Successful Bollywood Actress Side Business Income Goes News Viral - Sakshi
Sakshi News home page

Bollywood Actresses Business: బాలీవుడ్ తారల సైడ్ బిజినెస్‌.. అత్యధిక సంపాదన ఆమెదే!

Jul 10 2023 5:27 PM | Updated on Jul 10 2023 5:57 PM

Bollywood Actresses Side Business Income Goes Viral News - Sakshi

బాలీవుడ్ హీరోయిన్లు రెమ్యూనరేషన్‌ విషయంలో హీరోలకు ఏ మాత్రం తీసిపోరు. జవాన్‌ చిత్రంలో నటిస్తోన్న దీపికా పదుకొణె భారీగానే పారితోషికం అందుకోనుంది. సినిమాలతో పాటు మరోవైపు యాడ్స్‌లో నటిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. గ్లామర్ ఫీల్డ్‌ వారికి సాధారణంగానే ఆదరణ ఓ రేంజ్‌లో ఉంటుంది. అలాంటి వ్యక్తులు నటనతో పాటు బిజినెస్‌పై దృష్టి సారిస్తున్నారు. సినిమాలతో పాటు వ్యాపారం రంగంలో రాణిస్తూ ఆదాయాన్ని మరింత పెంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ అగ్ర తారలు చేస్తున్న వ్యాపారాలపై ఓ లుక్కేద్దాం. బాలీవుడ్ టాప్ హీరోయిన్లు బిజినెస్‌లో కూడా జోరు కొనసాగిస్తున్నారు. కొంతమంది నటీమణులు  సైడ్ బిజినెస్ చేస్తూ పారిశ్రామికవేత్తలు కూడా రాణిస్తున్నారు. ఈ నటీమణులు తమ సైడ్ బిజినెస్ ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. 

ఆదిపురుష్ భామ కృతి సనన్: 

ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌లో నటించింది. పలు భాషల్లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రాలను అందించిన నటి కృతి సనన్ ఇటీవలే తన సోదరి నూపూర్‌తో కలిసి సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది. కాగా.. కృతి సనన్ నిర్మాణ సంస్థ పేరు బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్. తాను ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సినిమాలు చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. ఇదే ప్రొడక్షన్ హౌస్‌లో దో పట్టి సినిమా నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో నటి కాజోల్ కూడా నటిస్తోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

సీనియర్ నటి సుస్మితా సేన్

సుస్మితా సేన్: మరో బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితా సేన్ మంచి నటి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె జ్యువెలరీ బ్రాండ్‌ను కలిగి ఉన్నారు. అంతే కాకుండా తంత్ర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్‌కు యజమాని కూడా ఉన్నారు. సుస్మితకు అనేక హోటళ్లు, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. 2022 ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం సుస్మితా సేన్ బిజినెస్ టర్నోవర్ విలువ రూ.74 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.

విరాట్ భార్య అనుష్క శర్మ

అనుష్క శర్మ: బాలీవుడ్‌లో ఎన్నో హిట్ చిత్రాలను అందించిన నటీమణులలో అనుష్క శర్మ ఒకరు. అనుష్క తన సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించింది. ఆమె ప్రొడక్షన్ హౌస్ అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌తో పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంది. అనుష్కకు నుష్ అనే డ్రెస్ బ్రాండ్ వ్యాపారం కూడా ఉంది. విరాట్‌ కోహ్లీని పెళ్లి చేసుకున్న అనుష్క.. సినిమాల్లో కంటే బిజినెస్‌లోనే బాగా రాణిస్తోంది. 

దీపికా పదుకొణె

బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లో కూడా ఎన్నో సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. తాజాగా ఆమె షారూక్ ఖాన్ సరసన జవాన్‌ చిత్రంలో కనిపించనుంది. 'ఆల్ అబౌట్ యు' అనే దుస్తుల బ్రాండ్‌ను నడుపుతోంది. అంతే కాకుండా 'లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్' వ్యవస్థాపకురాలు కూడా. ఓ కథనం ప్రకారం దీపికా పదుకొణె బిజినెస్ నికర విలువ రూ.498 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురు బాలీవుడ్ హీరోయిన్స్‌తో పాటు.. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్‌వుడ్, కోలీవుడ్ సహా ఇతర సినీ రంగాలకు చెందిన పలువురు నటీమణులు సైతం.. సొంతంగా సైడ్ బిజినెస్‌లు చేస్తూ రెండు చేతులతో భారీగా సంపాదిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement