Jalna
-
ప్రౌడ్ మూమెంట్
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వర్చువల్‌గా ప్రారంభించిన జాల్నా–ముంబై వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు లోకో–పైలట్ అయిన కల్పన ధనవత్ సోషల్ మీడియా అట్రాక్షన్‌గా మారింది. 27 సంవత్సరాల కల్పన ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత అసిస్టెంట్ లోకో–పైలట్‌గా చేరింది. ట్రైన్ ప్రారంభోత్సవ సమయంలో కల్పన సెలబ్రిటీగా మారింది. సెల్ఫోన్లో ఆమె ఫొటోలు తీసుకోవడానికి ప్రయాణికులు పోటీ పడ్డారు. ‘ప్రౌడ్ మూమెంట్: గర్ల్ ఫ్రమ్ పూలంబ్రీ బికమ్స్ ది ఫస్ట్ ఉమన్ లోకో–పైలట్ ఆఫ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు ‘ఎక్స్చేంజింగ్ ఆఫ్ సిగ్నల్స్ బిట్వీన్ లోకో– పైలట్ అండ్ అసిస్టెంట్ లోకో – పైలట్ ఆఫ్ జాల్నా–ముంబై ఎక్స్‌ప్రెస్’ కాప్షన్‌తో రైల్వేశాఖ పోస్ట్ చేసిన కదులుతున్న ట్రైన్ వీడియో కూడా ఆట్టుకుంటోంది. -
స్టీల్ వ్యాపారి కార్యాలయాలపై ఐటీ దాడులు.. డబ్బులు లెక్కించడానికి 13 గంటలు
సాక్షి, ముంబై: దేశంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రముఖ వ్యాపారవేత్తలు, అధికారుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులతో బిజీగా మారాయి. సీబీఐ, ఈడీ, ఐటీ ఇలా ప్రతి సంస్థ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు, దర్యాప్తులు ముమ్మరం చేశాయి. ఇటీవల టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ భారీ స్థాయిలో వెనకేసినట్టు ఈడీ గుర్తించిన విషయం తెలిసిందే. అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ వద్ద నుంచి దాదాపు రూ.50 కోట్ల వరకు నగదు, కిలోలకొద్దీ బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. జల్నాలో ఓ బడా వ్యాపారికి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై ఉక్కు, బట్టల వ్యాపారి, రియల్ ఎస్టేట్ డెవలపర్‌కు చెందిన పలు ప్రాంతాల్లో ఆగస్టు 1 నుంచి 8 వరకు ఈ దాడులు నిర్వహించింది. ఐటీ అధికారుల తనిఖీల్లో వ్యాపారి నుంచి కళ్లు చెదిరే మొత్తంలో అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: 70 ఏళ్లుగా ఉండేది.. బావి కనపడుట లేదని పోలీసులకు ఫిర్యాదు ఈ సోదాల్లో రూ. 56 కోట్ల నగదు, 32 కిలోల బంగారం, ముత్యాలు, వజ్రాలు, ప్రాపర్టీ పేపర్లతో సహా దాదాపు రూ. 100 కోట్ల బినామీ ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన నగదును లెక్కించేందుకు అధికారులకు ఏకంగా 13 గంటల సమయం పట్టింది. అయితే ఈ ఆస్తులు ఎవరికి సంబంధించినవో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. Maharashtra | Income Tax conducted a raid at premises of a steel, cloth merchant & real estate developer in Jalna from 1-8 Aug. Around Rs 100 cr of benami property seized - incl Rs 56 cr cash, 32 kgs gold, pearls-diamonds & property papers. It took 13 hrs to count the seized cash pic.twitter.com/5r9MHRrNyR — ANI (@ANI) August 11, 2022 -
ఎండర్ఫుల్ కుకీస్
డాక్టర్ మినాల్ కబ్రా, మహారాష్ట్రలోని జల్నా నగరంలో డెంటిస్ట్. తన దగ్గరకు వచ్చే పేషెంట్లను పరీక్ష చేస్తున్నప్పుడు ఆమెకో సంగతి తెలిసింది. ముఖ్యంగా పిల్లలను పరీక్ష చేస్తున్నప్పుడు ‘ఇది వ్యక్తిగత అనారోగ్యం కాదు, సామాజిక అనారోగ్యం’ అని తెలిసింది. సమస్య మనుషుల్లో కాదు, వారు తింటున్న ఆహారంలో అని నిర్ధారణ అయింది. పిల్లలు తింటున్న చాక్లెట్లు పిల్లల దంతాలను తినేస్తున్నాయని అర్థమైంది. దాంతో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారు తినాల్సిన చిరుతిండ్ల మీద కూడా దృష్టి పెట్టాలి. తన దగ్గరకు వచ్చిన పేషెంట్లకు మాటల్లో చెప్పడం ద్వారా పరిష్కారం అయ్యే సమస్య కాదిది. సమస్య మూలాన్ని మార్చేయాల్సిందే. అందుకే రాగి, జొన్న, ఓట్, అవిసె గింజలు, కొబ్బరి, తోటకూర గింజలు, మునగ ఆకు, గోధుమ పిండి, బెల్లం, అల్లం, నిమ్మరసం వంటి ఆరోగ్యకరమైన దినుసులతో పిల్లలు ఇష్టపడే కుకీ బిస్కెట్లు తయారు చేయిస్తోంది డాక్టర్ మినాల్ కబ్రా. మినాల్ పిల్లల ఆరోగ్యం గురించి మాత్రమే కాదు, పర్యావరణ హితాన్ని కూడా అదే స్థాయిలో కోరుకుంటోంది. అదేంటంటే... ఆమె తయారు చేయిస్తున్న కుకీస్ ఏవీ అగ్నిపక్వాలు కాదు మొత్తం అర్కపక్వాలే. అంటే సూర్యకిరణాల వేడితో తయారవుతాయన్న మాట. వందకు చేరాలి డాక్టర్ మినాల్ కబ్రా రెండేళ్ల కిందట ‘కివు’ పేరుతో చేసిన ప్రయోగం విజయవంతమైంది. ‘‘మా జల్నాలో ఏడాదిలో మూడు వందల రోజులు మంచి ఎండ ఉంటుంది. ప్రకతి ఇచ్చిన వనరును ఉపయోగించుకోవడంకంటే మించిన ఆలోచన ఏముంటుంది? అందుకే సోలార్ ఎనర్జీతో పని చేసే కుకీ మేకింగ్ యూనిట్ డిజైన్ చేయించుకున్నాను. మామూలుగా అయితే ప్రతి కుకీ తయారీలో ఐదు గ్రాముల కార్బన్ డయాకై ్సడ్ విడుదలై పర్యావరణంలో కలుస్తుంది. సోలార్ ఎనర్జీ ఉపయోగించడం వల్ల ఈ మేరకు నివారించవచ్చు. 2016 నుంచి ఏడాది పాటు సొంతంగా ప్రయోగం చేశాను. రెండేళ్ల కిందట పరిసర గ్రామాల్లో గ్రామానికి ఇద్దరు చొప్పున మహిళలను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి సోలార్ బేకింగ్ యూనిట్లను ఇచ్చాను. ఇందులో నేను ఎంటర్‌ప్రెన్యూర్‌ని కాదు, వాళ్లు నా ఉద్యోగులూ కాదు. ఎవరి యూనిట్‌కి వాళ్లే యజమానులు. నేను కేవలం ‘ఏం చేయాలి, ఎలా చేయాలి’ అనే సూచనలు మాత్రమే ఇస్తాను. మార్కెట్ చేయడానికి ఒక వేదికను కల్పించానంతే. ఈ ఉత్పత్తులు ఇప్పటి వరకు పదిహేడు పట్టణాల్లో మొత్తం 72 స్టోర్లకు చేరాయి. వీటిని వంద క్లస్టర్లకు చేర్చాలనేది నా లక్ష్యం. ఇప్పటి వరకు 825 కిలోల కర్బన కాలుష్యాలను నివారించగలిగాం. మరోసారి చెబుతున్నాను నేను ఎంటర్‌ప్రెన్యూర్‌ని కాదు. ఒక సమాజహితమైన పని చేయడమే నా ఉద్దేశం. ఈ ప్రాక్టీస్ దేశమంతటా విస్తరింపచేయడం, కొనసాగింపచేయడం కోసం పని చేస్తాను. డెంటిస్ట్‌గా నా ప్రాక్టీస్ కొనసాగుతుంది’’ అన్నారు డాక్టర్ మినాల్. డాక్టర్ మినాల్ చేసిన ప్రయత్నం గ్రామీణ మహిళలకు మంచి ఉపాధి మార్గంగానూ మారింది. ఖర్చులు పోగా రోజుకు నాలుగు వందల యాభై రూపాయలు మిగులుతున్నాయని చెప్పింది మినాల్ దగ్గర శిక్షణ తీసుకుని కుకీలు చేస్తున్న స్వప్న. -
వివాహేతర సంబంధం.. ట్రాక్టర్‌తో తొక్కించి
ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న ఆరోపణలతో అత్తింటి వారు ఓ మహిళను, ఆమె ప్రియుడిని హతమార్చారు. ట్రాక్టర్ చక్రాల కింద తొక్కించి అత్యంత పాశవికంగా హత్యచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు శుక్రవారం వెల్లడించారు. వివరాలు.. జల్నా జిల్లాకు చెందిన మరియా అనే మహిళ(32)కు చపల్‌గావ్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. పదేళ్ల క్రితమే భర్త మరణించడంతో అప్పటి నుంచి అత్తింట్లోనే ఉంటూ జీవితం గడుపుతోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వివాహితుడైన హర్బక్ భగవత్(27)తో మరియాకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న ఆమె అత్తింటి వారు ఇద్దరిని మందలించారు. ఇలాంటి పనులు మానుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినప్పటికీ భగవత్, మరియా వైఖరిలో ఎలాంటి మార్పురాకపోగా, మార్చి 30న ఇద్దరూ కలిసి గుజరాత్‌కు పారిపోయారు. దీంతో మరియా కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 22న వారి జాడ కనుక్కొని పోలీసులు, మహారాష్ట్రకు తీసుకువచ్చారు.(చదవండి: షాకింగ్: రోడ్డుపై దారుణ హత్య.. ఆపై) ఇక అప్పటి నుంచి వీరిద్దరు తమ గ్రామంలోనే సహజీవనం మొదలుపెట్టారు. దీంతో కోపోద్రిక్తులైన మరియా మామ బాత్వెల్ సంపత్ లాల్జరే, అతడి కొడుకు వికాస్ లాల్జరే ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావించారు. అక్టోబరు 28న మరియా, భగవత్ మోటార్ సైకిల్‌పై పక్క ఊరికి వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్‌ను వాళ్ల మీదకు ఎక్కించగా.. టైర్ల కింద పడి తీవ్రగాయాలపాలయ్యారు. ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపే మృతి చెందారు. ఈ ఘటనపై భగవత్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను, మరియాను వికాస్, సంపత్ కలిసి ఉద్దేశపూర్వకంగానే హత్యచేశారని ఆరోపించింది. ఈ క్రమంలో నిందితులను అరెస్టు చేసి, హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: తమ్ముడి ప్రేమ.. అల్లుడిని హత్యచేసిన అత్త) -
చెరువులో పడి ఐదుగురు బాలికలు మృతి
ముంబై: ప్రమాదవశాత్తు చెరువలో పడి ఐదుగురు బాలికలు మరణించిన ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లా భోకార్డన్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రోజున తలేగావ్ వాడీ గ్రామానికి చెందిన ఆరుగురు బాలికలు కలిసి బట్టలు ఉతికేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ చెరువులోకి దిగిన ఐదుగురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువు పూడికలో చిక్కుకుపోయారు. అటుగా వెళ్తున్న వారు బాలికల్ని రక్షించడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. చదవండి: ‘అమ్మ’మ్మలే హతమార్చారు.. పూడికలో చిక్కుకుపోయిన బాలికలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా.. వారు అప్పటికే మృతిచెందినట్లు ఫూలంబ్రీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులు తెలిపారు. దీంతో ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా.. మరణించిన బాలికలను అశుబీ లతీఫ్ పఠాన్ (6), నబియా నవాజ్ పఠాన్ (6), అల్ఫియా గౌస్ ఖాన్ పఠాన్ (7), సానియా అస్లాం పఠాన్ (6), షాబు అస్లాం పఠాన్ (5)గా గుర్తించారు. చదవండి: నదిలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి -
నోట్లో గుడ్డలు కుక్కి...టీవీ వాల్యూమ్ పెంచి...
ఔరంగాబాద్ లో రెండు సంవత్సరాల చిన్నారి ముందే భార్యను దారుణంగా హత్య చేశాడో భర్త. పరాయిపురా లోని జాల్నాకు చెందిన అశోక్ లఖన్ లాల్ సుర (35) భార్య పూజ (25)పై దాడిచేసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యను పూపిరాడకుండా చేసిన హత్య చేసిన నిందితుడు అనంతరం పోలీసు స్టేషన్ కెళ్లి లొంగిపోయాడు. పోలీసును సైతం విస్మయపర్చిన ఈఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిందితుడు అశోక్ కి పూజతో ఆరేళ్ల క్రితం పెళ్లి అయింది. ఉమ్మడి కుటుంబంలో నివసించే వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. మద్యానికి బానిసైన నిందితుడికి కుటుంబ సభ్యులు ఇటీవల డ్రగ్ ఎడిక్షన్ చికిత్స కూడా చేయించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ.. ఆదివారం ఉదయం భార్య నోటిలో గుడ్డలు కుక్కి, హింసకు పాల్పడ్డాడు. భార్య నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో... ఆమె అరుపులు ఎవరికీ వినబడకుండా.. టీవీ వాల్యూమ్ బాగా పెంచి మరీ ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో గొంతుపై తీవ్రంగా పొడవంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం అక్కడినుంచి పారిపోయిన అశోక్...పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు.అయితే ఇదంతా ప్రత్యక్షంగా గమనించిన పాప..నానమ్మకు సమాచారం అందించింది. రక్తపు మడుగులో వున్న కోడల్ని చూసి హతాశురాలైన ఆమె చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని..పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కాగా నిందితుడిపై హత్య కేసు నమోదు చేసామని, సదర్ బజార్ స్టేషన్ ఎస్ఐ జైసింగ్ మదన్ సింగ్ పరదేశి చెప్పారు.