నేడు ఉమ్మడి నల్లగొండకు సీఎం కేసీఆర్‌ | CM KCR Tour To Nalgonda District | Sakshi
Sakshi News home page

నేడు ఉమ్మడి నల్లగొండకు సీఎం కేసీఆర్‌

Published Tue, Oct 31 2023 2:58 AM | Last Updated on Tue, Oct 31 2023 2:58 AM

CM KCR Tour To Nalgonda District - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఆయన ప్రచారం చేయనున్నారు.

ముందుగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించే ప్రజా ఆశీర్వాదసభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మిర్యాలగూడ, సాయంత్రం 4 గంటలకు దేవరకొండలో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో అభ్యర్థులు, ఆయా నియోజకవర్గ బాధ్యులు, నాయకులు సభల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement