చిత్రం చెప్పింది | Sushmita Sen Puts End to Breakup Rumours | Sakshi
Sakshi News home page

చిత్రం చెప్పింది

Published Tue, Jul 2 2019 3:08 AM | Last Updated on Tue, Jul 2 2019 3:08 AM

Sushmita Sen Puts End to Breakup Rumours - Sakshi

రోహ్‌మన్, సుస్మితాసేన్‌

ప్రేమలో ఉన్నవాళ్లంతా పెళ్లి చేసుకుంటారని చెప్పలేం. లవ్‌కి బ్రేకప్‌ చెప్పుకునే జంటలు ఉంటాయి. ఇప్పుడు అందాల తార సుస్మితా సేన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ రోహ్‌మన్‌తో లవ్‌కి కటీఫ్‌ చెప్పారన్నది కొందరి ఊహ. ఆ ఊహ తప్పని ఇక్కడున్న చిత్రం చెప్పింది. చిత్రం అంటే ఫొటో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఫొటోని స్వయంగా సుస్మితా సేన్‌ విడుదల చేశారు. రోహ్‌మన్‌తో కలసి తాను జిమ్‌ చేస్తున్న ఫొటోను ఆమె బయటపెట్టారు. ఈ ఫొటో చాలు.. ఈ ఇద్దరూ విడిపోలేదని చెప్పడానికి. మరి పెళ్లెప్పుడూ అంటే.. ఇద్దరూ చేసుకున్నప్పుడు. ఆ విషయం గురించి మౌనం వహిస్తున్న ఈ ఇద్దరూ పార్టీల్లో, రెస్టారెంటుల్లో.. ఇలా చాలా చోట్ల జాయింట్‌గా కనిపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement