
పుణె: మహారాష్ట్రలో ప్రముఖ పర్యాటక ప్రాంతం భూషీ ఆనకట్ట దిగువన ఉన్న జలపాతంలో వద్ద ఒక కుటుంబం కొట్టుకుపోయింది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో వరదనీటి ప్రవాహం జలపాతం వద్ద పోటెత్తింది.
హదాప్సార్ నుంచి వచి్చన అన్సారీ కుటుంబం ఇదే సమయంలో జలపాతం వద్ద ఉంది. ప్రవాహం ధాటికి అంతా కొట్టుకుపోయారు. ఈ ఘటనలో 36 ఏళ్ల శహిష్ట అన్సారీ, 13 ఏళ్ల అమీమీ, ఎనిమిదేళ్ల ఉమేరాల మృతదేహాలను దిగువన కనుగొన్నారు. ఇద్దరి జాడ గల్లంతైంది.

Comments
Please login to add a commentAdd a comment