీ పడాలంటే చదువు ఒక్కటే మార్గమని అన్నారు. ప్రతి కుటుంబంలోనూ పిల్లలను బాగా చదివించాలని కోరారు. ఓటు బ్యాంక్‌గా చూశారు కనకదాస జయంతిని అధికారికంగా చేపట్టాలని 15 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోలేదని శంకరనారాయణ గుర్తు చేశారు. బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే టీడీపీ చూస్తూ వచ్చిందని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వచ్చారన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో 50 శాతానికి పైగా బలహీన వర్గాల వారికే అవకాశం కల్పించడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ రామారావు, కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు వశికేరి లింగమూర్తి, రిటైర్డ్ జడ్జి కిష్టప్ప, మాజీ మేయర్ రాగే పరుశురాం, రాజహంస శ్రీనివాసులు, బోరంపల్లి ఆంజనేయులు, నెమలివరం ఈశ్వరయ్య, లలిత కళ్యాణి, బిల్లే మంజునాథ్, కేవీ మారుతీప్రకాష్, బ్యాళ్ల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
‘బీసీలను వెన్నముకగా చూస్తున్న సీఎం’
సాక్షి, అనంతపురం: బీసీలను వెన్నముకగా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి అన్నారు. జిల్లాలోని జూనియర్ కళాశాల మైదానంలో భక్త కనకదాస జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్‌నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంవెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. కాగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసమే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలు ప్రవేశపెట్టారని గర్తుచేశారు. బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత సీఎం జగన్‌ది అని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఉషాశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కృష్ణప్ప, రాగే పరశురాం, అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
‘సీఎం జగన్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది’
సాక్షి, అనంతపురం: కురుబ కులస్తుల ఆరాధ్య దైవం భక్త కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనంతపురం జిల్లా వాసులు, ముఖ్యంగా కురబ కులస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఈ ఏడాది జరగబోయే భక్త కనకదాస జయంతి వేడుకలు అధికారిక లాంఛనాలతో అంబరాన్నంటనున్నాయి. ఇక సీఎం కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడగానే మంత్రి శంకర్ నారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, కురుబ కులస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు అనంతపురంలోని కనకదాస విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ.. కురుబల మనోభావాలను గుర్తించి కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు కురుబలకు ఇచ్చిన అన్ని హామీలను విస్మరించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని, కేవలం ఓటు బ్యాంక్ కోసం బీసీలను వాడుకున్నారని మంత్రి శంకర్ నారాయణ ధ్వజమెత్తారు. కాగా ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జగన్‌కు కురుబ కులస్తులు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. సీపీఐ మనస్పూర్తిగా స్వాగతిస్తోంది కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అనంతపురం సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ నిర్ణయాన్ని సీపీఐ మనస్పూర్తిగా స్వాగతిస్తోందన్నారు. కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోలేదని జగదీష్ విమర్శించారు. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం భక్త కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కురుబ సంఘం నేతలు వసికేరి లింగమయ్య, రాగే పరశురాం, తదితరులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కులస్తుల మనోభావాలను గుర్తించారని, అంతేకాకుండా రాజకీయ ప్రాధాన్యత కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. -
కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షడు శంకరనారాయణ పరిగి(పెనుకొండ రూరల్) : ఆర్థికంగా వెనుకబడిన కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని భీరలింగేశ్వరస్వామి ఆలయం వద్ద కురుబ కులస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కురుబలను ఎస్టీల్లో చేరుస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీడీపీ ...ఆ తర్వాత ఆ విషయాన్నే మరిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే పార్థసారథి కూడా కురుబలను పూర్తిగా విస్మరించారన్నారు. కురుబలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే విద్యతోనే అది సాధ్యమని, అందువల్ల కురుబలంతా తమ పిల్లలను బాగా చదివించాలన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలను చదివిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లేనన్నారు. కురుబలు కర్ణాటకలో ఎస్టీ జాబితాలో ఉన్నారనీ, రాష్ట్రంలో కూడా ఎస్టీ జాబితాలో చేర్చేలా సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కేటీ శ్రీధర్, వైఎస్సార్సీపీ బీసీ సెల్ నాయకులు వెంకటరమణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు పరిగిలో కనకదాసు జయంతి
హిందూపురం రూరల్ : పెనుకొండ తాలూకా పరిధి పరిగి మండల కేంద్రంలో ఆదివారం భక్త కనకదాస జయంతి మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం సభ్యులు తెలిపారు. పరిగిలోని బీరలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఉదయం 11 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు బైక్‌ర్యాలీ, 9 గంటలకు మహిళలతో జ్యోతుల ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపులో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు. ముఖ్య అతిథులుగా పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ, కురుబసంఘం జిల్లా అధ్యక్షుడు రాగేపరుశురాం, రాయలసీమ కురుబసంఘం అధ్యక్షులు పీటీ నరసింహారెడ్డి, బోరంపల్లి ఆంజినేయులు, పెనుకొండ కాంగ్రెస్ ఇన్చార్జ్ కేటీ శ్రీధర్, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ హాజరవుతారని తెలిపారు. -
చదువుతోనే రాజకీయాలు సాధ్యం
లేపాక్షి : సమాజంలో కురుబలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలంటే చదువుతోనే సాధ్యమవుతుందని కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగే పరుశురాం అన్నారు. గురువారం మధ్యాహ్నం లేపాక్షి మండలం పి.సడ్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కనకదాసు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లుగా రాష్ట్రంలో కనకదాసు జయంతి వేడుకలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా కురుబలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామని వివరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ, పరిగి ఎంపీపీ సత్యనారాయణ, నాయకులు బుల్లే జగదీష్, వసికేరి రమేష్, వసికేరి లింగమూర్తి, వసికేరి శివ, దేవరగుడి వేణుగోపాల్, బాలాజి, అశ్వర్థప్ప, కృష్ణమూర్తి, స్థానిక అధ్యక్ష, కార్యదర్శి కగ్గల్లప్ప, మహేష్ పాల్గొన్నారు.