రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేము. ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ వెళ్తున్నా ఎదుటి వ్యక్తులు చేసే తప్పుల వల్ల ప్రాణాలపైకి వస్తుంది. అయితే, కొన్నిసార్లు అదృష్టం బాగుండి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడతారు. అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ రెప్పపాటులో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి వీసి సజ్జనార్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. త్రుటిలో తప్పించుకున్నా ఎన్నాళ్లు ఇలా అదృష్టంపై ఆధారపడతాం? రోడ్డుపై వెళ్తున్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి అంటూ రాసుకొచ్చారు.
వీడియోలో.. బిజీ రోడ్డులో ఓ మహిళ రోడ్డు పక్కన వెళ్తూ వీధి దారిని దాటుతుంటుంది. ఆ ముందే ఓ ఆటోను నిలిపి వేచి చూస్తుంటాడు డ్రైవర్. ఓ కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టగా బోల్తా పడింది. అయితే, రోడ్డుపై వెళ్తున్న మహిళ రెండు వాహనాల మధ్య నుంచి రెప్పపాటులో ప్రమాదం నుంచి బయటపడుతుంది. ఈ వీడియో వైరల్‌గా మారిన క్రమంలో రోడ్డుపై వెళ్లేప్పుడు బాధ్యతగా మెలగాలని, ప్రమాదల నివారణకు చట్టాలను పటిష్టం చేయాలని పలువురు కోరుతున్నారు.
Narrow escape but how long do we depend on luck?
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 1, 2022
Be responsible on Roads #RoadSafety pic.twitter.com/JEck2aXIuK
ఇదీ చదవండి: Viral Video: హనుమాన్ వేషాధారణతో డ్యాన్స్.. ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్పకూలడంతో..
Comments
Please login to add a commentAdd a comment