
ముంబై: ప్రమాదవశాత్తు చెరువలో పడి ఐదుగురు బాలికలు మరణించిన ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లా భోకార్డన్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రోజున తలేగావ్ వాడీ గ్రామానికి చెందిన ఆరుగురు బాలికలు కలిసి బట్టలు ఉతికేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ చెరువులోకి దిగిన ఐదుగురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువు పూడికలో చిక్కుకుపోయారు. అటుగా వెళ్తున్న వారు బాలికల్ని రక్షించడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. చదవండి: ‘అమ్మ’మ్మలే హతమార్చారు..
పూడికలో చిక్కుకుపోయిన బాలికలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా.. వారు అప్పటికే మృతిచెందినట్లు ఫూలంబ్రీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులు తెలిపారు. దీంతో ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా.. మరణించిన బాలికలను అశుబీ లతీఫ్ పఠాన్ (6), నబియా నవాజ్ పఠాన్ (6), అల్ఫియా గౌస్ ఖాన్ పఠాన్ (7), సానియా అస్లాం పఠాన్ (6), షాబు అస్లాం పఠాన్ (5)గా గుర్తించారు. చదవండి: నదిలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి
Comments
Please login to add a commentAdd a comment