బుధవారం ఈ విషయం తేలుస్తామన్న రాహుల్
నేడు ఇండియా కూటమి సమావేశం
రెండు చోట్లా రాహుల్ గెలుపు..
సాక్షి, న్యూఢిల్లీ: పాత మిత్రపక్షాలతో జట్టుకట్టే అంశంపై విపక్షాల ‘ఇండియా’ కూటమి నేతలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. మిత్రపక్షాలతో చర్చించకుండా జేడీ(యూ), తెలుగుదేశం పార్టీ వంటి పాత మిత్రులను చేర్చుకునే అంశంపై సొంత నిర్ణయం తీసుకోబోమని తేలి్చచెప్పింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాం«దీ, సోనియా గాం«దీలు మంగళవారం పార్టీ కారాల్యయంలో మీడియాతో మాట్లాడారు. సాయంత్ర ఆరు గంటలకు ఢిల్లీలోని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నివాసంలో ‘ఇండియా’ కూటమి భేటీకానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సోనియా, రాహుల్, శరద్ పవార్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, చంపయి సోరెన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, సీతారాం ఏచూరి, డి.రాజా ఈ భేటీలో పాల్గొననున్నారు.
నేడు ఇండియా కూటమి సమావేశం: రాహుల్
‘‘ విపక్షాల ‘ఇండియా’ కూటమి సమావేశం బుధవారం నిర్వహిస్తాం. మా కూటమి నేతల అభిప్రాయం అడగకుండా మేం ఎలాంటి నిర్ణయాలు ప్రకటించలేం. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా వ్యూహరచన, తీసుకోవాల్సిన నిర్ణయాలపై బుధవారం మా కూటమి పక్షాలు ప్రధానంగా చర్చిస్తాయి. దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా కలిసి నడుస్తారని ముందే అనుకున్నా. రాజ్యాంగాన్ని కాపాడేందుకు పడిన తొలి అడుగు ఇది.
ఈసారి ఎన్నికల్లో పేదలతోపాటు అణగారిన వర్గాలు మాకు అండగా నిలబడ్డాయి. పేదల అభ్యున్నతికి పాటుపడే కొత్త మార్గదర్శకత్వాన్ని కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి అందించనున్నాయి. ఈ ఎన్నికలు, దేశం ఒక్కటే విషయాన్ని చెప్పదల్చుకున్నాయి. మోదీ, అమిత్‌షా పాలనలో దేశం మగ్గిపోవాల్సిన పనిలేదని చాటాయి. కూటమి పారీ్టలన్నీ ఐక్యమత్యంతో పోరాడాయి. కాంగ్రెస్‌కు మద్దతు పలికిన ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. నేను వయనాడ్, రాయ్‌బరేలీ రెండు స్థానాల్లో గెలిచినా ఏ స్థానాన్ని వదులుకోవాలో ప్రజలతో మాట్లాడి నిర్ణయిస్తా. ప్రజలకు ఇచి్చన హామీలను నెరవేర్చుతాం’ అని రాహుల్ అన్నారు.
మోదీ వ్యతిరేక ప్రజాతీర్పు ఇది: ఖర్గే
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రజాతీర్పు ఇది అని ఫలితాలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘ ఒకే వ్యక్తి పేరుతో బీజేపీ ఓట్లు అడిగింది. ఇది మోదీ రాజకీయ, నైతిక పరాజయం. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోదీ అసత్య ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలకు ప్రజల మద్దతు లభించింది. మోదీకి మరో అవకాశం ఇస్తే ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని ప్రజలు గ్రహించారు. పార్టీని గెలిపించిన కార్యకర్తలకు ధన్యవాదాలు. విజయం కోసం ఐక్యంగా పనిచేసిన ఇండియా కూటమి నేతలకు ధన్యవాదాలు’’ అని ఖర్గే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment