ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వర్చువల్‌గా ప్రారంభించిన జాల్నా–ముంబై వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు లోకో–పైలట్ అయిన కల్పన ధనవత్ సోషల్ మీడియా అట్రాక్షన్‌గా మారింది. 27 సంవత్సరాల కల్పన ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత అసిస్టెంట్ లోకో–పైలట్‌గా చేరింది. ట్రైన్ ప్రారంభోత్సవ సమయంలో కల్పన సెలబ్రిటీగా మారింది.
సెల్‌ఫోన్‌లో ఆమె ఫొటోలు తీసుకోవడానికి ప్రయాణికులు పోటీ పడ్డారు. ‘ప్రౌడ్ మూమెంట్: గర్ల్ ఫ్రమ్ పూలంబ్రీ బికమ్స్ ది ఫస్ట్ ఉమన్ లోకో–పైలట్ ఆఫ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు ‘ఎక్స్‌చేంజింగ్ ఆఫ్ సిగ్నల్స్ బిట్వీన్ లోకో– పైలట్ అండ్ అసిస్టెంట్ లోకో – పైలట్ ఆఫ్ జాల్నా–ముంబై ఎక్స్‌ప్రెస్’ కాప్షన్‌తో రైల్వేశాఖ పోస్ట్ చేసిన కదులుతున్న ట్రైన్ వీడియో కూడా ఆట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment