మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచార వేగం పెంచారు. ప్రతిపక్షాల కంటే వేగంగా ముందుకు దూసుకెళ్తున్నారు. గడపగడపకూ వెళ్లి ప్రతి ఓటరును కలుస్తూ తమకు ఓటెయ్యాలని అభ్యర్థిస్తున్నారు. ప్రధానంగా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో గులాబీ అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారంలో ముందున్నారు. తమ పార్టీ అధినేత ఆదేశాల మేరకు మొదటి దశ ప్రచారం పూర్తి చేసి రెండోదశకు సిద్ధమవుతున్నారు.
సాక్షి, యాదాద్రి : జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి మరింత పదునుబెట్టారు. ఎన్నికలకు రెండు నెలలు గడువు ఉండడంతో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి గడప, ఓటరును తట్టే దిశగా ముందుకు సాగుతున్నారు. అంతే కాకుండా వీలైనంత త్వరగా మొదటి దశ ప్రచారం పూర్తి చేసి రెండో దశ మొదలు పెట్టాలని అధినేత నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అభ్యర్థులు మరింత దూకుడు పెంచారు. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ఈ నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రత్యర్థులపై పైచేయి సాధించే విధంగా వలసలను ప్రోత్సహిస్తున్న తాజా, మాజీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. గతనెల 6న సీఎం కేసీఆర్ శాసనసభను రద్దు చేసిన వెంటనే అభ్యర్థులను ప్రకటించారు. సిట్టింగ్‌లకే సీట్లు ఇచ్చిన విషయం తెలి సిందే. దీంతో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
పనిలో పనిగా..
ఎన్నికల ప్రచారానికితోడు పనిలో పనిగా టీఆర్‌ఎ స్ అభ్యర్థులు వలసలను ప్రోత్సహిస్తూ వందలా ది మందికి టీఆర్‌ఎస్ కండువాలు కప్పుతున్నారు. అసంతృప్తివాదులను కలుసుకుంటూ వారిని బు జ్జగించి తమ వైపు తిప్పుకుంటున్నారు. అసెంబ్లీ రద్దుకు ముందే ఆయా నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నల్లగొండలో నిర్వహించిన ఆశీ ర్వాద సభతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ పె రిగింది. ఎన్నికల షెడ్యూల్ రావడంతోప్రచారానికి మరింత సమయం లభించినట్లయింది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తాము వ్యక్తిగతంగా చేసిన పనులను వివరిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎవరికీ చిక్కకుండా..
మహాకూటమి, బీజేపీ, బీఎల్‌ఎఫ్‌తోపాటు బలమైన ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉండే అవకాశం ఉంది. కాగా మహాకూటమి అభ్యర్థులు ఎవరన్నది ఒక స్పష్టత వచ్చినప్పటికీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఇండిపెండెంట్లు కూడా బ లంగానే రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గులాబీ అభ్యర్థులు ఎవరికి చిక్కకుండా.. ప్రతిపక్షాల అంచనాలకు అందకుండా ప్రచారంలో ముందంజలో దూసుకుపోతున్నారు.
భువనగిరిలో..: తాజా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ త న మార్క్ ప్రచారం కొనసాగిస్తున్నారు. అసంతృప్తివాదులను బుజ్జగించడంలో సఫలమయ్యారు. తొలుత అసంతృప్తివాదులు గళం విప్పినప్పటికీ క్రమంగా వారి సంఖ్య తగ్గిపోయింది. అభ్యర్థిత్వం ఖరారైన నాటినుంచి గ్రామాల్లో పర్యటిస్తూ అందరినీ ఏకతాటిపైకి తేవడంలో సఫలీకృతులవుతున్నారు. ప్రధానంగా గ్రామసభలు నిర్వహిస్తూ చే సిన అభివృద్ధిని చెప్పుతున్నారు. పైళ్ల ఫౌండేషన్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలు వివరిస్తూ ముందుకుపోతున్నారు. గ్రామ, మండలస్థాయి పార్టీ నాయకులు, యువజన సంఘాలు, అన్ని వర్గాలకు చెందిన వారితో ఎప్పటికప్పుడు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, మహాకూటమి అభ్యర్థులు ఇంకా తేలలేదు. అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి కుంభం అనిల్‌కుమార్‌రె డ్డి, మహాకూటమి తరపున జిట్టా బాలకృష్ణారెడ్డి, బీజేపీ తరపున పీవీ శ్యామ్‌సుందర్‌రావు ప్రచారం చేస్తున్నారు. సీపీఎం అభ్యర్థి కూడా బరిలో ఉండనున్నారు. బహుముఖ పోటీ తప్పేలా లేదు.
ఆలేరు నియోజకవర్గంలో..
ప్రభుత్వ విప్, తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సు నీత విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమె భర్త టీఆర్‌ఎస్ నేత గొంగిడి మహేందర్‌రెడ్డి ప్రచారా న్ని భుజాన వేసుకుని నడిపిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మైనార్టీ, యువజన సంఘాలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ కేడర్‌లో జోష్ పెం చుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ మరోసారి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నా రు. వారు చేసిన అభివృద్ధిని కరపత్రాల ద్వారా వి వరిస్తున్నారు.మరోవైపు టికెట్ ఖరారు కానప్పటికీ డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్ ప్రచారం సాగిస్తున్నారు.మరికొందరు టికెట్ వేటలో ఉండడం ఆసక్తి నెలకొంది. మాజీ మంత్రి మోత్కుపల్లి న ర్సింహులుతో పాటు బీజేపీ, బీఎల్‌ఎఫ్‌ల అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. జిల్లా పరిధి లోకి వచ్చే తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లోని ఐదు మండలాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment