పుట్టినరోజున రూ.5 కోట్లతో అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన తండ్రి! | Businessman Gifts Lamborghini Huracan STO Worth Rs 5 Crore To His Son | Sakshi
Sakshi News home page

పుట్టినరోజున రూ.5 కోట్లతో అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన తండ్రి!

Published Fri, Apr 12 2024 3:14 PM | Last Updated on Fri, Apr 12 2024 3:27 PM

Businessman Gifted His Son A Lamborghini Huracan STO Worth Of Rs 5crs - Sakshi

కొడుకు పుట్టిన రోజున డ్రెస్‌, మొబైల్‌.. మరీకాదంటే బైక్‌లాంటివి గిఫ్ట్‌ ఇస్తుంటారు. ఇదంతా మధ్య తరగతివారికి తీపి జ్ఞాపకాలను మిగుల్చుతాయి. మరి ధనవంతుల ఇళ్లలో పుట్టినరోజుకు ఏం గిఫ్ట్‌ ఇస్తున్నారో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. ప్రముఖ వ్యాపారవేత్త వివేక్‌కుమార్‌ రుంగ్తా తన కుమారుడి బర్త్‌డే రోజున ఏకంగా రూ.5 కోట్లు విలువచేసే ‘లాంబోర్గినీ హురకాన్‌ ఎస్‌టీఓ’ మోడల్‌కారును బహుమానంగా ఇచ్చారు. ఈమేరకు తనకు గిఫ్ట్‌ ఇస్తుంటే తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది.

దుబాయ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న వీకేఆర్‌ గ్రూప్‌ అధినేత వివేక్‌కుమార్‌ రుంగ్తా తన కుమారుడు తరుష్‌ రుంగ్తా 18వ పుట్టిన రోజున అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దాంతో దుబాయ్‌లోని లాంబోర్గినీ సంస్థను సంప్రదించారు. కంపెనీ తయారుచేసిన హురకాన్‌ ఎస్‌టీఓ కారును కుమారుడికి బహుమతిగా ఇచ్చారు. 

ఇదీ చదవండి: ఐటీ జాబ్‌ కోసం వేచిచూస్తున్నారా.. టెకీలకు శుభవార్త

ఆ సూపర్ స్పోర్ట్స్ కారును చూసిన తరుష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా స్పందిస్తూ.. ‘నా 18వ పుట్టినరోజును డ్రీమ్‌కారు గిఫ్ట్‌గా ఇచ్చి మరింత అద్భుతంగా మార్చినందుకు నాన్నకు కృతజ్ఞతలు! తన ప్రేమాభిమానాలు ఎప్పటికే నాతోనే ఉంటాయి’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement