Police Solved Vikarabad Nursing Student Sirisha Death Case - Sakshi
Sakshi News home page

కొలిక్కి వచ్చిన శిరీష మృతి కేసు.. ఆ ఇద్దరే హంతకులు.. ఎంత దారుణంగా హతమార్చారో..

Published Wed, Jun 14 2023 1:12 PM | Last Updated on Wed, Jun 14 2023 2:52 PM

Police Solved Vikarabad Nursing  Student Sirisha Death Case - Sakshi

సాక్షి, వికారాబాద్‌: నర్సింగ్‌ విద్యార్థిని శిరీష అనుమానాస్పద కేసును పోలీసులు చేధించారు. శిరీషను హత్య చేసింది ఆమె బావ అనిల్‌, అతని స్నేహితుడు రాజుగా పోలీసులు తేల్చారు. మద్యం మత్తులో శిరీష బావ, అతని ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించారు.

కాగా మొదటి నుండి బావ చుట్టే కేసు తిరుగుతున్నప్పటికీ గత మూడు రోజులుగా అనిల్‌ పోలీసుల ఎదుట నోరు మెదపలేదు. చివరికి అనిల్ కాల్ డేటా ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు అతని స్నేహితుడినిసైతం అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ ఇద్దరిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. బావ అనిల్‌, అతని స్నేహితుడు కలిసి శిరీషను అత్యంత దారుణంగా హతమార్చినట్లు తెలిసింది.

చెప్పిన మాట వినడం లేదని.. ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఉంటుందని శిరీషతో బావ అనిల్ వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అదే సమయంలో మరో రూంలోకి వెళ్ళి శిరీష ఆత్మహత్యాయత్నం చేయగా..  గది గడియ విరగొట్టి శిరీషను  బయటకు తీసుకొచ్చిన అనిల్‌.. ఆమెపై చెయ్యి చేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆమె బావ పరిగి వెళ్ళిపోయాడు. మనస్థాపానికి గురైన యువతి  ఇంటి నుంచి బయటకు వెళ్లింది. శిరీష ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఆమె సోదరుడు శ్రీను.. అనిల్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు. 

అప్పటికే తన మిత్రుడితో కలిసి ఫుల్‌గా మద్యం సేవించిన అనిల్.. మరో బీరు తీసుకొని ఫ్రెండ్‌తో కలిసి కాడ్లాపూర్ బయలుదేరాడు.  ఊరు శివారులో ఉన్న మైసమ్మ గుడి దగ్గర శిరీష కనిపించడంతో ఆగ్రహంతో ఆమెపై అనిల్‌ చెయ్యి చేసుకున్నాడు. అంతేగాక అతని ఫ్రెండ్‌ రాజు, శిరీషను అక్కడే ఉన్న కుంటవైపు లాకెళ్ళి వెంటతెచ్చుకున్న బీరు బాటిల్‌తో తల పగల గొట్టి కళ్ళల్లో గుచ్చినట్లు సమాచారం. తనను వదిలేయండి అంటూ శిరీష ఎంత ప్రదేయపడ్డా క్రూరులు వదల్లేదని, మోకాలు లోతు నీళ్ళున్న కుంటలో ఆమెను ఇద్దరు కలిసి విసిరేసినట్లు తెలిసింది. శిరీష చనిపోయే వరకు ఆమె దేహంపై అనిల్ ఫ్రెండ్ నిలుచున్నట్లు తెలుస్తోంది. 

చనిపోయిందని నిర్దారించుకొని అక్కడ ఆనవాళ్ళను మాయం చేసి ఎవరి దారిన వారు వెళ్లి మళ్ళీ శిరీష కోసం వెతికినట్లు నాటకం ఆడారు. కాగా ఇద్దరు నిందితులు ఇంకా పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. మరి కొన్ని గంటల్లో పోలీసులు దీనికి సంబంధించి అధికారికంగా పూర్తి సమాచారాన్ని వెల్లడించనున్నారు.
చదవండి: లండన్‌లో హైదరాబాద్‌ యువతి దారుణ హత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement