పెనుకొండ తాలూకా పరిధి పరిగి మండల కేంద్రంలో ఆదివారం భక్త కనకదాస జయంతి మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం సభ్యులు తెలిపారు.
హిందూపురం రూరల్ : పెనుకొండ తాలూకా పరిధి పరిగి మండల కేంద్రంలో ఆదివారం భక్త కనకదాస జయంతి మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం సభ్యులు తెలిపారు. పరిగిలోని బీరలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఉదయం 11 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు బైక్‌ర్యాలీ, 9 గంటలకు మహిళలతో జ్యోతుల ఊరేగింపు ఉంటుంది.
ఊరేగింపులో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు. ముఖ్య అతిథులుగా పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ, కురుబసంఘం జిల్లా అధ్యక్షుడు రాగేపరుశురాం, రాయలసీమ కురుబసంఘం అధ్యక్షులు పీటీ నరసింహారెడ్డి, బోరంపల్లి ఆంజినేయులు, పెనుకొండ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కేటీ శ్రీధర్, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ హాజరవుతారని తెలిపారు.