
రాబోయే సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్‌ల సొంతంగా బరిలోకి దిగుతామని ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో భాగస్వామ్య పార్టీగా కాకుండా తాము సొంతంగా పోటీ చేస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వెల్లడించిన సంగతి విదితమే. ఇక.. తాజాగా హర్యాణ రాష్ట్రంలో ఆప్ మరో నిర్ణయం తీసుకుంది.
హర్యాణ అసెంబ్లీలో తాము ఎవరితో పొత్తు పెట్టుకొమని.. అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం తెలిపారు. జింద్ పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. హర్యాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 90 కాగా... పార్లమెంట్ ఎన్నికల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికలో మాత్రం హర్యాణలో ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో భాగస్వామ్య పక్షంగా పోటీ చేస్తామని చెప్పారు.
‘ప్రస్తుతం ప్రజలంతా ఒకే పార్టీపై నమ్మకం పెట్టుకున్నారు.. అదే ఆమ్ ఆద్మీ పార్టీ. ఒకవైపు పంజాబ్.. మరోవైపు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఉంది. ఢిల్లీ, పంజాబ్ ప్రజలు పాలనలో మార్పు కోరి చాలా సంతోషంగా ఉన్నారు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. హర్యాణలో కూడా ఆప్ పార్టీ గెలిస్తే.. ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. అందుకే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఆప్ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు.
చదవండి: బిహార్‌లో ఇప్పుడే అసలైన ఆట మొదలైంది: తేజస్వీ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment