ట్రైనీ డాక్టర్‌ హత్యకేసు : వెలుగులోకి సంచలన విషయాలు | Shocking Details Of Kolkata Doctor Case | Sakshi
Sakshi News home page

ట్రైనీ డాక్టర్‌ హత్యకేసు : ఒళ్లు గగుర్పొడిచేలా వెలుగులోకి సంచలన విషయాలు

Published Sun, Aug 11 2024 4:53 PM | Last Updated on Tue, Aug 20 2024 11:26 AM

Shocking Details Of Kolkata Doctor Case

కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌ హత్యకేసులో ఒళ్లు గగుర్పొడిచేలా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

కోల్‌కతా ప్రభుత్వ ఆర్జీకార్‌ మెడికల్‌ కాలేజీలో దారుణ హత్యకు గురైన జూనియర్‌ డాక్టర్‌ అత్యాచారం, హత్య కేసులో విస్తుపోయేలా రిపోర్ట్‌ వచ్చింది. నిందితులు బాధితురాల్ని దారుణంగా అత్యాచారం చేసి, ఆపై హత్య చేసినట్లు పోలీస్‌ అధికారులు పీటీఐకి తెలిపారు.

ఆసుపత్రిలోని ఓ వైద్యుడు పీటీఐతో మాట్లాడుతూ..ప్రభుత్వ ఆర్జీకార్‌ మెడికల్‌ కాలేజీలో జూనియర్‌ డాక్టర్‌గా వైద్య సేవలందిస్తున్నారు. అయితే వైద్యురాలు గురువారం రాత్రి  విధులకు హాజరయ్యారు. ఆమె తెల్లవారు జామున 2 గంటలకు తన జూనియర్‌లతో కలిసి డిన్నర్ చేశారు. అనంతరం రెస్ట్‌ తీసుకునేందుకు ఆస్పత్రిలో రూంలు ఖాళీగా లేకపోవడంతో సెమినార్ గదికి వెళ్లారు. ఉదయం వచ్చి చూసేసరికి అర్ధనగ్నంగా శవమై కనిపించినట్లు చెప్పారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి శవపరీక్ష (అటాప్సీ)నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమికంగా బాధితురాలు అత్యాచారానికి గురైనట్లు చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు
వైద్యురాలి రెండు కళ్ళు, నోటి నుండి రక్తం, ముఖం, గోరుపై గాయాలు ఉన్నాయి. బాధితురాలి ప్రైవేట్ భాగాల నుండి రక్తస్రామైంది. ఆమె ఉదరం, ఎడమ కాలు..మెడ, ఆమె కుడి చేతిలో,ఉంగరపు వేలు,పెదవులపై గాయాలు ఉన్నాయి’ అని ఓ పోలీసు అధికారి పీటీఐకి చెప్పారు. ఆమెది ఆత్మహత్య కాదు..ముమ్మాటికి హత్య. అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఆమె మెడ ఎముక విరిగింది.  మొదట గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి అటాప్సీ రిపోర్ట్‌ కోసం ఎదురు చూస్తున్నాం’ అని సదరు పోలీస్‌ అధికారి చెప్పారు.  

నిందితుల్ని ఉరితీయాలి
ఈ ఘటనపై బీజేపీతో పాటు ప్రతిపక్షాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేయడంతో రాజకీయ దుమారం రేపింది. దీనిపై అధికార తృణమూల్ కాంగ్రెస్ ఏ ఏజెన్సీ ద్వారానైనా విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. నిందితుడికి మరణశిక్ష విధిస్తానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. అటువంటి కేసుల్లో దోషులుగా తేలిన వారికి  ఉరిశిక్ష లేదంటే ఎన్‌కౌంటర్ దీదీ మేనల్లుడు తృణమూల్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు.  

14 రోజుల పోలీస్‌ కస్టడీలో హంతకుడు
కాగా,జూనియర్‌ డాక్టర్‌ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో పోలీసులు ఓ బ్లూటూత్‌ను గుర్తించారు. వెంటనే ఆస్పత్రిలోని సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. ఆ పుటేజీ ఆధారంగా ఓ వాలంటీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని హంతకుడిగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడికి 14 రోజుల పోలీస్‌ కస్టడీకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. నిందితునిపై భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) 64 (అత్యాచారం), 103 (హత్య ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టు ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. ఆగస్టు 23 వరకు పోలీస్‌ కస్టడీకి అప్పగించారని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement