బీఆర్‌ఎస్‌లో విషాదం.. మాజీ మంత్రి హరీశ్వర్‌ రెడ్డి కన్నుమూత | BRS Senior Leader Koppula Harishwar Reddy Passed Away Due To Illness - Sakshi
Sakshi News home page

Koppula Harishwar Reddy Death: మాజీ మంత్రి హరీశ్వర్‌ రెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్‌ సంతాపం

Published Sat, Sep 23 2023 7:15 AM | Last Updated on Sat, Sep 23 2023 10:55 AM

BRS Leader Koppula Harishwar Reddy Passed Away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పరిగి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి(76) కన్నుమూశారు. శ్వాస సరిగ్గా ఆడక కార్డియాక్‌ అరెస్ట్‌ అయి హరీశ్వర్‌ రెడ్డి మృతి చెందారు. 

వివరాల ప్రకారం.. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పరిగిలో నివాసముంటున్న ఆయనకు శుక్రవారం రాత్రి 10.10 గంటల సమయంలో గుండెపోటు వచ్చిందని, వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. హరీశ్వర్‌ రెడ్డి.. సీఎం కేసీఆర్‌ అత్యంత సన్నిహితుడు.  

ఇక, హరీశ్వర్‌రెడ్డి 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికలలో పరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన హరీశ్వర్‌రెడ్డి పరిగి ఉపసర్పంచ్‌గా, 1978లో సర్పంచ్‌గా, సమితి వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పరిగిలో నిర్వహించనున్నారు. హరీశ్వర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేశ్‌రెడ్డి ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

సీఎం కేసీఆర్‌ సంతాపం..
మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి సీఎం సంతాపం వ్యక్తం చేశారు. పరిగి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాభిమానం పొందిన నాయకుడు హరీశ్వర్‌రెడ్డి అని సీఎం కొనియాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. హరీశ్వర్‌రెడ్డి కుమారుడు ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement