
నా భర్తను, నన్ను ఇద్దరిని ఇంటి నుంచి బయటకు లాగి కొట్టారని తెలిపింది. తమ కారును కూడా ధ్వంసం చేశారని వాపోయింది.
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకోలది భారతీయ జనాతా పార్టీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయాలు మరింత హీట్‌ను పుట్టిస్తున్నాయి. కాగా, ఇరుపార్టీలు ఏదో ఒక ఘటనతో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, బీజేపీ పార్టీకి చెందిన ఒక కార్యకర్త ఇంటిపై తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు దాడిచేశారని ఒక మహిళ ఆరోపించింది. ‘తన భర్తను, నన్ను ఇద్దరిని ఇంటి నుంచి బయటకు లాగి కొట్టారని తెలిపింది. తమ కారును కూడా ధ్వంసం చేశారని వాపోయింది. అయితే, ఆదివారం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సదరు మహిళ తెలిపింది.
అయితే దీనిపై స్పందించిన తృణముల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చిత్తరంజన్ మండల్ ఈ ఆరోపణలను ఖండించాడు. ఈ ఘటనతో తమ వారికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. కాగా, వారు తమకారును తామే ధ్వంసం చేసుకుని కావాలనే తమపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. భారతీయ జనాతపార్టీ ప్రతి విషయాన్నిరాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.