గెస్ట్‌ హౌజ్‌లో విద్యార్థినిపై అత్యాచారం.. ఫొటోలు, వీడియోలు తీసి..  | Teacher Held For Harassing Student At West Bengal | Sakshi
Sakshi News home page

క్లాస్‌ పేరుతో విద్యార్థినిపై లైంగిక దాడి.. ఫొటోలు, వీడియోలు తీసి.. 

Apr 2 2022 10:01 PM | Updated on Apr 2 2022 10:03 PM

Teacher Held For Harassing Student At West Bengal - Sakshi

కోల్‌కత్తా: పాఠాలు చెబుతానని విద్యార్ధినిని గెస్ట్ హౌస్‌కు పిలిపించి టీచర్‌.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో లైంగిక దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్‌ చేస్తానని బెదిరింపులకు గురి చేశాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కత్తాలో సెంగార్‌ అనే వ్యక్తి యూపీఎస్‌సీ కోచింగ్ సెంట‌ర్‌లో జాగ్ర‌ఫీ బోధిస్తున్నాడు. ఈ క్రమంలో గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఎక్స్‌ట్రా క్లాస్ పేరుతో విద్యార్ధినిని సాల్ట్‌లేక్ గెస్ట్ హౌస్‌కు పిలిపించుకున్నాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఈ క్రమంలో ఫొటోలు, వీడియోలు కూడా తీశాడు. ఇదిలా ఉండగా.. మరోసారి ఆమెను కలిసేందుకు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో గ్వాలియ‌ర్ రావాల‌ని విద్యార్ధినిని కోరాడు.

దీనికి ఆమె నిరాకరించింది. దీంతో తనకు రూ. 5 లక్షలు ఇవ్వాలని బ్లాక్‌ మెయిల్‌కు దిగాడు. అంతటితో ఆగకుండా గెస్ట్‌హౌస్‌లో తాను తీసిన వీడియోలు, ఫోటోలు లీక్ చేస్తాన‌ని బెదిరించాడు. ఈ నేపథ్యంలో సదరు యువతి.. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోల్‌క‌తాకు తీసుకువ‌చ్చి మేజిస్ట్రేట్ ఎదుట హాజ‌రుప‌రిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement