
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ మూడు మూడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. తొలుత ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని కొండేపి నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇప్పటికే టంగుటూరు చేరుకున్నారాయన.
టంగుటూరు బొమ్మల సెంటర్‌లో YSRCP నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారాయన. ఇక సీఎం జగన్ రాక సందర్భంగా ఆప్రాంతంలో సందడి నెలకొంది. కొండేపి, సింగరాయకొండ, టంగుటూరు, జరుగునల్లి, పొన్నలూరు మండలాల నుంచి భారీగా జనం చేరుకున్నారు.
టంగుటూరు సభ అనంతరం వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజక వర్గం పరిధిలోని మైదుకూరు జంక్షన్‌లో, ఆ తర్వాత సాయంత్రం రాజంపేట పరిధిలోని పీలేరు నియోజకవర్గం కలికిరి ప్రచార సభల్లో ప్రజల్ని ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment