drown in water
-
మహారాష్ట్రలో జలపాతంలో కొట్టుకుపోయిన కుటుంబం
పుణె: మహారాష్ట్రలో ప్రముఖ పర్యాటక ప్రాంతం భూషీ ఆనకట్ట దిగువన ఉన్న జలపాతంలో వద్ద ఒక కుటుంబం కొట్టుకుపోయింది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో వరదనీటి ప్రవాహం జలపాతం వద్ద పోటెత్తింది. హదాప్సార్ నుంచి వచి్చన అన్సారీ కుటుంబం ఇదే సమయంలో జలపాతం వద్ద ఉంది. ప్రవాహం ధాటికి అంతా కొట్టుకుపోయారు. ఈ ఘటనలో 36 ఏళ్ల శహిష్ట అన్సారీ, 13 ఏళ్ల అమీమీ, ఎనిమిదేళ్ల ఉమేరాల మృతదేహాలను దిగువన కనుగొన్నారు. ఇద్దరి జాడ గల్లంతైంది. -
హైదరాబాద్ నానక్ రాంగూడలో విషాదం..
-
హైదరాబాద్ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో విషాదం
-
విషాదం.. చెరువులోకి మునిగి టీచర్‌తోపాటు ఐదుగురు విద్యార్థుల మృతి
సాక్షి, మేడ్చల్: ఈత సరదా ఐదుగురు విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. వారిని రక్షించడానికి వెళ్లిన మదరసా టీచర్ సైతం మృత్యువాత పడ్డారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ విషాదకర ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ కాచిగూడ ప్రాంతానికి చెందిన హనీఫా మదరసాలో చదువుకునే దాదాపు 40 మంది విద్యార్థులు శనివారం డీసీఎం వాహనంలో వారి టీచర్ యహియా (25)తో కలసి జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారంలో ఓ గృహప్రవేశానికి హజరయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో కొందరు ఫంక్షన్ జరుగుతున్న ఇంట్లోకి వెళ్లగా మరికొందరు బయట ఆడుకుంటున్నారు. వీరిలో ఆరుగురు విద్యార్థులు సమీపంలో ఉన్న ఎర్రగుంట చెరువులో సరదాగా ఈతకు వెళ్లారు. నీటిలోకి దిగిన విద్యార్థులు ఈతరాక ఒక్కొక్కరుగా మునిగిపోయారు. వీరిని గమనించిన ఉపాధ్యాయుడు యహియా వేగంగా వచ్చి నీళ్లలోకి దిగి పిల్లలను కాపాడేప్రయత్నం చేశారు. అయితే పిల్లలు ఆయనను గట్టిగా పట్టుకోవడంతో అందరూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. వీరిలో ఒక విద్యార్థిని అక్కడే ఉన్న స్థానికుడు రక్షించి ఒడ్డుకు చేర్చాడు. ఈ లోగా టీచర్ యహియాతో పాటు ఐదుగురు విద్యార్థులు.. ఇస్మాయిల్ (11), జాఫర్ (10), సోహెల్ (09), అయాన్ (09), రియాన్(12)లు మృత్యువాతపడ్డారు. విషయం తెలుసుకున్న కుషాయిగూడ ఏసీపీ సాధన రశ్మీ పెరుమాల్, జవహర్‌నగర్ సీఐ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్లను రప్పించి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చదవండి: నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా?.. వీడియో బయటపెడతా భయాందోళనలో తోటి విద్యార్థులు మదరసా నుంచి గృహప్రవేశానికి వచి్చన విద్యార్థులు సరదాగా గడుపుతున్న సమయంలో టీచర్‌తోపాటు ఐదుగురు స్నేహితులు జలసమాధి అయిన విషయం తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు. తోటి విద్యార్థులు నీటిలో మునిగిపోయారని కన్నీరుమున్నీరయ్యారు. ఆగ్రహించిన స్థానికులు ఎర్రగుంట చెరువులో పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారుల్లో ఎలాంటి చలనం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆ ప్రాంతంలోని చెరువుల్లో మునిగి చనిపోయారని, వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంబర్‌పేటలో విషాదఛాయలు మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కారం ఎర్రగుంట చెరువులో శనివారం ఈతకు వెళ్లి మృతి చెందిన ఐదుగురు విద్యార్థులు అంబర్‌పేట నియోజకవర్గం హడ్డికార్ఖానా, సుందర్‌నగర్, నెహ్రూనగర్ ప్రాంతాలతో పాటు అంబర్‌పేటకు చెందినవారు కావడంతో ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కాచిగూడ పోలీసులు హడ్డికార్ఖానా ప్రాంతంలోని మదరసా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌లు