హరియణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్ ఇండియా’ మానుషి ఛిల్లర్.. మిస్ వరల్డ్ 2017 టైటిల్‌ను సాధించి భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పింది. మిస్ వరల్డ్ మానుషి.. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌ను విమానంలో కలిశారు. ఆమె మిస్ వరల్డ్ పోటీలకు రెడీ అవుతున్న సమయంలో వీరి కలయిక జరిగింది. ఈ బామలు ఇద్దరు కలిసి మాట్లాడుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో వారిద్దరూ మాట్లాడుకున్న తీరు అందరినీ ఆకర్షించింది. మానుషి.. ‘సుస్మితాను చూసి షాక్‌కు గురయ్యాను. ఆమె నన్ను అభిమానంతో’ పలకరించారు. అంతేకాక మానుషికి సుస్మితా సేన్ ఐడియాలిస్తూ.. ‘ మన వంతు ప్రయత్నాం మనం చేయాలి.. మిగతాది దేవుడి మీద భారం వేయాలని.. ఆల్ ది బెస్ట్’ అని చెబుతూ మానుషి చేతికి ముద్దు పెట్టిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
సుస్మితా సేన్ 1994 సంవత్సరంలోనే ఫెమినా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ టైటిల్‌లను కైవసం చేసుకున్నారు. ప్రపంచ అందగత్తెలంతా సొంతం చేసుకునేందుకు ఎంతగానే పరితపించే ప్రపంచ సుందరి కిరీటం 17 ఏళ్ల అనంతరం భారత్ వశమైంది.
Comments
Please login to add a commentAdd a comment