
సుస్మితా సేన్ తన పదేళ్ల చిన్న కూతురు అలీసాకు ఎప్పటికీ మర్చిపోలేని బర్త్ డే గిఫ్టును అందించారు. ఇటీవల అలీసా పుట్టిన సందర్భంగా ఆ చిన్నారిని మాల్దీవులకు తీసుకెళ్లి హిందూ మహాసముద్రంలో స్కూబా డైవింగ్ చేయించారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి, ‘‘నా కూతురు తన ఐదవ ఏట నుంచీ స్కూబా డైవింగ్ చేస్తానని అడుగుతోంది. నేనే తనకు మరింత వయసు రావడం కోసం ఆగాను’’ అని కామెంట్ పెట్టారు. డైవింగ్‌కి ముందు సుస్మిత అలీసాపై ఎన్ని ముద్దు మురిపాలు కురిపించారో చూడ్డం కోసమైనా ఈ వీడియోను చూడాల్సిందే. సుస్మితకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు రీనీ వయసు పందొమ్మిదేళ్లు. సుస్మిత వివాహం చేసుకోలేదు. ఇద్దరూ దత్త పుత్రికలు.