పరామర్శించారు. కాగా, గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్దకు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ పిల్లల మృతదేహాలను చూసి భోరున విలపించారు. ఈ సందర్భంగా మృతదేహాలకు పోస్టుమార్టం వద్దని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు మార్చురీ అద్దాలను ధ్వంసం చేశారు. అయితే ఎమ్మెల్యే, కార్పొరేటర్ నచ్చజెప్పడంతో వారు శాంతించారు. చదవడి: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయని.. యువకుడు మృతి -
‘దసరాకి కొత్త దుస్తులు నాన్నా.. ఈ రోజే తెద్దాంలే కన్నా’.. అంతలోనే
సాక్షి, రంగారెడ్డి: ‘నాన్నా.. దసరా పండగకి నాకు కొత్త దుస్తులు కావాలి..’ ఇదీ కొడుకు కోరిక. తెద్దాంలే నాన్న.. ఈ రోజే తీసుకుందాం.. ఇదీ చిరునవ్వుతో తండ్రి వాగ్దానం. అంతలోనే విధి వక్రీకరించింది. గంట వ్యవధిలోనే కొడుకును నీటి గుంత పొట్టనపెట్టుకుంది. పండుగ దుస్తు లు కావాలన్న కొడుకు విగతజీవిగా కనిపించడంతో ఆ తండ్రి రోదనకు అంతే లేకుండా పోయింది. షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని సోలీపూర్ శివారులో నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందిన సంఘటనలో నెలకొన్న విషాదం ఇదీ. వ్యవసాయ కూలీగా పని చేసే భిక్షపతి కుమారుడు అక్షిత్ సోమవారం ఉదయాన్నే పండుగ దుస్తులు అడిగాడు. తీసుకుందాం అనుకున్నంతలోనే ఈ ఘోరం జరిగిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని కన్నీరుమున్నీరయ్యాడు. ముగ్గురు కుమారుల్లో చిన్న వాడైన అక్షిత్‌ను అల్లారుముద్దుగా చూసుకున్నామని.. ఇలా జరుగుతుందనుకోలేదని తల్లిదండ్రులు భిక్షపతి, శివలీల రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఆ ఇద్దరూ అన్నదమ్ముల కొడుకులు మృతి చెందిన మరో ఇద్దరిలో సైఫ్, ఫరీద్ అన్నదమ్ముల పిల్లలు. మృతుల తండ్రులు సలీం, నయూం వరుసకు అన్నదమ్ములు. ఎక్కడికి వెళ్లినా సైఫ్, ఫరీద్ ఒకరిని విడిచి ఒకరు ఉండే వారు కాదని.. ఒకరంటే మరొకరికి ఎంతో ప్రాణమని కుటంబ సభ్యులు తెలిపారు. బతుకమ్మలు, నవరాత్రులతో సందడిగా ఉన్న గ్రామంలో ముగ్గురి మరణం ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. -
అయ్యో కొడుకా.. ఎంత పనాయే..!
సాక్షి, పెద్దపల్లి(మంథని): ‘అయ్యో కొడుకా.. ఎంత పనాయే.. మీ నాన్న ఆరోగ్యం సహకరించకపోయినా కూలీనాలీ చేసుకుంట మిమ్మల్ని చదివిస్తున్న. రెక్కలు ముక్కలు చేసుకుని ముగ్గురిని సాదుకుంటున్న. మీరే సర్వస్వం అనుకుని మిమ్మల్ని చూసుకునే బతుకుతున్న. ఎంత కష్టమైనా భరించుకుంటున్న. ఇప్పుడు పుట్టెడు శోకంలో ముంచితివి కదా బిడ్డా..’ అంటూ ఆ తల్లి గుండలవిసేలా రోదించింది. రామగిరి మండలం రత్నాపూర్ పంచాయతీ పరిధి బేగంపేట క్రాస్ రోడ్డుకు చెందిన పదో తరగతి విద్యార్థి తంగళ్లపల్లి విష్ణువర్ధన్ సోమవారం ఈతకు వెళ్లి మృత్యువాతపడగా.. గ్రామస్తులు, కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. తంగళ్లపల్లి రామచంద్రం, రాజ్యలక్ష్మి దంపతులది స్వగ్రామం లద్నాపూర్ కాగా.. ఆ గ్రామాన్ని సింగరేణి సంస్థ స్వాధీనం చేసుకోవడంతో దాదాపు 20ఏళ్ల క్రితమే జీవనోపాధి నిమిత్తం ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు. రామచంద్రం మానసికస్థితి సరిగా లేకపోవడంతోపాటు పక్షవాతం బారిన పడ్డాడు. దీంతో రాజ్యలక్ష్మి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలతోపాటు భర్తను కాపాడుకుంటోంది. మొదటి కుమారుడు కేశవర్ధన్ ఐటీఐ చేస్తున్నాడు. విష్ణువర్ధన్ ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. చదవండి: హైకోర్టు ఉత్తర్వు కాపీలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్ ఏమన్నారంటే.. పాఠశాల ఆవరణంలోకి చేరిన ఎస్సారెస్పీ నీళ్లు ఎస్సారెస్పీ కాలువ నీరు పాఠశాల ఆవరణలోకి చేరడంతో యాజమాన్యం సెలవు ప్రకటించింది. దీంతో తోటి మిత్రులు ఫిరోజ్, శ్రీతరుణ్తో కలిసి ఈతకు వెళ్లాడు. ముగ్గురు కాలువలోకి దిగారు. అయితే విష్ణువర్ధన్ నీటిలో అడుగుభాగంలో ఉన్న పూడికలో దిగబడి మునిగిపోయాడు. పాఠశాల యథావిధిగా నిర్వహించి ఉంటే విష్ణువర్ధన్ ఈతకు వెళ్లేవాడే కాదని, సెలవు ఇవ్వడంతోనే సరదా కోసం ఈతకెళ్లి తిరిగి రాని లోకాలు చేరాడని స్థానికులు కంటతడి పెట్టారు. కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు సింగరేణి సంస్థ ఓసీపీ–2 ఓబీ యార్డును ఆనుకుని కాలువ పనులు నిర్వహిస్తున్న ఎన్టీపీసీకి చెందిన కాంట్రాక్టర్ పని స్థలంలో ఎలాంటి రక్షణ చర్యలూ తీసుకోకపోవడంతోనే తన కొడుకు చనిపోయాడని రాజ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ మేరకు కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై కటికె రవిప్రసాద్ తెలిపారు. -
కర్నూలులో విషాదం.. ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి
సాక్షి, కర్నూలు జిల్లా: నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో విషాదం అలుముకుంది. అల్లూరు పెద్ద కుంటలో ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. ముగ్గురు మృతులు విశాల్,శరత్,మహేష్‌గా గుర్తించారు. విద్యార్థుల మృతదేహాలను గ్రామస్తులు కుంటలో నుంచి బయటకు తీశారు. విద్యార్థుల మృతదేహాలకు ఎమ్మెల్యే ఆర్థర్ నివాళులు అర్పించారు. చదవండి: తిరుపతి కేంద్రంగా ‘జియో నెక్ట్స్’.. ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ.. -
గోదావరిలో మునిగి ఇద్దరు అమ్మాయిల మృతి
సాక్షి, భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరిలో నీటమునిగి ఇద్దరు మృతి చెందారు. పట్టణం లోని కొత్త కాలనీకి చెందిన స్వాతి శుక్రవారం బట్టలు ఉతికేందుకు గోదావరికి వెళ్లారు. కూతురు మధు, మేనకోడలు ప్రవళిక కూడా ఆమెతోపాటు వెళ్లారు. అయితే స్వాతి బట్టలు ఉతుకుతున్న క్రమంలో మధు, ప్రవళిక గోదావరి నీటిలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. -
చెరువులో పడి ఐదుగురు బాలికలు మృతి
ముంబై: ప్రమాదవశాత్తు చెరువలో పడి ఐదుగురు బాలికలు మరణించిన ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లా భోకార్డన్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రోజున తలేగావ్ వాడీ గ్రామానికి చెందిన ఆరుగురు బాలికలు కలిసి బట్టలు ఉతికేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ చెరువులోకి దిగిన ఐదుగురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువు పూడికలో చిక్కుకుపోయారు. అటుగా వెళ్తున్న వారు బాలికల్ని రక్షించడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. చదవండి: ‘అమ్మ’మ్మలే హతమార్చారు.. పూడికలో చిక్కుకుపోయిన బాలికలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా.. వారు అప్పటికే మృతిచెందినట్లు ఫూలంబ్రీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులు తెలిపారు. దీంతో ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా.. మరణించిన బాలికలను అశుబీ లతీఫ్ పఠాన్ (6), నబియా నవాజ్ పఠాన్ (6), అల్ఫియా గౌస్ ఖాన్ పఠాన్ (7), సానియా అస్లాం పఠాన్ (6), షాబు అస్లాం పఠాన్ (5)గా గుర్తించారు. చదవండి: నదిలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి -
మరణంలోనూ వీడని అన్నదమ్ముల బంధం
సాక్షి, శెట్టూరు: బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు చిన్నారులను చెరువు మింగేసింది. నీటమునుగుతున్న తమ్ముడిని రక్షించేందుకు ప్రయత్నించి అన్న కూడా జల సమాధి అయ్యాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారులిద్దరూ మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటన శెట్టూరు మండలం కరిడిపల్లిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శెట్టూరు మండలం కరిడిపల్లికి చెందిన గోవిందయ్య, మహంతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు బన్నీ (10)ఐదో తరగతి, చిన్న కుమారుడు బాలు (7) రెండో తరగతి చదువుతున్నారు. శుక్రవారం కృష్ణాష్టమి సెలవు కావడంతో ఇంటివద్దే ఉన్నారు. సాయంత్రం గ్రామానికి చెందిన హర్షవర్ధన్ అనే మరో బాలుడితో కలిసి అన్నదమ్ములిద్దరూ బహిర్భూమికని గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. బాలు, బన్నీ పోటీపడుతూ నీళ్లున్న గుంత వద్దకు పరుగులు తీశారు. బాలు కాలు జారి గుంతలోకి పడిపోయాడు. తమ్ముడిని కాపాడేందుకని బన్నీ చేయందించాడు. అయితే గుంత లోతుగా ఉండటంతో బాలు మునిగిపోయాడు. అదే క్రమంలో తమ్ముని చేయి పట్టుకున్న బన్నీ కూడా అందులోకి పడిపోయాడు. ఇద్దరూ మునిగిపోతుండటం గట్టున ఉన్న హర్షవర్ధన్ గమనించి పరుగున ఊరిలోకి వెళ్లి బాలు, బన్నీల పిన్నమ్మ ఈశ్వరమ్మకు జరిగిన విషయం చెప్పాడు. వెంటనే ఆమె స్థానికులను పిలిచుకుని చెరువు వద్దకు పరుగులు పెట్టింది. పదిమందికి పైగా గ్రామస్తులు చెరువులోకి దిగి ఇద్దరు చిన్నారులను బయటికి తీసుకొచ్చారు. అయితే అప్పటికీ బన్నీ, బాలు ప్రాణాలు విడిచారు. సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ నాగరాజు, ఎంఈఓ శ్రీధర్, వీఆర్వో గంగాధర్‌లు పరిశీలించి, కేసు నమోదు చేశారు. దేవుడా.. ఎంత పనిచేశావయ్యా..! గోవిందయ్య శుక్రవారం గ్రామ సమీపంలోని గొర్రెల మేపుకోసం వెళ్లాడు. భార్య మహంతమ్మ ఓ రైతు పొలంలో టమాట పంటను తొలగించడానికి కూలి పనులకు వెళ్లింది. పొలం పని ముగించుకుని వచ్చాక పిల్లల్ని ఇంటి వద్దే ఉంచి ఆమె గొర్రెల మేపు కోసం వెళ్లిన భర్త వద్దకు వెళ్లింది. సాయంత్రం వేళ ఇద్దరు కుమారులు చెరువులో పడ్డారని వార్త వినగానే తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తూ పరుగులు పెడుతూ చెరువు వద్దకు వచ్చారు. చెరువు గట్టుపై విగత జీవులుగా పడి ఉన్న కుమారులను చూసి రోదించడం అందరినీ కలచివేసింది. ‘ఇంటివద్దే ఆట్లాడుకుంటుంటారనుకునిపోతినే...అంతలోపే ఇలా...దేవుడు ఇంత అన్యాయం చేశాడా...ఒకేసారి ఇద్దరినీ పొట్టన పెట్టుకుంటాడా...అయ్యో..మేము ఏం పాపం చేశాము దేవుడా...’ అంటూ మహంతమ్మ కన్నీటి పర్యంతమైంది. బాధిత కుటుంబానికి పరామర్శ చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన తెలుసుకున్న శెట్టూరు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సోమనాథ్‌రెడ్డి, నాయకులు హరినాథ్‌రెడ్డి, ఎంఎస్‌రాయుడు, తిప్పేస్వామి, రామకృష్ణ, తిమ్మరాజు, లింగప్ప, శ్యాంసుందర్‌చౌదరి, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. -
చెరువులో పడి వ్యక్తి మృతి
దౌల్తాబాద్(మెదక్ జిల్లా): దౌల్తాబాద్ మండలం రాందాస్ చెరువులో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు దౌల్తాబాద్ గ్రామానికి చెందిన చాకలి నారాయణ(45)గా గుర్తించారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్ పరీక్షలకు వెళ్తు...
కర్నూలు జిల్లా గోకులపాడులో విషాదం చోటు చేసుకుంది. నెరవాడ వాగులో పడి తండ్రీకూతురు, మరో విద్యార్థిని గల్లంతయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా వాగులో కొట్టుకుని పోతున్న తండ్రి మృతదేహన్ని స్థానికులు కనుగొని, ఒడ్డుకు తీసుకువచ్చారు. విద్యార్థినుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు స్థానికులు ముమ్మరం చేశారు. కన్న కూతురితో పాటు మరో విద్యార్థిని ఇంటర్ పరీక్షలకు తీసుకుని వెళ్తుండగా ఆ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు.