కోల్‌కతా: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న కోల్‌కతా ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకేసులో పలు అనుమానాలు, అటాప్సీ రిపోర్ట్‌లో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం (ఆగస్ట్13) ట్రైనీ డాక్టర్ ఆటాప్సీ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది.
అటాప్సీ రిపోర్ట్ ఆధారంగా..నిందితుడు సంజయ్ రాయ్ ట్రైనీ డాక్టర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రాణాలు తీసినట్లు తేలింది. అమానుషంగా లైంగిక దాడి కారణంగా బాధితురాలి అంతర్గత శరీర భాగాల్లో ఏర్పాడిన గాయాల కారణంగా రక్త స్త్రావమైంది. ఆగస్టు 9 తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య హత్య, అత్యాచారం జరిగి ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
నిందితుడి సంజయ్ రాయ్ నుంచి తప్పించుకునేందుకు ట్రైనీ డాక్టర్ ప్రతిఘటించడంతో ఆమె ఉదరం, పెదవులు, వేళ్లు, ఎడమ కాలుపై గాయాలయ్యాయని, నిందితుడు నుంచి చెరనుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిలువరించేందుకు ఆమె తలను గోడకు బాదాడు. దారుణానికి ఒడిగట్టే సమయంలో అరుపులు వినపడకుండా ఉండేందుకు నోరు, గొంతు బిగించాడు. దీంతో ఆమె మెడ ఎముకలు విరిగినట్లు పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది. అయితే, ఆమె కంటికి గాయం కావడానికి గల కారణాల్ని ఇంకా గుర్తించలేదు.
ఆత్మహత్య చేసుకుందంటూ ఫోన్ కాల్
మరోవైపు దారుణం వెలుగులోకి వచ్చిన రోజు ఆమె ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఫోన్ కాల్ చేసింది అసిస్టెంట్ సూపరింటెండెంట్ అని మీడియా కథనాలు చెబుతున్నాయి.
సంజయ్ రాయ్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా?
దీంతో ఇదే అంశంపై సూపరింటెండెంట్‌ను విచారించేందుకు పోలీసులు ఇవాళ లాల్‌బజార్ పీఎస్‌కు పిలిపించారు. తొలుత బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నారని తల్లిదండ్రులకు ఎందుకు ఫోన్ చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంజయ్ రాయ్‌తో పాటు ఇంకెవరైనా ఉన్న అన్న కోణంలో పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment