గత ఎన్నికలతో పోలిస్తే 47 సీట్లు అధికం పడిలేచిన కాంగ్రెస్!
పోటీ చేసిన 328 స్థానాలకుగాను 99 స్థానాల్లో విజయం
రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్పు ప్రచారా్రస్తాలుగా ‘కమలం’పై ఎదురుదాడి
సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే బీజేపీ కలలకు బ్రేక్
కేంద్రంలో ముచ్చటగా మూడోసారీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న బీజేపీ కలలను కాంగ్రెస్ చిత్తు చేసింది. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ నినాదంతో బరిలో దిగిన బీజేపీని అటు సొంత బలంతో, ఇటు కూటమి పక్షాల సహకారంతో తుత్తునియలు చేసింది. అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ ఆమడదూరంలో ఆగినా పడిలేచిన కెరటంలా సత్తా చాటింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ చేసిన ప్రచారం ఓ వైపు.. ప్రాంతీయ పారీ్టల ఓట్లు చీలకుండా తీసుకున్న జాగ్రత్తలు ఇంకోవైపు.. పార్టీ గుప్పించిన హామీలు మరోవైపు... కలిపి బీజేపీని కలవరపాటుకు గురిచేయడంలో విజయవంతమయ్యాయి...
⇒ లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 328 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 99 సీట్లు సాధించింది. 2019 నాటి కంటే 47 సీట్లు అధికంగా గెలుచుకుంది.
⇒కూటమి పక్షాల భాగస్వామ్యంతో ఈసారి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ గట్టిగా కృషిచేసింది. విపక్షాల మధ్య ఓట్ల చీలికను నివారించేందుకు తాను పోటీ చేసే స్థానాల సంఖ్యను తగ్గించుకుంది.
⇒ రాజస్తాన్, కర్ణాటక, హరియాణా, పంజాబ్‌ల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది.
⇒రాజస్తాన్‌లో బీజేపీపై రైతుల్లో ఆగ్రహాన్ని, రాజ్‌పుత్‌ల్లో ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ సొమ్ము చేసుకుంది. 2019లో 25 స్థానాలనూ బీజేపీ క్లీన్‌స్వీప్ చేయగా ఈసారి కాంగ్రెస్ 8 గెలిచింది. హరియాణాలోనూ గత ఎన్నికల్లో బీజేపీ 10కి 10 గెలవగా ఈసారి కాంగ్రెస్ 5 గెలిచింది.
⇒80 స్థానాలున్న కీలకమైన యూపీలో ఓట్ల చీలికకు ఆస్కారమివ్వకుండా సమాజ్‌వాదీ
పారీ్టకి 63 సీట్లిచి్చంది. ఇది ముస్లిం ఓట్లను ఏకీకృతం చేయడంతోపాటు ఓట్ల చీలికను నివారించింది. ఫలితంగా ఎస్పీ ఏకంగా 37 సీట్లు సాధించి బీజేపీని తేరుకోలేని దెబ్బ కొట్టింది.
⇒తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్‌పవార్), కేరళ, బిహార్, యూపీ, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో సీపీఐ(ఎం), ఐయూఎంఎల్, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, జేఎంఎం, కేరళ కాంగ్రెస్, ఆర్‌సీపీలతో ముందస్తు పొత్తులు కూడా కాంగ్రెస్‌కు లాభించాయి.
⇒బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వే షన్లు రద్దవుతాయంటూ కాంగ్రెస్ సహా విపక్షా లన్నీ ప్రచారం చేసిన ప్రచారం బాగానే ఫలించింది. ఆ ఉద్దేశమే లేదని మోదీ, బీజేపీ ఎంత చెప్పినా దేశంలో 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఓస్టీ, ఓబీసీల్లో అనుమానాలు తొలగలేదు.
⇒ఎన్డీఏకు 400 కన్నా ఎక్కువ సీట్లొస్తే రాజ్యాంగాన్ని, పలు చట్టాలను మార్చేస్తారన్న కాంగ్రెస్ ప్రచారమూ ఓటర్లను ప్రభావితం చేసింది.
⇒ఎన్నికల ముంగిట జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు కక్ష సాధింపేనంటూ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విపక్షాలు సఫలీకృతమయ్యాయి.
⇒ బీజేపీ ఓటమే లక్ష్యంగా సీట్ల పంపకంలో పట్టు విడుపులతో వ్యవహరించిన కాంగ్రెస్, ప్రచారం, సమన్వయం, వ్యూహ రచనలో మాత్రం ఎక్కడా తగ్గలేదు.
⇒రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నేతల మధ్య విభేదాలను పక్కన పెట్టేలా చేసింది. మిత్రులెవరో, శత్రువులెవరో తేలిపోయింది.
⇒రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో ఆకట్టుకుంది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచడమే తమ తొలి ప్రాధాన్య మని ప్రకటించింది. రైతులకు వడ్డీలేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది.
⇒యువత కోసం 30 లక్షల ఉద్యోగాల భర్తీ, 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ప్రతి డిప్లొమా లేక డిగ్రీ హోల్డర్‌కు అప్రెంటీస్íÙప్ శిక్షణ కోసం రూ. లక్ష సాయం, 30 ఏళ్లలోపు యువకుల స్టార్టప్‌ల కు నిధులు సమకూర్చడానికి రూ.5,000 కోట్ల తో కార్పస్ ఫండ్ ఏర్పాటు, పేపర్ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం వంటి హామీలు ఇచ్చింది.
⇒నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏటా రూ.లక్ష సాయం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ వంటి అంశాలు కాంగ్రెస్‌కు సీట్ల సంఖ్యను పెంచుకొనేందుకు దోహదం చేశాయి.
⇒కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ అనారోగ్యంతో ఇంటికే పరిమితమైనా విపక్షాలను ఒక్కతాటిపైకి తేవడంలో, ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. – సాక్షి, న్యూఢిల్లీ
నేటి భేటీలో ప్రధాని అభ్యర్థి ఖరారు: ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: ప్రతిపక్ష ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని శివసేన (యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. బుధవారం ఢిల్లీలో సమావేశమై, ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని ఠాక్రే అన్నారు. ప్రస్తుత ఎన్ని కల ఫలితాల సరళిని బట్టి చూస్తే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ 272 మార్కును బీజేపీ పొందే అవకాశాలు కనిపించడం లేదన్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో కూటమిలోని కాంగ్రెస్, ఇతర పక్షాలు టచ్‌లో ఉన్నాయని వివరించారు. వీరిని కూటమిలో చేర్చుకునేందుకు గల అవకాశాలను చర్చిస్తున్నామని చెప్పారు. గతంలో, బీజేపీ కారణంగా ఇబ్బందులు పడిన వీరిద్దరే ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారని ఠాక్రే వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment