దక్షిణకొరియాలో నేడే ఎన్నికలు  | South Korea to Vote in Assembly Election on April 10 | Sakshi
Sakshi News home page

దక్షిణకొరియాలో నేడే ఎన్నికలు 

Published Wed, Apr 10 2024 3:08 AM | Last Updated on Wed, Apr 10 2024 3:08 AM

South Korea to Vote in Assembly Election on April 10 - Sakshi

సియోల్‌:  దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్‌) ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఎన్నికలు జరుగబోతున్నాయి. మొత్తం 300 స్థానాలున్న పార్లమెంట్‌లో 254 స్థానాలను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీచేస్తారు. మిగిలిన 46 స్థానాలను చిన్నాచితక పారీ్టలకు వాటికి లభించిన ఓట్ల శాతం ఆధారంగా కేటాయిస్తారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార పీపుల్‌ పవర్‌ పార్టీ, ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ పోటీ పడుతున్నాయి. దేశంలో మొత్తం 4.4 కోట్ల మంది ఓటర్లున్నారు. ఈసారి రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వేలు చెబుతున్నాయి.

ఈ ఎన్నికలు పీపుల్‌ పవర్‌ పార్టీ నేత, అధ్యక్షుడు యూన్‌ సుక్‌ ఇయోల్‌ పరిపాలనకు రిఫరెండమ్‌ అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆయన 2022లో అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చారు. మరో మూడేళ్ల పదవీ కాలం మిగిలి ఉంది. ఈ ఎన్నికల్లో పీపుల్‌ పవర్‌ పార్టీకి తక్కువ స్థానాలు వస్తే యూన్‌ సుక్‌ ఇయోల్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆయనను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకోవచ్చు. మరోవైపు డెమొక్రటిక్‌ పార్టీ నాయకుడు లీ జే–మ్యూంగ్‌ ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలచుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. సర్వే కూడా అదే అంచనా వేస్తున్నాయి. పార్లమెంట్‌లో ప్రతిపక్షం ఆధిక్యం పెరిగితే పరిపాలన పరంగా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ ఇయోల్‌కు కొత్త సవాళ్లు ఎదురవుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement